శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -2
కలిపూర్వం 109 వికృతి సంవత్సర శ్రావణ బహుళాస్టమికి కృష్ణమూర్తికి 17 ఏళ్ళు నిండాయి .గర్గాచార్యుల చేత బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారం జరిగి ,బ్రహ్మచారులై గురు శుశ్రూష చేసి ,కాశీ లో ఉన్న సా౦దీపమహర్షి వద్ద గురుకులవాసం లో ధనుర్వేద ,ఉపనిషత్ విద్య నేర్చి ,గురు దక్షిణగా మృతుడైన గురుపుత్రుని కృష్ణుడు సజీవునిగా తీసుకొచ్చి అప్పగించటానికి ప్రభాస తీర్ధం వెళ్ళటం ,సముద్రుడు పూజించటం సముద్రం ప్రవేశించి ,పంచ జనాసురుడిని చంపి ,పాంచజన్య శంఖం గ్రహించి ,యమలోకం వెళ్లి ,గురుపుత్రుని తీసుకొని కాశీ చేరి గురువుకు అప్పగించటం జరిగాయి .108 ఖర లో కృష్ణుడు గోపికల వద్దకు ఉద్ధవుడిని పంపటం,గోపికల భ్రమర గీతాలు ,తిరిగొచ్చిన ఉద్ధవుడు స్వామికి గోపికల అత్యంత ఆరాధనా భక్తీ వివరించటం ,కుబ్జ కురూపాన్ని పోగొట్టి సౌందర్య రాశిగా మార్చటం ,సోదరులు అక్రూరుని ఆతిధ్యం,పూజలు పొంది బహూకరి౦చటం,పాండవుల క్షేమ సమాచారాలు తెలుసుకొని రమ్మని హస్తినకు అక్రూరుని పంపటం జరిగింది .కృష్ణ బాల్యం ప్రచ్చన్నంగా బృందావనం లో నందగోపుని ఇంట జరగటం వలన కంస వధ తర్వాతే పాండవ శ్రీకృష్ణ సోదరులకు మొదటిపరిచయకాలం అయింది .107నందనలో 19స్వామికి పూర్తి అవటం ,జరాసంధుడు మధురపై మొదటిసారి దండెత్తిరావటం ,ఓడిపోయి బలరాముని చేతిలో పట్టుబడటం ,కృష్ణుడు కరుణించి వాడిని విడిచిపెట్టటం జరిగాయి .
106విజయ సంవత్సరం 20ఏళ్ళు నిండిన మూడు నెలలకే ,జరాసంధుడు మధురపై రెండో సారి కృతఘ్నతతో దాడి చేసి , ఓడి,16సార్లు దండెత్తి 6ఏళ్ళు మదుర , కృష్ణబలరాములను బాధించాడు.105 జయ లో 21ఏడు వచ్చాక జరాసంధుడు మూడో సారి దండయాత్ర చేశాడు హస్తినాపురం లో పాండవులు ఏం చేస్తున్నారో చూద్దాం. ద్రోణాచార్యులవద్ద ధనుర్విద్య నేర్చిన పాండవ కౌరవులకు ధనుర్విద్యా పరీక్షజరగటం ,నాలుగో దండయాత్ర జరాసంధుడు చేయటం జరిగాయి .104మన్మధ సంవత్సరం లో 22ఏళ్ళు కృష్ణుడికి నిండాయి .హస్తినలో ధర్మరాజుకు 24వ ఏట యువరాజ్య పట్టాభిషేకం చేశాడు పెద్ద రాజు ధృత రాస్ట్రుడు .103 దుర్ముఖి లో 23ఏళ్ళు నిండటం ,జరుడు 5వ సారి మధురదండయాత్ర ,102 హేవలంబి లో 24పూర్తయి ,6వ సారి దండయాత్ర ,101విళంబిలో 25 కంసారి కి నిండగా 7వ దండయాత్ర ,100వికారిలో మురారికి 26 నిండటం ,సంధుని 8వ దండయాత్ర ,హస్తినలో కౌరవపా౦ డవులమధ్య కలహాలు తీవ్రమవగా ,పాండవులను శార్వరి ఫాల్గుణ శుద్ధ అష్టమికి వారణావత౦ పంపటం జరిగాయి .
