గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
488-ప్రాచ్య శిక్షా దర్శన కర్త –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1966)
2-7-1966 న ఉత్తరప్రదేశ్ జాన్పూర్ లో జన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ లక్నోలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ సంస్కృత రీడర్ ఆచార్య ,శిక్షా చార్య కూడా .డా.మండన మిశ్ర ప్రొఫెసర్ ఎస్ .డి .వాసిష్ట లు గురువులు . ప్రాచ్య శిక్షా దర్శన౦,ప్రాచీన భారతీయ శిక్షా ,హిందీ శిక్షా గ్రంథాలు రాశాడు
489-దశకంఠ వధ కర్త –దుర్గాప్రసాద్ ద్వివేదీ (1863-1937)
జ్యోతిష,సాహిత్య ,దర్శన ,వ్యాకరణ విద్వాన్ దుర్గాప్రసాద్ ద్వివేది 1863లో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించాడు .జైపూర్ కాలేజిలో సంస్కృత లెక్చరర్ గా చేరి ,ప్రిన్సిపాల్ అయ్యాడు బాపుదేవ శాస్త్రి ,గ౦గాధరశాస్త్రి ,రా౦ భాజ్ సరస్వత్ ,సర్యుప్రసాద్ ద్వివేదీ ఇతని గురుపరంపర .19పుస్తకాలు రాశాడు .అందులో దశ కంఠ వధం ,దుర్గాపుష్పాంజలి ,దేవరాజ చరిత ,చాతుర్వర్ణ శిక్షా ,ప్రసన్న చండీపతి ఉన్నాయి .మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు .1937లో 74వ ఏట మరణించాడు.
490-ఆగమ రహస్య కర్త –గంగాధర ద్వివేది (1921)
1921లో అయోధ్యలో జన్మించిన గంగాధర ద్వివేది వ్యాకరణ ,సాహిత్య ఆచార్య .ఆల్వార్ ప్రభుత్వ సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ .వీరేశ్వర శాస్త్రి ద్రావిడ్ ,శ్రీ ఘూర్తార్ ఝా ,శ్రీ గిరీష్ చంద్ర అవస్ధి లవద్ద విద్య నేర్చాడు .దుర్గాపుష్పాంజలి , ,ఆగమరహస్యం ,భారతాలోకః వంటి 8 గ్రంథాలు రాశాడు .రాష్ట్రపతి పురస్కారం పొందిన సంస్కృత విద్వాంసుడు .మహాభాష్య౦ ,శబ్దేందు శేఖరం,మంజూష ,ప్రౌఢవ్యాకరణ౦ లలో మహా విద్వాంసుడు .సంస్కృత రత్నాకర పత్రిక సంపాదకుడు .జైపూర్ దూరదర్శన్ నుండి చాల సంస్కృత కార్యక్రమాలు నిర్వహించాడు .491-కల్పకాలికా కర్త-హరిహర కృపాలు ద్వివేది (23-3-1949 మరణం )
వ్యాకరణ ,న్యాయ మీమాంస ,వేదాంతాలలో ప్రత్యేక కృషి చేసిన హరిహర కృపాలు ద్వివేది వారణాసిలోని సీతామూరార్క సంస్కృత స్కూల్ లో ఉపాధ్యాయుడు .రాం యజ్న ,పండిట్ ఉమాపతి ,పండితకమలాకాంత మిశ్ర ,పండిత రామానుజ ఓజ్హా,పండిట్ రఘునందన త్రిపాఠి ,పండిట్ బ్రహ్మదత్త ద్వివేది స్వామి కృష్ణ బోదాశ్రమం ,శంకరానంద్ ఈయన గురుపరంపర .కల్పకాలికా,న్యాయ కుసుమాంజలి టీక ,రామేశ్వర కృతికౌముదిరచనలు చేశాడు .జన్మించినది ఎప్పుడో తెలీదు కాని మరణించింది 23-3-1949 .1922లో ప్రభుత్వం నుంచి మహామహోపాధ్యాయ బిరుదు పొందాడు . వ్యాకరణ రత్నాకర ,విద్యానిధి బిరుదులను కాశీ లోని భారత ధర్మమండలి 1914లో బిరుదులిచ్చి సత్కరిస్తే ,అదే ఏడాది బీఆర్ విద్వత్ పరిషత్ ‘’తర్కాలంకార పదవి నిచ్చింది .
492-లింగదారణ చంద్రికా వ్యాఖ్య కర్త – హరినాథ్ ద్వివేది (1914)
బాలకృష్ణ రానడే శిష్యుడైన హరనాథ్ ద్వివేది లింగ ధారణ చంద్రికా వ్యాఖ్య ,అశౌచనిర్ణయత్రి౦ షత్ శ్లోక అనే రెండు గ్రంథాలు రాశాడు .1914కాలం కవి .
493-గీతా మందాకిని కర్త –ఇచ్ఛారాం ద్వివేది (1961)
15-11-1961జన్మించిన ఇచ్ఛారాం ద్వివేది.యుపి లోని ఈతావా వాడు .తండ్రి లాల్ బహదూర్ ద్వివేది .పురాణ ఇతిహాసాచార్య ,పి.హెచ్.డి. న్యు ధిల్లీ లోని ఎస్. ఎల్ .బి .ఎస్ .ఆర్ సంస్కృత విద్యాపీఠ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ .తండ్రివద్ద ,గోపాల్ దూబే ,ఆచార్య కేశవ్ దేవ్ తివారి ,రామ్ధ్యాల్ ద్వివేది ,ప్రభుదత్త శర్మ వంటి హేమాహేమీల వద్ద విద్య నేర్చాడు .30పుస్తకాలురాశాడు అందులో గీతామందాకిని ,దూత ప్రతివచనం ,మిత్ర దూతం ఉన్నాయి .హిందీ ఉర్దూ లలోనూ పండితుడు .
494-సూక్తిమందాకిని కర్త –ఇంద్ర దేవ ఆచార్య (1940)
1940 మార్చి 1న ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ఇంద్ర దేవ ఆచార్య సాహిత్యం లో పిహెచ్ డి,,విద్యావాచాస్పతి .అసోసియేట్ ప్రొఫెసర్ .సూక్తిమందాకిని ,సుదామ చరిత రాశాడు .
495-బృహద్దేవత కర్త –జయప్రకాష్ నారాయణ ద్వివేది (1954)
1-4-1954ఉత్తర ప్రదేశ్ పిప్రేయహట్,పాదారుణ- లో జన్మించిన జయప్రకాష్ నారాయణ ద్వివేది ఎం. ఏ .పిహెచ్ డి .గురుపరంపర –విద్యా నివాస్ మిశ్ర ,,డా.విశ్వంబరనాథ్ త్రిపాఠీ,ఎ.సి. బెనర్జీలు . దియోరియా ప్రొఫెసర్ ,.బృహద్దేవత అనే ఏకైక గ్రంథం రాశాడు .గుజరాత్ లోని ద్వారకలో ఉన్న శ్రీ ద్వారకాధీశ సంస్కృత అకాడెమిఅండ్ ఇండోలాజికల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ .
ఆధారం –Inventory Of Sanskrit Scholors
రేపు 2-9-19 సోమవారం వినాయక చవితి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -1-9-19-ఉయ్యూరు
—