గాంధీజీ మహాత్ముడైన విధం -3
అబ్దుల్లాతో సహా అందరు గాంధీని ఇండియా పర్యటన వాయిదావేసుకోనమని కోరటం ఆయన మనసు మార్చి ఉండటానికి, వారికి రాబోయే బిల్లును వ్యతిరేకించే పోరాటం లో నాయకత్వం వహించటానికి అంగీకరించాడు .ఆ రోజు రాత్రే ప్రభుత్వానికి టెలిగ్రాం ఇచ్చి తన పర్యటన వాయిదాకుఏర్పాట్లు చేయమని కోరి ,శాసన సభ్యులకు బహిరంగ లేఖ ద్వారాకూడా తెలియ బర్చాడు .ఇండియన్ల వోటు హక్కు రద్దుబిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి ప్రచార సంఘం హాజీ ఆడం చైర్మన్ గా ,,గాంధి సెక్రేటగాఏర్పాటైంది .నెలరోజులలోపే పది వేలమంది భారతీయులు అంటే అక్కడున్న వారిలో నాలుగో వంతు వారు ఒక పిటిషన్ పై సంతకాలు చేసి,లండన్ లో కాలనీల సెక్రెటరి ఆఫ్ స్టేట్ లార్డ్ రిప్పన్ కు పంపారు ..నటాల్ శాసన సభ దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు . గాంధీ ఆయన తరఫువారు చేసిన ప్రయత్నం పలుబడి ప్రభావాల వలన ఇంపీరియల్ ప్రభుత్వం ఆ బిల్లును అంగీకరించకుండా నిలుపుదల చేసింది ,ఇది గాంధీ సాధించిన తొలివిజయం .
1894మే లో ఈ పోరాట సమితి ‘’నటాల్ ఇండియన్ కాంగ్రెస్ ‘’గా రూపొంది ,ప్రతి భారతీయుడిని సభ్యుడిగా చేరటానికి బాగాతోడ్పడింది .ఈ లోగా గాంధీ ఇండియన్ లలో ఆ౦త రింగిక అభి వృద్ధి కోసం ప్రయత్నించాడు .తమ తప్పులు తాము తెలుసుకోనేట్లు చేయటానికి గాంధీ మిత్రబృందం అనేక ప్రదర్శనలు నిర్వహించి వాటిపై సంగాలు చేసి,వారితో చర్చలు జరిపి పరిశుభ్రత ,ఆరోగ్యాలపై అవగాహన కలిపించారు .నివాసాలకు ,షాపులకు వేర్వేరు బిల్డింగ్ లు ఉండాల్సిన అవసరాన్ని,తమ స్థాయిని బట్టి తగినట్లుగా బాగా ఉండాలని తెలియ జెప్పారు .ఈరకమైన స్వాతంత్రం ఒక ఏడాదిన్నర గడిచింది .కాని నక్కజిత్తుల ప్రభుత్వం అతి తెలివిగా కోరలు ఇండియన్ లలో బాగా లోతుకు దిగేట్లు బిల్లును మార్చి ,మసిపూసి మారేడుకాయ చేసి అది వాళ్ళను ఉద్దేశించి కాదనే అభి ప్రాయం కలిగించింది .అందులో ఇలా ఉంది –‘’ఈ చట్టం ,అత్యున్నత ప్రత్యెక హక్కు, పౌరసత్వంవోటు ,హక్కు లేని అనుభవం లేనివారి వోటుహక్కును మాత్రమె తొలగిస్తుంది ‘’ .అంటే మరో విధంగా చెప్పాలంటే ,అప్పటికి తమ మాతృదేశాలలో వోటుహక్కు లేని అన్ని జాతులవారికీ వర్తిస్తుంది .ఈవిధంగా భారతీయ సంతతిఇంగ్లీష్ వారితో సమానత్వం ,వోటుహక్కులను ఈ బిల్లు హరి౦చేసి, గొప్ప అన్యాయం చేసింది .
