గాంధీజీ మహాత్ముడైన విధం -5
ఫోనిక్స్ పరిష్కారం
ఈ సమయం లోనే గాంధీ స్నేహితుడు హెచ్ ఎస్ ఎల్ పొలాక్ వీడ్కోలు చెప్పటానికి వచ్చి జాన్ రస్కిన్ రాసిన ‘’అన్ టు ది లాస్ట్ ‘’పుస్తకం ఇచ్చి డర్బాన్ కు జరపబోయే 24 గంటల రైలు ప్రయాణం లో చదవమన్నాడు .అది చదివి విపరీతంగా ప్రభావితుడైనాడు .అందులోని మూడు సిద్ధాంతాలు ఆయనమనసును పట్టేశాయి .అవి
1-మనిషిలోని మంచితనం అందరి మంచి తనంలో నే ఉంటుంది .
2-లాయర్ పని ఎంతగొప్పదో మంగలి పనికూడా అంతగొప్పదే ..ప్రతి వృత్తి జీవికకోసమే కనుక అన్నీ సమానమైనవే .
3-కూలీ జీవితం ,రైతు జీవితం ,చేతి వృత్తిపని వారి జీవితం జీవనాకికి అర్హమైనవే
ఈ మూడు సిద్ధాంతాల ప్రభావతో గాంధీ తన భవిష్యత్ జీవితాన్ని తీర్చి దిద్దుకున్నాడు .ఈ భావనలతోనే 1904లో డర్బాన్ కు 12మైళ్ళ దూరం లో ఒక సెటిల్ మెంట్ ను ఏర్పాటు చేశాడు .మొదట్లో ఇరవై ,తర్వాత మరో ఎనిమిది ఎకరాలు కొని ,దానిని ఒక ప్రయోగ క్షేత్రంగా మార్చాడు .ఇందులో ఉన్నప్రతి ఒక్కరు కాయకష్టం చేయాల్సిందే .ఫలితాలు లాభాలను అందరూ సమానంగా పంచుకోవాల్సిందే .దీనినే గాంధీజీ ‘’ఫోనిక్స్ సెటిల్మెంట్ ‘’అన్నాడు .
మారిన యుద్ధభూమి
కొత్తపోరాటం ప్రారంభించిన గాంధి ,తన యుద్ద క్షేత్రాన్ని నటాల్ నుంచి , ట్రాన్స్ వాల్ కు మార్చాడు .కారణం ఇక్కడ నల్లవారిపై బ్రిటిష్ వాళ్ళ పాలన ,దౌష్ట్యం ఎక్కువవటమే.ఈ అన్యాయాన్నిఎదిరించటానికే కార్య స్థానం మార్చాడు .ఇక్కడే మొదటిసారి సత్యాగ్రహ అస్త్ర ప్రయోగం చేశాడు .కాని సమస్య పరిష్కారానికి చాలా ఏళ్ళు పట్టింది .ఏది ఏమైనా ఇక్కడి ఇండియన్ ల గౌరవం, ఆత్మ గౌరవాలను పరి రక్షించాలని సంకల్పించాడు .
1906లో నటాల్ లోని జులూస్ వారు నటాల్ ప్రభుత్వంపై తిరగబడ్డారు .దీనితో సత్యాగ్రహ ఉద్యమం ఆగిపోయింది .బాధితుల సేవకోసం తన ఇండియన్ అంబులెన్స్ కార్ప్స్ ను గాంధీ రంగం లోకి దించే ప్రయత్నం చేయగా ప్రభుత్వం ఆమోదించింది .క్షతగాత్రులకోసం ఒక హాస్పిటల్ ,24మంది వాలంటీర్ల దళం ఏర్పాటు చేశాడు .ఇక్కడి ఇండియన్ లకు గాంధీ ‘’సార్జంట్ మేజర్ ‘’అనిపించాడు .ఎవరికి వారు తమవంతు సేవలందించి ఆదుకొన్నారు .
