గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
487-షిరిడి సాయిబాబా సహస్ర నామ స్తోత్ర కర్త –సిద్ధగురు శ్రీ రామణానంద మహర్షి(1964)
ఆర్య వైశ్య కులం లో పడగ శీల గోత్రం లో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళ లో 1964లో జన్మించిన శ్రీ రమణా౦ద మహర్షి విశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో బి టెక్ చదివి ఉత్తీర్ణులయ్యారు .
27వ యేట 2002లో ఆత్మజ్ఞానం పొంది .ఉపనయన సంస్కారం యజ్ఞోప వీత ధారణా లేకుండానే షిరిడి సాయిబాబా అనుగ్రహంతో అపరోక్షానుభూతి తో బ్రహ్మజ్ఞాని అయ్యారు. అప్పటి నుంచి షిరిడి సాయిబాబా ,అమ్మవారు ,శివుడు లపై ధర్మప్రచారంసాగిస్తున్నారు .తెలంగాణాలోని భువనగిరి యాదాద్రి జిల్లా’’ రమణేశ్వరం’’ అనబడే నాగిరెడ్డి పల్లి గ్రామంలో 1008 శివలింగాలు ,స్వర్ణ శివ లింగం ,స్పటిక శివలింగం స్థాపించి ఆధ్యాత్మిక ధార్మిక ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు .త్వరలో షిరిడి సాయి బాబా ‘’స్వర్ణ విగ్రహం ‘’స్థాపించే ప్రయత్నం లో ఉన్నారు .
స్వామీజీ గత 15 సంవత్సరాలుగా 56వచన గ్రంథాలు రచించి ప్రచురించారు .అందులో శివుడే దేవాది దేవుడు ,ఆదిదేవుడు ,పరమపురుషుడు వంటి బృహత్ గ్రంథాలున్నాయి .ప్రస్తుతం షిర్డీ సాయి అనుగ్రహం తో ‘’షిరిడి సాయి బాబా సహస్ర నామ స్తోత్రం ‘’అష్టోత్తర ద్వశత శ్లోకాత్మకంగా రచించారు .ఈ శ్లోక రచన క్రమాన్ని శ్రీ విద్యా చండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ దెందుకూరి దుర్గాప్రసాద శర్మ గారికి వినిపిస్తూ ,అభిప్రాయ సేకరణ చేశారు .అద్భుత ధారాశుద్ధి ఆ అనుష్టుప్ శ్లోకాలలో ఉందని ,ఉత్తమభావాలకు అనుగుణమైన శబ్దజాలం ,నిష్పాక్షిక సాయి చరిత్ర ,సాయి సిద్ధత్వం ,సాయిలీలలు ,సాయి మార్గ దర్శకత్వం,అనుగ్రహ విధానం అంతా అంతస్సూత్రంగా వేదాంత విజ్ఞానం ఇమిడి ఉండేట్లు ,ఉపక్రమ ,ఉపసంహారాలు ,ఫలశృతికూడా జోడించటం తో అనుభవం ఉన్న గొప్ప కావ్య లక్షణం కలిగిందని వారితో ప్రత్యక్ష సంబంధం ఉన్న దెందు కూరి వారు సమీక్షగా తెలిపారు .