భారత్ కు మళ్ళీ
,మూడేళ్ళు దక్షిణాఫ్రికాలో గడపిన గాంధి , 1896 వేసవిలో కుటుంబంతో సహా తిరిగివచ్చి ,భారత దేశ జాతీయ నాయకులకు దక్షిణాఫ్రికా భారతీయుల దీన హీన నికృష్ట జీవితాన్ని నివేదించాడు .వెంటనే ‘’గ్రీన్ పాంఫ్లెట్ ‘’పేరుతో సౌతాఫ్రికా భారతీయల గురించి రాసి ప్రచురించాడు .చాలా మంది నాయకులను కలిసి ,పబ్లిక్ మీటింగ్ లలోనూ ,నటాల్ ఇండియన్ల దీనగాధను వివరిస్తూ ,ఏ ఒక్క అవకాశమూ వదిలిపెట్టలేదు . గాంధీ కార్యక్రమాలగురించి నటాల్ కు ,ఇంగ్లాండ్ కు తప్పుడు సమాచారాలు అందాయి .ఆయన వెలువరించిన గ్రీన్ పాంఫ్లెట్ ను తప్పుగా వక్రీకరించి ,రెచ్చ గొట్టే విధానం గా మసాలా దట్టించి లండన్ లోని ప్రెస్ ఏజెన్సీ కి, రాయిటర్ వార్తా సంస్థకు కేబుల్ చేశారు .అక్కడినుంచి దక్షిణాఫ్రికాకు పంపారు .దీనివలన గాంధీగారు సౌతాఫ్రికా తెల్లజాతి వారిని ,న్యాయస్థానాలను దారుణంగా ద్వేషిస్తున్నాడని ,అక్కడి తెల్లవారికి తనదైన అచ్చమైన నల్లముఖం తో కనిపిస్తున్నాడని బాగా ప్రచారం చేశారు .ఈ కేబుల్ దక్షిణాఫ్రికా వార్తా సంస్థలకు , , నటాల్ లోని కాలనీప్రభుత్వానికి విపరీతమైన ఆగ్రహం తెప్పించింది .అసలే కోతి ,ఆపై తాగి నిప్పులమీద నడిచినట్లైంది .
నటాల్ ఇండియన్ కమ్యూనిటి జనవరిలో పార్లమెంట్ మొదలయ్యే లోపు దాక్షిణాఫ్రికాకు తిరిగి రమ్మని టెలిగ్రాం పంపింది .వెంటనే బాక్ టు పెవిలియన్ లాగా కుటుంబంతో బయల్దేరి డర్బాన్ చేరాడు .1897మొదట్లో డర్బాన్ హార్బర్ లో కోర్ట్ లాండ్ ,నటేరి అని రెండు షిప్పులు 800మంది భారతీయులతో చేరాయి .వారందరినీ ‘’క్వారెంటైన్ఆర్డర్ ‘’ద్వారా అక్కడే ఉండేట్లు చేశారు .ఈ ఆర్డర్ ప్రవేశ నిషేధం తోపాటు ఆరోగ్య సమస్యలను బాగా పెంచుతుందని వాదించాడు .కాలనీ వాసులకు గాంధి రాక తెలిసి ,అప్పటికప్పుడు ఒక సభ జరిపి ఇండియన్ బలగాలు ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వాన్ని కూల దోసెప్రయత్నాలు చేస్తున్నారని , ప్రసంగాలు చేసి కాల నిస్ట్ లను రెచ్చగొట్టి , షిప్పులలోని ఇండియన్స్ ను దిగనిస్తే మహా ప్రమాదమని ,కల్లోలం సృష్టిస్తారని కనుక ప్రభుత్వం వాళ్ళ రాక ను నిషేధించే చట్టం చేయాలని తీర్మానాలు చేసి ,అలా కాకపొతే తెల్లవాళ్ళు తమకు తోచిన విధం గా చేయాల్సి వస్తుందని ,ఘాటుగా స్పందింఛి ఇండియన్ లపై వ్యతిరేకతను పుండుకు కారం రాసినట్లు తీవ్రతరం చేశారు .
మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-19-ఉయ్యూరు