ప్రముఖ విద్యావేత్త డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి మరణం
మచిలీపట్నానికి చెందిన ప్రముఖ విద్యావేత్త తెలుగు సంస్కృతం ఇంగ్లిష్ హిందీ భాషావేత్త బహు గ్రంధకర్త మహా వక్త గొప్ప ఆలోచనా పరులు సహృదయశీలి ,అమృతహృదయులు నాకూ సరసభారతి మిక్కిలి ఆప్తులు డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారు హైదరాబాద్ లో 19-8-19 సోమవారం మరణించినట్లు సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి నిన్నరాత్రి 9 గంటలకు హైదరాబద్ లో ఉన్న నాకు ఫోన్ చేసి చెప్పింది ,వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను -దుర్గాప్రసాద్ -20-8-19-ఉయ్యూరు
—
నిత్య సాహితీ కృషీవలునిగా కీర్తిస్తు మాదిరాజు వారిని గురించి మీ పరిచయ వ్యాసం చాలా బాగుంది ప్రసాద్ గారు.. ధన్యవాదాలు..