99శార్వరికి నల్లనయ్యకు 27నిండటం, జరా 9వసారి దండయాత్ర ,98ప్లవ లో 28నిండటం ,జరుడి 10 వ దండయాత్ర ,ఫాల్గుణ శుద్ధ చతుర్దశి లాక్షా గృహ దహనం ,కుంతీ దేవితో సహా బిలంగుండా పాండవులు తప్పించుకుపోవటం ,అరణ్యం లో చైత్ర శుద్ధ పాడ్యమి రోజున భీముడు హిడి౦బాసుర వధ చేసి ,హిడి౦బిని పెళ్ళాడి ఘటోత్కచునికి జన్మనివ్వటం,97శుభకృత్ కు బలరామానుజుడికి 29నిండటం, సందుడి 11 వ దండయాత్ర , 96 శోభకృత్ కు 30నిండటం ,మధురపై 12వ దండయాత్ర ,కుంతీ పాండవులు శాలిహోత్ర ముని ఆశ్రమంలో ధర్మాలు వినటం ,95 క్రోధి కి 31నిండి ,13వ దండయాత్ర ,వైశాఖ శుక్లపక్షం లో పాండవులు ,ఏక చక్రపురం వెళ్లి ఒక ఏడాది ఉండటం ,94 విశ్వావసులో 32దేవకీనందనుడికి నిండటం ,మధురపై 14వ దండయాత్ర , ఏకచక్రపురం లో రెండో ఏడాది పాండవులు గడపటం ,93పరాభవ కన్నయ్యకు 33నిండటం ,మధురపై 15వ దండయాత్ర ,పాండవులు మూడో ఏడాది ఏకచక్రపుర వాసం ,92ప్లవంగకు శౌరికి 34నిడటం జరుని 16వసారి ,17వ సారి ఎత్తిరావటం , పాండవుల నాలుగో ఏడు ఏకచక్రపురవాసం.91కీలక సంవత్సరం లో ముకు౦దు నికి 35నిండటం జరాసంధుడు మధురపై చివరిసారి 18వ దండయాత్ర చేయటం ,కాలయవన పారశీకరాజు వాడికి పశ్చిమం నుంచి సాయం రావటం ,3కోట్ల జరాసంధ శత్రు సైన్యాన్నిఎదిరించాల్సిరావటం తో కృష్ణుడు ముందుగా కాలయవనుడితోపోరాడి ,ఓడిపోయినట్లు నటించి భయంతో పారిపోతున్నట్లు భ్రమకలిపించి ముచుకు౦దమహర్షి తపస్సు చేస్తున్న గుహలో దూరి ,కాలయవనుడు ముని తపోభంగం చేయగా ఆయన కంటిమంటకు వాడు భస్మమవటం,యవన సైన్యం భయపడి పారిపోవటం వరుసయుద్దాలతో ఇక యాదవులను కస్టట్టటం ఇష్టం లేక బలరామ కృష్ణులు ప్రవర్షణ గిరి అనే దుర్గానికి చేరగా ,జరాసంధుడు మధురవదలి దీనిపైకి వచ్చి కాల్చేయగా ,అక్కడినుంచి తప్పుకొని సోదరులు అజ్ఞాత వాసం కొంతకాలం గడిపి ,పశ్చిమ సముద్రం చేరి దాని దగ్గరున్న గోమతి నదీ తీరం లో ద్వారకానగరం నిర్మించటం ప్రారంభించి 90సౌమ్య సంవత్సరానికి పూర్తి చేసి ,యాదవులను ద్వారకకు రప్పించి ,రుక్మిణీదేవిని పెళ్ళాడటం ,ఏక చక్రపురం లో పాండవుల 6వ ఏడు అజ్ఞాతవాసం గడపటం పూర్తి అయింది .
సశేషం
శ్రీకృష్ణాస్టమి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-19-ఉయ్యూరు