శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ -6(చివరిభాగం )
కలిపూర్వం 35క్రోధి సంవత్సర జ్యేష్ట శుద్ధ విదియకు విజయ సారధికి 91నిండాయి పరీక్షిత్తు జన్మించాడు .ఆశ్వత్ధామ అస్త్రాలనుంచి గర్భం లో ఉన్న పరీక్షిత్ ను కృష్ణ పరమాత్మ సంరక్షించాడు .34విశ్వావసు చైత్ర పౌర్ణమికి శరత్ చంద్ర చంద్రునికి 92నిండి ,ధర్మరాజు వ్యాసాజ్ఞాతో అశ్వమేధం పూర్తి చేశాడు .33పరాభవచైత్ర పౌర్ణమికి93పూర్తయ్యాయి పూర్ణ చంద్ర నిభునికి . ధర్మరాజు యాగం పూర్తయి అర్జునుడు అశ్వం వెంట దిగ్విజయ యాత్ర కు బయల్దేరి తనకూ చిత్రా౦గదకు జన్మించిన బభ్రువాహనుని చేతిలో ఓడిపోయి ,సంధి చేసుకొని బంధింపబడిన యాగాశ్వాన్ని తీసుకొచ్చాడు .32 ప్లవంగ శ్రావణ బహుళాస్టమికి శ్యామసు౦దరునికి 94పూర్తయి ,ఉదంకుని ఆశ్రమానికి వెళ్లి దర్శనం తోపాటు 6వ సారి తన విశ్వ రూప సందర్శన భాగ్యం కల్పించి తరి౦పజేశాడు .31కీలకకు 95,30సౌమ్యకు 96,29సాధారణకు 97,28విరోదికృత్ కు 98,27పరీధావికి 99,26ప్రమాదీచకు 100ఏళ్ళు నిండాయి వనమాలికి .25ఆన౦ద కు 101,24రాక్షసకు 102,23నలకు 103,22పింగళకు 104,21కాళయుక్తి కి 105,20సిద్దార్ధికు 106,19 రౌద్రి చైత్ర శుద్ధ విదియకు 107,18దుర్మతికి 108,17దుందుభి కి 109,16రుధిరోద్గారికి 110,15రక్తాక్షికి 111,14క్రోధనకు 112,13అక్షయకు 113,12ప్రభవకు 114,11విభవకు యదు భూషణుడికి 115ఏళ్ళు నిండాయి .ఈ కాలం లో కృష్ణమూర్తి ద్వారకలో 12ఏళ్ళు బహు యాగాలు చేశాడు .ధర్మరాజు ధర్మమూర్తిగా హస్తినలో పాలన సాగిస్తున్నాడు .గాంధారిధృత రాస్ట్రులు హస్తినలో పుత్రశోకం తో ఉండలేక శతకూపాశ్రమంలో ఉన్నారు .వ్యాసభగవానుడు ప్రత్యక్షమై గాంధారిని ఊరడించి ఆమె కోరికపై చనిపోయిన కౌరవుల౦దర్నీ యోగశక్తి తో చూపించి ఉపశమనం కలిగించాడు .ధర్మరాజాదులు కూడా ఈ ఆశ్రమం లో కొంతకాలం ఉండి, మళ్ళీ హస్తినకు వెళ్ళారు .గాంధారి ధృత రాస్ట్రులు మరణించారు .శ్రీకృష్ణ సంకల్పం తో నారదాది మహర్షులు పిండార క్షేత్రం లో సమావేశమయ్యారు .సురాపానం తో మదించిన యాదవులు వారిని అవమాని౦చ గా ,మునుల శాపం తో కృష్ణ కుమారుడు సాంబుడు స్త్రీ వేషం లో ఋషులను ఆటపట్టి౦చగా ,వాడికడుపులో ముసలం పుట్టగా భయపడి యాదవులు దాన్ని అరగదీసి సముద్రం లోకలిపారు .
కలిపూర్వం 10 శుక్ల సంవత్సరం లో శిఖి పింఛ మౌళికి116,9ప్రమోదూతకు 117,8ప్రజోత్పత్తికి 118,7ఆంగీరస కు 119,6శ్రీముఖకు 120,5భావకు 121,4యువకు 122,3ధాతకు 123,2 ఈశ్వర కు 124,1బహుదాన్యకు 125 బృందావన విహారికి ఏళ్ళు నిండాయి .ఈ కాలం లో నారదమహర్షి ద్వారకకు వచ్చి వసుదేవునికి భాగవత ధర్మాలు బోధించి ,జనక ఋషభ సంవాదం వినిపించాడు .శ్రీ కృష్ణ భగవానుడు బృందావనం వచ్చి బాలకృష్ణ రూపం ధరించి యశోదా నందులతోపాటు సమస్త గోప గోపీ జనాలకు దివ్య దర్శనం ప్రసాదించి తరి౦పజేసి భాగవతధర్మాలు బోధించాడు ఆ అవతార మూర్తి .కృష్ణస్వామి కృపాకటాక్షం చేత గోప గోపీ జనం అంతా తమతమ దివ్య ధామాలకు చేరి గోలోక ,వైకుంఠ లోకాల దర్శనం చేసి ధన్యులయ్యారు .గోపాలకృష్ణమూర్తి మళ్ళీ ద్వారక చేరగా ,బ్రహ్మ ఇంద్రాదులుఅక్కడికి చేరి నారాయణ భగవానుని సందర్శన భాగ్యం పొంది ,తన నిజనివాసమైన గోలోకానికి విచ్చేయమని ప్రార్ధించి, ఇక అవతార సమాప్తి దగ్గరలో ఉందని గుర్తు చేశారు
ద్వారకలో అనేక ఉత్పాతాలు పుట్టాయి ,యాదవ ప్రభువు యాదవులను ప్రాభాస తీర్దానికి పంపగా అక్కడ యాదవులు పరస్పర కలహాలతో ఒకరినొకరు సర్వ నాశనం చేసుకొన్నారు .బలరాముడు స్వకీయ సంకర్షణ భాగవానునిలో లీనమయ్యాడు .యాదవ స్త్రీలు దేహత్యాగం చేశారు ..