స్వామి వారి గొప్పతనాన్ని తెలియజేస్తూ శర్మగారు వేదాన్ని సామాన్యులు కూడా స్వరసహితంగాగా ఎలా చదవాలో,ఆ జ్ఞానాన్ని సంగీత జ్ఞాన పూర్వకంగా బహిర్గతం చేసిన మహానీయులన్నారు .కనుకనే ఈ గ్రంథాన్నివేద శబ్దమయంగా వైదిక శబ్ద బంధురంగా రచించి ,దీన్ని పఠిస్తే వేద పఠన ఫలితం కలుగుతుందన్నారు .శక్తిపాత గురువు ,తత్వ దర్శి శ్రీ రమణానందులు తొలిసారిగా దీన్ని సంస్కృతం లో రచించినా ఎంతోఅనుభవమున్న కవీశ్వరుల,ఉత్తమ శబ్ద మాధుర్యం ,గొప్ప సమాస భూయిష్టంగా ,అలంకార సహితంగా రాసినట్లు భావన కలుగుతుందని మరిన్ని సంస్కృత రచనలతో సంస్కృత మహాకవిగా సుస్థిర స్థానం పొందుతారని శర్మగారు వాక్రుచ్చారు .ఈ గ్రంథంశ్రీ వికృతి ఉగాది నాడు 2019ఏప్రిల్ 6 న ఆవిష్కరి౦ప బడింది .ఇప్పుడు స్తోత్ర మాధుర్యాన్ని రుచిచూద్దాం .-
సంకల్పం –అథ సంకల్పః –ఓం అస్య శ్రీ పరమగురు షిరిడి సాయి –సహస్రనామ స్తోత్ర మహా మంత్రస్య-మహర్షి శ్రీ రమణానందోఋషిః అనుష్టుప్ చందః –శ్రీ షిరిడి సాయినాథో దేవతా ప్రీత్యర్ధం –తత్వ దర్శి శక్తిపాత సిద్ధ యోగీశ్వర-శివ శక్తి షిరిడి సాయి అనుగ్రహ మహా పీఠాధిపతి–సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి కృత –అష్టోత్తర ద్విషత శ్లోకాత్మక –షిరిడి సాయి సహస్ర నామ స్తోత్ర జపే –పారాయణే,హోమేవినియోగః ‘’
ధ్యానం –శివ సాకార మో౦కారమ్ –పూర్ణానంద సదా శివం –పరిపూర్ణ మహా గురుం –సాయీశ్వర ముపాస్మహే ‘’
మోక్షదం శక్తిదం పుణ్యం –సాయి నామ సుకీర్తనం –సర్వ దోషహరం దివ్యం –శ్రవణం పాపనాశనం ‘’
సహస్ర నామ స్తోత్రం
1-భగవాన్ సాయి శంకరః –పరమాత్మా సదా శివః –సర్వవ్యాపీ పరాశక్తిః ఓంకారో శిరిడీశ్వరః
10 అత్యద్భుత మహామూర్తిః –ఆజానుబాహు రుత్తమః –గుణదామో పరంధామః –యుగావతార పూరుషః ‘’
50-దాదాభట్ శుద్ధ భక్తిదః-ఉద్ధవ్ రావ్ భక్తి ముక్తిదః –నూల్కర్ మాయా విముక్తిదః –ధర్మార్ధ కామ మోక్షదః ‘’
100-ఉపవాస నిరోధకః -శుష్కజ్ఞాన విని౦దకః –క్షుద్రోపాసన ఖండనః –జ్యోతి శ్శాస్త్ర విఖండనః ‘
151-తపోలోక ని’’వాసీ చ-సర్వలోక సుదర్శితః –ఘోర తపో మహా వైద్యో – ఈషణత్రయ నాశకః ‘’
200-జగదాధార నాయకః –జగదానంద కారకః –జగత్కారణ కారణః –సూర్య చంద్రాగ్ని నేత్రవాన్
208-రమణ సాయి లింగేశః –త్ర్యంబక సాయి మంగళః-శిరిడీశ సుమ౦గళః –రమణానంద సంస్తుతః ‘’
ఫలశృతి-
1-సాయినామ సహస్రంతు –ఆత్మానంద ప్రదాయకః –ఐశ్వర్య వరదం పుణ్యం –ప్రేమాన్వితో సదాజపః ‘
9-ధ్యాననామ సహస్రేణ-పరాభక్తి సమన్వితః బ్రహ్మజ్ఞానం లభేత్ శీఘ్రం –సిద్ధత్వం మోక్ష మాప్నుయాత్ ‘’
దీనితోపాటు సాయి సహస్రనామావళి కూడా ఉన్నది .పూర్తి కలర్ పేపర్ పై అత్యంత సుందరంగా ముద్రింపబడిన ఈ గ్రంథం షిర్డీ సాయిభక్తులకు కరతలామలకమే .
ఆధారం -సుమారు పది రోజులక్రితం బ్రహ్మశ్రీ దెందు కూరి దుర్గాపసాద శర్మగారు మా ఇంటికి వచ్చినాకు ఇచ్చిన ‘’షిరిడి సాయి సహస్రనామ స్తోత్రం ‘’గ్రంధం.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-19-ఉయ్యూరు