తెలుగు భాషా దినోత్సవం
వ్యావహారిక భాషోద్యమ పితామహులు శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి 157 వ జయంతిని ”తెలుగు భాషాదినోత్సవం” గా సరసభారతి, స్థానిక రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో రోటరీ క్లబ్ ఆడిటోరియం లో ,29-8-19గురువారం సాయంత్రం 4 గం లకు నిర్వహిస్తున్నాము . ఈ సందర్భంగా తెలుగు భాషకు విశిష్ట సేవలందిస్తున్న 1- శ్రీమతి పుట్టి నాగలక్ష్మి ( శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు స్మారక ట్రస్ట్ నిర్వాహకురాలు ,గ్రంథకర్త –గుడివాడ )- 2-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు (ప్రముఖకవి –విజయవాడ ) 3-డా. శ్రీమతి కొమాండూరి కృష్ణా ( విశాలాంధ్ర సంపాదకులు శ్రీ సి. రాఘవా చారి గారిపై పరిశోధకులు ,కవయిత్రి –విజయవాడ )
మొదలగు వారికి ‘’తెలుగు భాషోత్సవ పురస్కారం ‘’అందజేస్తున్నాము .
సాహిత్యాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
గబ్బిట దుర్గా ప్రాసాద్ -సరసభారతి అధ్యక్షులు
మరియు రోటరీక్లబ్ అధ్యక్షులు
ఉయ్యూరు -27-8-19
—