గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
496-శాంతి స్తోత్రం ఏవం మహా ప్రయాణ కావ్యకర్త –కపిల్ దేవ్ ద్వివేది (1919)
16-12-1919లేక 6-12-1918 జన్మించిన కపిల్ దేవ్ ద్వివేది ఉత్తరప్రదేశ్ గాజీపూర్ వాసి .భాదోహి విశ్వభారతి రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ ,గురుకుల మహావిద్యాలయ వైస్ చాన్సలర్ .చేదిప్రసాద్ డా హరిదత్త శాస్త్రి గురువులు.శాంతిస్తోత్రం ఏవం మహాప్రయాణం అనే సంస్కృత కావ్యం తో పాటు హిందీలో వేదొమ్ మే విజ్ఞాన వంటి మూడుపుస్తకాలు రాశాడు .వేదం ,వ్యాకరణ కావ్యాలలోనూ మరాఠీ ,బెంగాలి ,పాళీ ,ప్రాకృత ,ఉర్దూ జర్మన్,ఫ్రెంచ్ ,రష్యన్ ,చైనీస్ భాషలలో నిష్ణాతుడు .1991లో పద్మశ్రీ పురస్కారం పొందాడు .వేదరత్న ,రాష్ట్రపతి సమ్మాన్ అందుకొన్నాడు .1976లో ఇటలి జెర్మని ఫ్రాన్స్ ,1989లో ఇంగ్లాండ్ ,నెదర్లాండ్ ,1990లో అమెరికా ,కెనడా ,గయాన ,1991లో మారిషస్ ,కెన్యా ,టాంజనీయ దేశాల పర్యటన చేశాడు .గయానా ,మారిషస్ ప్రెసిడెంట్ ల చేత సన్మానం పొందాడు .లండన్ ,టోరేంటో యూనివర్సిటీలు ఆహ్వానించి గౌరవించాయి .
497-రసపేసల కావ్యకర్త –కాశీ నాథ్ ద్వివేది (1898-1973)
21-1-1898 ఉత్తరప్రదేశ్ పిప్రా రాం నగర్ లో పుట్టిన కేదార్ నాథ ద్వివేది ఏం ఏ బిఎడ్.అసిస్టెంట్ ప్రొఫెసర్ .కమలనాథ శుక్లా వద్ద చదివాడు .మధ్యప్రదేశ్ ప్రభుత్వ భిత్రి సంస్కృత విద్యాలయ లో పనిచేశాడు .రసపేసల కావ్యం ,రుక్మిణీహరణం కావ్యం రాశాడు .1973లో చనిపోయాడు సాహిత్య సుధానిధి బిరుదుపొందాడు .
498-కన్యాకుబ్జ లీలామృతకర్త –మహావీర్ ప్రసాద్ ద్వివేది (1864-1938)
మహావీర్ ప్రసాద్ ద్వివేది హిందీ సంస్కృత విద్వాంసుడు .ఉత్తరప్రదేశ్ లోని రే లో 15-5-1864 జన్మించి 74వ ఏట 1938లో మరణించాడు .రైల్వే లో 25 ఏళ్ళుపని చేసి ,రాజీనామా చేసి ఇతరభాషలను నేర్చాడు .కథామహం నాస్త్రికః ,కన్యాకుబ్జ లీలామృతం,సమాచారపత్ర సంపాదకస్త్వః ,ప్రభాత వర్ణనం ,సూర్య గ్రహణం ఇందులో కొన్ని .హర్ష నైషధం పై మొదటిసారిగా హిందీలో వ్యాఖ్యానించిన వాడు .హిందీభాషకు యెనలేని సేవ చేసినందున 1900-1920కాలాన్ని ద్వివేది శకం అంటారు .కన్యా కుబ్జ బ్రాహ్మణుడు .తండ్రి రాం సాహి దూబే .సరస్వతి హిందీ మేగజైన 17ఏళ్ళు నడిపాడు భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న రచయిత.మరాఠీ గుజరాతీ ,సంస్క్రుతాలను ఆమూలాగ్రం నేర్చాడు .అన్ని రచనాప్రక్రియలలలో అమూల్య రచనలు చేశాడు .వేదం సంస్కృత సాహిత్యాన్ని ,పండిత జగన్నాధకవి సాహిత్యాన్ని శాస్త్రీయ దృక్పధంతో విశ్లేషించాడు సంస్కృతకవిత్వం, వ్రజభాష ఖడి బోలి లలో కవిత్వం చెప్పాడు 71పుస్తకాలు రాసిన మహారచయిత .మానుష ,కావ్యకలాప్ ,దేవి స్తుతి వగైరా ..
499-సంస్కార కవితా సంగ్రహ కర్త –మణి శంకర్ ద్వివేది (20వ శతాబ్దం )
సాహిత్య ,వ్యాకరణ ఆచార్యుడు మణిశంకర్ ద్వివేది రాజస్థాన్ లోని పటాన్ వాడా లో జన్మించాడు .జోద్ పూర్ సంస్కృత కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ .సంస్కార కవితా సంగ్రహం అనే ఒకే ఒక్క రచన చేశాడు .వేద౦ లోనే కాదు , సంగీతం లోనూ నిధి .సి౦ధి కవి అబ్దుల్లా లతీఫ్ రచనలను సంస్కృతీకరి౦చాడు 15-12-1952న జోద్ పూర్ లో సంస్కృత సమ్మేళనం నిర్వహించాడు .
500-సిద్ధాంత లేశ సంగ్రహ కర్త –పరాస్ నాథ ద్వివేదీ (1943-2010)
వేదాంత వ్యాకరణ సాహిత్య ఆచార్య ,పిహెచ్ డి, వాచస్పతి పరాస్ నాథ ద్వివేది 15-9-1943 బీహార్ లోని ఆరా లో జన్మించాడు .వారణాసి సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం లో వేదాంత ప్రొఫెసర్ .రఘువీర్ పాండే ,ఆచార్య శ్రీరాం ప్రసాద్ త్రిపాఠీ,దేవ స్వరూప్ మిశ్రా ఈయన గురుపరంపర .సంస్కృతం లో 5గ్రంథాలు-పార్వతీ మంగళం ,వివరణ ప్రమేయ సంగ్రహం ,సనత్సుజాతం ,సిద్ధాంత లేశ సంగ్రహం రచించాడు .23-8-2010న 67వ ఏట మరణించాడు .రాష్ట్రపతి పురస్కారం తో పాటు చాలా అవార్డ్ లను అందుకొన్నాడు .లక్నో సంస్కృత సంస్థాన్ వారు విశిష్ట సమ్మాన్ పురస్కారమిచ్చారు .
సశేషం
వినాయక చవితి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-9-19-ఉయ్యూరు
—
మహావీర్ ప్రసాద్ ద్వివేది