కృష్ణుడు సూర్యుడి అవతారమా . — Andukuri Sastry
భారత భాగవతాలు చూస్తే బహుశ వ్యాసుడు ఉద్దేశ్యం అదేనేమో ననిపిస్తుంది .
సూక్ష్మంగా చెప్పాలంటే భారతం లో మొట్టమొదట కృష్ణుడు కనపడటం ద్రౌపది స్వయం వరంలో .అంతరార్థాళోకి వెళితే
అర్జునుడు పంచభూతాలలో అగ్ని. పాండవులు వరుసగా ఆకాశం వాయువు అగ్ని జలం భూములు .ఈదేవతలకు ఎప్పుడూ సూర్యుడే బలమిస్తాడు.దీనికి ఉపనిషత్ప్రమాణం ‘ ‘ఆదిత్యోవై దేవమధుః’ (అందుకే యుద్ధానికి ముందర వానరులు మధివనం లో మధువు తాగుతారు. మధువనం సూర్యుడి నుండి సుగ్రీవుని కి వచ్చింది .వానరులు చెట్లనుంచి వచ్చేప్రాణవాయువులు )
పాండవుల బలం కృష్ణుడే )
ఇక కృష్ణ జననం తోనే వ్యాసుడు కృష్ణుడు సూర్యుడని చేప్పాడు . మనకు సూర్యోదయం అయిన తరవాత సూర్యుడు కనబడుతాడు.కాని ఆయన మొదటి కిరణం భూమి మీద అర్థ రాత్రే పడుతుంది. సూర్యుడు XAxis దగ్గర ఉంటే మొదటి కిరణం y axis మీద పడుతుంది .అందుకే శివరాత్రి లింగోధ్బవ కాలం అర్థరాత్రి. రుద్రుడే సూర్యుడు గా కన పడతాడని నమకం చెబుతుంది ( అసౌయోzవసర్పతి నీలగ్రీవో
..అనేమంత్రంలో ) అందుకే
కృష్ణుడు అర్థరాత్రి పుట్టాడు . సూర్యుడు విష్ణువుగా
ఋగ్వేదం చెప్పింది’చతుర్భిః సాకం నవతిం ‘అనే౧౬౦౮ మంత్రంలో.కృష్ణుడికి విష్ణువు కి అభేదం అందరూ ఒప్పుకున్నదె
అయితే సూర్యుడు పుట్టగనే స్నానం చేయించాలి . లేకపోతే భూమి భస్మమయిపోతుంది.సూర్యుడు అవతారం ఎత్తినపుడల్లా ఋషులు ఈ జాగ్రత్త తీసుకున్నారు. వాల్మీకి అయోధ్యను ఎన్నుకోవటానికి కారణం సరయూనది( పునర్వసూ జన్మ నక్షత్రం పెట్టి రాముడు సూర్యుడు అని చెప్పాడు వాల్మీకి .కర్ణుడు పుట్ట గానే గంగలో వేయించాడు వ్యాసుడు . కృష్ణుడు కూడా యమున లో ప్రయాణం చేశాడు. సూర్యుడి temperature 6000 c ఉంటుందిట.. ‘ భయస్యామతిః ‘ అంటుంది వేదం .
గోవులు అనేశబ్దానికి సూర్యకిరణాలు అనే అర్థం ఉందని యాస్క్యుడు చెప్పాడు .
సూర్యుడు పుట్టగానే ఏం చేయాలి .సూర్య కిరణాలు ఉన్న చోటికి వెళ్లాలు. అవి ఎక్కడ ఉన్నయి .గోవ్రజం అంటే నందుని గొల్లపల్లె వలో..కనుక ఉదయం అయ్యే టప్పటికి అక్కడ ఉండాలి అందుకే వసుదేవుడు కృష్ణుని మోసుకొని గొల్లపల్లె కు వెళ్లాడు.సూర్యుడి లక్షణాలు చాలాచెప్పాడు వ్యాసుడు. మనకు జ్ణాపకం ఉంషడదు కాని సూర్యుడు నీట్కిస్థానం . ఆయన ఎక్కడుంటే అక్కడ నీరు ఉంటుంది అందుకే వాన తెప్పించాడు.అప్సరసలు వాసలు సూర్యలోకం లోఉంటారని . వారు నీటిస్వరుపాలు.అందుకే ఎవరైనాఋషి తపసు(వేడి) చేస్తుంటే అక్కడికి వెళ్లి చల్లబరుస్తారు..