ప్రమాది చైత్ర శుద్ధ పాడ్యమి కి ద్వాపరయుగం 8లక్షల 64వేల సంవత్సరాలు పూర్తయ్యాయి .ద్వారకలోని సంఘటనలు తెలిసిన అర్జునుడు ద్వారకకు వచ్చి భగవాన్ శ్రీ కృష్ణ సందర్శనం చేశాడు .తర్వాత బావా మరది కలిసి సముద్ర తీరానికి వాహ్యాళికి వెళ్ళగా ,ముసలం ముక్కతో చేయబడిన బాణాన్ని ఒక బోయవాడు కృష్ణ పరమాత్మ పడుకొనివుండగా ,ఆయన పాదాలు లేడి కన్నులు అని భ్రమించి బాణం తోకొట్టగా ,స్వామి పాద అ౦గుస్టానికి తగిలి దేవకీ వసుదేవ నందనుడు ,యశోదా తనయుడు, నంద నందనుడు శ్రీ కృష్ణ స్వామి 125సంవత్సరాల 7 నెలల ,8 వ రోజులు పూర్తయ్యాక నిర్యాణం చెందారు .అంతకుముందే రాధాదేవి గోలోకానికి చేరుకోగా గోపగోపీ బృందం దివ్య స్వాగతం పలికారు .కృష్ణస్వామి గోలోకంచేరగా బ్రహ్మాదులు దర్శించి పులకించారు .
1ప్రమాది సంవత్సర చైత్ర శుద్ధ సప్తమికి పరమాత్మ గోలోకానికి చేరుకోగానే ,కలియుగం ప్రారంభమై ,అర్జునుడు దారకుని తో ,మళ్ళీ ద్వారకకు చేరి,సప్తమి దాకా అక్కడే ఉన్నాడు .భూకంపాలు రాగా ,మిగిలిన యాదవులతో ద్వారకను వదిలి మధురకు వెళ్ళి,అనిరుద్ధుని కుమారుడు వజ్రుడు కి యాదవ రాజ్య పట్టాభి షేకం చేశాడు .ద్వారక సముద్రం లో మునిగింది .హస్తినకు వచ్చి ధర్మరాజాదులకు శ్రీ కృష్ణ నిర్యాణ విషయం తెలియజేశాడు .వైశాఖ శుక్లం లో పరీక్షిత్తుకు పట్టాభి షేకం చేసి ,పౌర్ణమినాడు పాండవులు మహాప్రస్థానానికి దీక్ష తీసుకొని, ఒక ఏడాది భూ ప్రదక్షిణం చేసి ,విక్రమ సంవత్సరం లో బదరికాశ్రమం దాటి ,మేరుపర్వత సమీపంలో ఊర్ధ్వ లోకాలకు చేరుకొన్నారు .
ఆధారం –నారాయణ తీర్దులవారి స౦స్కృత శ్రీ కృష్ణ లీలాతరంగిణి కి ఉయ్యూరు సంస్థానాదీశ్వరులు శ్రీ రాజా మేకా వెంకటాద్రి అప్పారావు గారు ఆంధ్రీకరణం చేయగా ,శ్రీమాన్ బొమ్మకంటి వీరరాఘవా చార్యులు పర్యవేక్షించగా,కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్1948లో ప్రచురించిన ‘’శ్రీ కృష్ణ లీలాతర౦గిణి ‘’గ్రంథంలో, కొవ్వూరు సంస్కృత పాఠశాల కార్యదర్శి శ్రీ చదలవాడ గోపీ నాథము,శ్రీమాన్ బొమ్మకంటి వీర రాఘవాచార్యులు ,శ్రీ ఎస్ .యెన్ .కే ..బీజార్కన్ ,శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల అప్పలాచార్యులవారి మహాభారత సంగ్రహం యొక్క భిప్రాయాలు సేకరించి ,నూజివీడు హైస్కూల్ చరిత్రోపాధ్యాయులు శ్రీ ధన్యంరాజు అప్పారావు గారు సమకూర్చిన ‘’శ్రీ కృష్ణావతార కాలక్రమము ‘’ అనే వ్యాసం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-8-19-ఉయ్యూరు