రాజకీయ ఉద్రేకాలు తగ్గిపోగానే గాంధీ మళ్ళీ ఉద్యమామం మొదలెట్టాడు .సత్యాగ్రహుల సంఖ్యపెరిగింది .ప్రభుత్వం వీరిని అరెస్ట్ చేసి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని కేసుపెట్టి తీవ్ర శిక్షలు విధించింది .వీటికి సత్యాగ్రహులు భయపడలేదు .తమపోరాతానికి ఇవేమీ అడ్డంకి కాదని భావించారు .గాంధీని కూడా అరెస్ట్ చేసి కఠిన కూలీ పని చేయించారు .గాంధీ మిత్రుడు పొలాక్ ,దక్షిణాఫ్రికాలో ఉన్న జర్మన్ ఆర్కిటెక్ట్ కలాన్ బాష్ లను కూడా అరెస్ట్ చేసి౦ది ప్రభుత్వం .సత్యాగ్రహమే ఒక యుద్ధంతో సమానం అనిపించింది ఇండియన్ లకు .ఈ ధోరణి నాలుగేళ్ళు సాగింది .సత్యాగ్రహ కుటుంబాలను ‘’సత్యాగ్రహ అసోసియేషన్ ‘’కొంతవరకు ఆదుకోన్నది..జోహాన్స్ బర్గ్ లండన్ లో ఉన్న ఆఫీస్ ల నిర్వహణకు కావాల్సిన డబ్బుకావాలి .భారతీయ అభిప్రాయం ప్రతిఫలించి సాయం అందింది .
1906 నుంచి ఫండ్ నిధులు ఖాళీ అవటం మొదలైంది .రాజకీయ పోరాటం లో ని౦డా మునిగిన గాంధీ లా ప్రాక్టీస్ కూడా తగ్గి డబ్బుకు కటకట అయింది .రతన్ టాటాలాంటి వారి ఆర్ధక సాయం ఏమూలకూ చాలటం లేదు .నిత్య ప్రభుత్వ ఘర్షణ .కాలమూ కలిసి రావటం లేదు .కనుక అందరు భారీగా ఖర్చులు తగ్గించుకోవటమే తరుణోపాయం అని గాంధి భావించాడు .అందుకోసం సత్యాగ్రహ కుటుంబాలను సహకార క్షేత్రం లోకి మార్చటం ఉత్తమమని అనిపించింది .కానే ఫోనిక్స్ సెటిల్ మెంట్ డర్బాన్ దగ్గర జోహాన్స్ బర్గ్ నుంచి 30గంటల రైలు ప్రయాణ దూరం లో మరొక ప్రాంతం లో ఉంది .
టాల్ స్టాయ్ ఫారం
ఈ సంక్లిస్ట పరిస్థితు లలో హేల్లాన్ కల్లెం బాష్ ఆపద్బా౦ధవుడిగా ఆదుకొన్నాడు .జోహాన్స్ బర్గ్ కు 20మైళ్ళ దూరం లో 1100ఎకరాల భూమికొని ,సత్యాగ్రహులు ఉచితంగా ఉండటానికి గాంధీకి ఇచ్చాడు .అందులో చిన్న ఇల్లు వెయ్యి ఫల వృక్షాలున్నాయి .ఈ క్షేత్రానికి గాంధీజీ ‘’టాల్ స్టాయ్ క్షేత్రం ‘’అని తన ఆదర్శ రష్యన్ రచయిత ఫిలాసఫర్ ,అలేక్జాండర్ లియో టాల్ స్టాయ్ కి గౌరవ చిహ్నంగా నామకరణం చేశాడు .క్రమక్రమంగా ఈ క్షేత్రాన్ని గాంధీ పౌర నివాస భూమిగా మార్చాడు .దీనితో సత్యాగ్రహ కుటుంబాలు ఒకే చోట పరస్పర సహకారం తో జీవించటానికి వీలుకలిగి, ఖర్చులు విపరీతంగా తగ్గిపోయాయి .ఇదే పోరాట క్షేత్రంగా మారి బ్రిటిష్ నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడటానికి ఫలితాలు సాధించటానికి బాగా ఉపయోగపడింది .వీటిలో గాంధీలో ఉన్న ప్రయోగ శీలత అభి వ్యక్తమౌతోంది .ఆరోగ్యం విద్య ,గౌరవ జీవితం సాదించటానికి ఆవాస భూమి అయింది .చివరికి ఈ క్షేత్రం ఆధ్యాత్మిక ఆత్మ పరిశుద్ధి కేంద్రంగా,తపోభూమిగా అభి వృద్ధి చెందింది .
మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక –
సశేషం
2-10-19 గాంధీ జయ౦తిశుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-10-19-ఉయ్యూరు