పాము లు,రాక్షసులు ,పిశాచాలు పితృదేవతలు దక్షిణ ధ్రువ శక్తులు.సూర్యుడు భూమి మీదకు రాగానె శేషుడు(దక్షిణ ధ్రువం ) వచ్చి సేవించుకున్నాడు .ఇక ‘ రసోవైసః రసగ్గ్ హ్యేనం లబ్ధ్వా నందీ భవతి’ రస స్వరూపుడు అన్నది సూర్యుడు కృష్ణుడు ఇద్దరి విషయంలోనూ సత్యమే .కృష్ణుడిని పొందేవాడెవరు…నందుడు .
ఇక గోవులు సూర్యకిరణాలు …వాటిని పిండి అమృతం తీసేదెవరు …గోపికలు .అంటే చంద్రకిరణాలు . కనుక గోపికలు చంద్ర కిరణాలు.
చంద్రకిరణాలు అంటూ ప్రత్యేకము ఏమీ ఉండవుసూర్యకిరణాలే చంద్రుడిమీద పడి చంద్రకిరణాలు అవుతయ్
రాత్రపూట సూర్యుడిని వరుణుడు అంటారు
అంటేగోపికలు కృష్ణుని రూపాలే .అందుకనే గోపిలల భర్తలు కాని కొడుకులు కాని అత్తమామలు కాని గోపికలు రాత్రిపూట ఇల్లు వదలి వెళ్లినా మాయామోహితులై ..ఏమీ అనరు.
కృష్ణుడు రోహిణీ నక్షత్రం లోపుట్టినట్టు భాగవతంలోఉందికానీ శ్రావణ మాసమని లేదు.అది విష్ణు పురాణం లో ఉంది .
తెలుగులో ఒక్కప్రతిలో మాత్రము ఉంది
ఇకభారత కథ తీసుకుంటే ..పాండవులు దేవతలు ..ఉత్తర ధ్రువ శక్తులు
దుర్యోధనాదులు దక్షిణ ధ్రువ శక్తులు కలి అంశ ..రాక్షసాంశ రూపాలు. కానీ కృష్ణుడికి ఉత్తర దక్షిణ ధ్రువాలు ఒకటే .పక్షపాతం లేదు.అందుకని భారతయుధ్దం లో యుధ్ద్దం చేయనంటాడు. మరేం చేస్తావంటే రథం తోల్తానంటాడు.
సూర్యుడు గమన శీలుడు .ఈప్రపంచం లో ఒక్కక్షణం కూడా నిలుకడలేనివి మూడు సూర్యుడు, అగ్ని,గంగా . అందుకే రథసారథ్యం చేస్తానంటాడు.వ్యాసుడు కర్ణుణ్ణి గూడా రథసారథి కే దొరికేటట్టు చేస్తాడు.. చివరికి రథం కదలలేక పోతాడు.
భారత యుధ్దం లో కృష్ణుడు సూర్యుడు అర్జునుడు అగ్ని .ధ్వజం ఆంజనేయుడు (ఆక్సిజన్ ) అగ్ని మండటానికి కావాల్సిన వాయువు . ( వాయుదేవుడు కాడు చెట్టుమీదనుండివచ్చే ప్రాణవాయువు . చెట్టు కాబట్టే వానర రూపం )
కృష్ణుడి రాయభారం దూరాన ఉండే సూర్యుడు ఉత్తర దక్షిణ ధ్రువాలను పరస్పర వైరనివారణ ప్రయత్నం .అయుతే ఉత్తర ధ్రువం గోళం పైన ఉంటుంది కాబట్టి సూర్యుడి కి దగ్గర గా ఉంటుంది _(8000 miles)
అదేపాండవులు కృష్ణుని శరణు వేడటం .తనను పూజించిన వాని రక్షిస్తానని కదా కృష్ణుని ప్రతిజ్ఞ
రేపు రాస క్రీడ ను గురించి మాట్లాడుకుందాం
Andukuri Sastry
—