‘స్తనదుగ్ధామృత మారగించుచు బొరిం జారుస్మితోల్లాస మా
ననబింబంబు నలంకరింప వికసన్నాళీకపత్రాభలో
చనదీప్తుల్ జననీముఖేందువు పయిన్ సంప్రీతి బర్వంగ నొ
ప్పు నిజాభీప్సితకల్పశాఖి గనియెన్ బుత్రుం బవిత్రోదయున్ ”
శకటాసురిడిని చంపి ,ఏమీ తెలియనట్లు ,హాయిగా యశోద స్తన దుగ్దామృతం తాగుతు,చిరునవ్వులు చిందిస్తున్న బాలకృష్ణుని భవ్య దివ్య మూర్తిని హరివంశం లో ఎర్రన వర్ణించిన పద్యం ఇది .
రేపు 23-8-19 శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
— సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
23-8-19శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి వారల దేవాలయం లో ఉదయం ,సాయంత్రం శ్రీ కృష్ణ పరమాత్మకు అష్టోత్తర, సహస్ర నామార్చన ,’’కట్టెకారం ,వెన్న’’ప్రత్యేక నైవేద్యాలు ఏర్పాటు చేయబడినాయి .
సాయంత్రం 6-30గం ‘లకు సరసభారతి 145వ కార్యక్రమంగా స్థానిక జిల్లాపరిషత్ ఇంగ్లీష్ మాస్టారు శ్రీ ఆయాచితుల త్రినాథ శర్మ గారి చే ‘’కృష్ణ చరితం ‘’పై ధార్మిక ప్రసంగం ,అనంతరం బాల బాలికల చేత రాధా ,గోపికా ,కృష్ణ వేషధారణ ప్రదర్శనగా ‘’శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ‘’నిర్వహించబడుతాయి .అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త
ఉయ్యూరు -22-8-19