గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
502-మమ జనని కర్త – రమా కాంత శుక్లా (1940)
ఉత్తర ప్రదేశ్ ఖున్జా సిటిలో 24-12-1940 అంటే క్రిస్మస్ ఈవ్ నాడు జన్మించిన రమాకాంత శుక్లా ,తల్లి తండ్రిసాహిత్యాచార్య బ్రహ్మానంద శుక్లా ,,ప్రియం వదశుక్లాల వద్ద సంస్కృతం అభ్యసించి ,సాహిత్య ఆచార్య ,సాంఖ్యయోగాచార్య డిగ్రీలు పొందాడు .ఆగ్రా యూనివర్సిటిలో చేరి ,హిందీ ఎం. ఏ. గోల్డ్ మెడల్ తో ,సంపూర్ణానంద్ యూని వర్సిటి నుంచి సంస్కృతం లోను పాసయ్యాడు .1967లో ‘’జ్ఞానాచార్య రవిసేన కృత పద్మపురాణ యేవం తులసీదాస్ కా రామ చరిత మానస్ తులనాత్మక అధ్యయన౦ ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.సాధించాడు .
మోడీ నగర్ లోని ముల్తానిమల్ మోడీ పిజి కాలేజిలో 1962లో లెక్చరర్ గా చేరి ,తర్వాత ధిల్లీ లోని ధిల్లీ యూనివర్సిటి రాజదానికాలేజిలో 1967లో హిందీ ఫాకల్టి మెంబర్ అయి ,1986లో హిందీ డిపార్ట్మెంట్ రీడర్ అయి ,2005లో రిటైరయ్యాడు .
ప్రపంచ సంస్కృత సమ్మేళనం తో సహా అనేక సెమినార్లు కాన్ఫరెన్స్ లకు హాజరయ్యాడు .ఇండియన్ ఈస్తెటిక్స్ ,పోయెట్రి సాంస్క్రిట్ పై జరిగిన ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ కు అధ్యక్షత వహించాడు .ఢిల్లీ దేవవాణిపరిషత్ ప్రచురించిన ’’అర్వాచీన సంస్కృతం ‘’త్రైమాసిక పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు .అఖిలభారత రేడియో కవి సమ్మేళనం లో సంస్కృత భాషా కవిగా పాల్గొన్నాడు .
రమాకాంత శుక్లా సంస్కృత హిందీభాషలలోచాలా పుస్తకాలు రాశాడు .’’భాతి మే భారతం’’ ,అనే సంస్కృత టెలివిజన్ సీరియల్ ను దూరదర్శన్ లో నిర్వహించాడు .ఆయనపై ‘’దేవవాణి ప్రకాశం ‘’అనే ప్రత్యేకక అభినందన సంచిక సంస్కృతం లో దేవవాణి పరిషత్ వెలువరించింది .స్వయంగా సారస్వత సంగమం ,భారత జ్ఞానతాహం సంస్కృత రచనలు చేశాడు .సంస్కృత రాష్ట్రకవి ,కవిరత్న ,కవి శిరోమణి ,హిందీ-సంస్కృత సేతు మొదలైన బిరుదులుపొండాడు .కాళిదాస సమ్మాన్ ,సంస్కృత సాహిత్య సేవా సమ్మాన్ ,రాష్ట్ర ప్రభుత్వం అవార్డ్ ,ఢిల్లీ సంస్కృత అకాడెమి నుంచి ‘’మౌలిక సంస్కృత రచనా పురస్కా ర్’’ అందుకొన్నాడు .2009లో ప్రెసిడెంట్ నుంచి సంస్కృత స్కాలర్ అవార్డ్ ,2013లో భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారం పొందాడు .భారతీయ సంస్కృత ప్రచార సంఘ్ కు వ్యవస్థాపక అధ్యక్షుడు .2018లో ఆయన రచించిన ‘’మమజనని ‘’సంస్కృత రచనకు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది .
భాతిమే భారతం నుంచి మొదటి శ్లోకం –
‘’భారతం వర్తతే మే పరం సంబలం –భారతం నిత్యమేవ స్మరామి ప్రియం
భారతే నాస్తి మే జీవనం జీవనం –భారతాయాపితం మేఖిలం చేస్టితం
భారతాద్ భాతి మే భూతలం భూతలం –భారతస్య ప్రతిస్టితస్యమే మానసే’
భారతేహుం ప్రపశ్యామి విశ్వేశ్వరం –భారత !శ్రేస్టతాన్గార తుభ్యం నమః ‘’
చివర శ్లోకం –
‘’యత్ర మందాకినీ పాపసంహారిణీ-యత్ర గోదావరీ చారు సంచారిణీ
దేవ వాణీ చ యత్ర స్థిత మేవాకులా –భూతలే భాతి తన్మామకం భారతం ‘’
భావం -మందాకినీ నది ఎక్కడ పాప ప్రక్షాళనం చేస్తుందో ,ఎక్కడ గోదావరీనది ప్రవహిస్తుందో , ఎక్కడ దేవభాష సంస్కృతం ఉంటుందో అక్కడ భూమిపై నా భారత దేశం ప్రకాశిస్తుంది.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-9-19-ఉయ్యూరు
—