తెలుగులో మొదటి ప్రింటింగ్ -3
తెలుగులో ప్రింటింగ్
తెలుగు వార్తాపత్రికల క్రమాభి వృద్ధి తెలుసుకోవాలంటే తెలుగులో ప్రింటింగ్ ఎలా ప్రారంభమైందో తెలియాలి .ముందే చెప్పినట్లు ఈస్ట్ ఇందియాకంపెనీ మిషనరీలు తమ పాలన సక్రమంగా జరగటానికి ఉద్యోగులకు స్థానిక భాషలు నేర్చుకోనేట్లు చేశారు .భాషాజ్ఞానం క్రమాభి వృద్ధితోపాటు ప్రింటింగ్ విధానమూ అమలు పరచారు .డేనిష్ మిషనరీ బెంజమిన్ షుల్త్జ్ తెలుగు భాషా పరిశోధన చేసిన మొదటి యూరోపియన్ .18వ శతాబ్ది మధ్యలో యూరోపియన్ ప్రపంచం తెలుగు భాష నేర్వాలనే ఆసక్తి బాగా కనబరచింది .1746లో ’’కాటేచిజం తెలుగికస్ మైనర్ ‘’,1747లో ‘’కల్లోక్వియం రెలిజియజసం ‘’,’’పెర్పిక్యుయా ఎక్స్ప్లి కేషన్ డాక్ట్రినా—ఎక్స్ లింగ్వా టమూలికా టెలుగికన్ వెర్సా ‘’వంటి 47తెలుగుపదాలను గ్రెగ్ షార్పే అనే వాడు సేకరించగా ,1767లో థామస్ హైడ్ ముద్రించిన ‘’సింటాగ్మా డిజర్టేషనం ఆక్జానియా ‘’పుస్తకం’’ అనుబంధం ‘’లో ముద్రించాడు .బెంగాల్ లోని సేరంపూర్, తమిళనాడులోని మద్రాస్ లలో తెలుగు మాటలు ఒకే సారి ప్రింట్ అయినట్లు రికార్డ్ లు సాక్ష్యం చెబుతున్నాయి .1770లో ఇండియావచ్చిన చార్లెస్ విల్కిన్స్ అనే ఆంగ్లేయుడు సంస్కృతం నేర్చుకొన్న మొదటి ఆంగ్లేయుడు .ఆయనే సంస్కృతం లోని భగవద్గీత ,కాళిదాసు శాకుంతలం ,నారాయణ పండితుని ,హితోపదేశం ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు .ఈయనే దేవనాగర లిపిలో అక్షరాలు తయారు చేయటం ,మోల్దింగ్ ,కూర్చటం అంతా స్వయంగా చేసి స్థానికులకు ట్రెయినింగ్ ఇచ్చి దీనిఆదారంగా మిగిలిన భారతీయ భాషల మోల్డ్ లు తయారు చేయించాడు .
సేరంపూర్ ప్రెస్ లోని ‘’పంచారాం ‘’,ఆయన సహాయకుడు’’ మనోహర్’’ లు మొట్టమొదటి తెలుగు అక్షరాల టైప్ లను తయారు చేసి తెలుగుకు మేలుచేశారు.1804లో సేరంపూర్ మిషనరీలు ఇంగ్లాండ్ లోని తమ సొసైటీకి తమవద్ద అశేషమైన లెటర్ ఫౌండ్రి ఉందని ,దాన్ని ఎంతైనా విస్తరించే వీలున్నదని తెలియ జేశారు .ఇండియాలోని తెలుగు తో సహా ఏడు భాషలలో ఉన్న మతగ్రంథాలను ముద్రించటానికి తాకు సామర్ధ్యం ఉందని సొసైటీకి తెలిపారు .ఫారిన్ బైబిల్ సొసైటీ ప్రకటించినదానిప్రకారం ‘’తెలుగు గాస్పెల్ ‘’ఖరీదు నాలుగు రూపాయలు .
పుస్తకాల ధర తగ్గించటానికి వీలుగా వారు లండన్ నుంచి తెలుగు, నాగరి ఫాంట్లను తెప్పించుకొన్నారు .1807లో సేరంపూర్ ప్రెస్ తాము అనుకోన్నట్లుగానే తెలుగుతోసహా ఏడు భాషలలో మత గ్రంథాలను ప్రచురించింది .దురదృస్టవశాత్తు1812మార్చి 11న జరిగిన అగ్నిప్రమాదం లో ఈస్ట్రన్ భాషలలో ఉన్న 14 ఫాంట్లు ,అనువాదం పొందిన రామాయణ వ్రాతప్రతులు పూర్తిగా తగలపడి నిరుపయోగామైపోయాయి .తెలుగు వ్యాకరణం చిత్తుప్రతి కూడా దగ్ధమైంది .కాని నిర్వాహకుల అకు౦ఠిత దీక్ష వలన కొన్ని నెలలోనే ప్రెస్ మళ్ళీ పని ప్రారంభించింది .ఆ సంవత్సరం పూర్తయేసరికల్లా తగలబడిన అన్ని పుస్తకాలను మళ్ళీ ప్రచురించి వెలుగులోకి తెచ్చారు .వీటిలో డబ్ల్యు .కారీ రాసిన వ్యాకరణం కూడా ఉంది .
తెలుగు ప్రింటింగ్ లో సేరంపూర్ తర్వాత రెండవ స్థానం పొందింది మద్రాస్ .1788ప్రారంభం లోనే హెన్రిహార్రిస్ మద్రాస్ లో కొత్త ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలని ,పర్షియన్ ఇతర ప్రాచ్య భాషల అక్షరాల తయారీని స్థానిక బ్రాహ్మణుల అభ్యర్ధనతో ప్రారంభించాడు .18వ శతాబ్ది చివర్లోనే హార్రిస్ తెలుగు లో ప్రింటింగ్ కు సర్వం సిద్ధం చేశాడు . లండన్ సొసైటీ కి చెందిన మొదటి మిషనరీలు 1804లో విశాఖపట్నం జిల్లాలో పని చేయటానికి వచ్చారు .సేరం పూర్ లో ఉన్న కారీ వాళ్ళను ముందుగా తెలుగు నేర్చుకోమని హితవు చెప్పాడు .అందులో ‘’బెస్ గ్రా౦జెస్ ‘’అనే ఆయన తగినంత తెలుగు నేర్చుకొని బైబిల్ లోని కొన్నిభాగాలు ,కొన్నికరపత్రాలు తెలుగులో తయారు చేశాడు .కరపత్రాలను ‘’క్రిస్టియన్ అసోసియేషన్ ఇన్ ది ఈస్ట్ ‘’ప్రింట్ చేసింది .విలియం కాంప్ బెల్ తెలుగు కోసం విశాఖ విజయనగరం లోని మిషనరీలు చేసిన కృషిని విస్తృతంగా’’బ్రిటిష్ ఇండియాస్ రిలేషన్స్ టు ది డిక్లైన్ ఆఫ్ హిందూ ఇజం ‘’పుస్తకం లో 1839లో . రాశాడు ‘.
సశేషం