అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -9
9-ఓరూరు అనంతయ్యమంత్రి
14వ శతాబ్దికి చెందినా ఓరూరు అనంతయ్యమంత్రిదక్షిణ దేశం లోని దండకారణ్యం దగ్గర దేవరకొండకు సమీపం లో ఓరూరుఅనే పల్లెలో నందవరీక నియోగి బ్రాహ్మణ కుటుంబం లో పుట్టాడు .తండ్రి ‘’ఢాకరాజు’’.భార్య మేళాంబ.చౌదేశ్వారీ దేవి అనుగ్రహంతో వీరికి చిక్కప్ప పుట్టాడు .పుట్టిన కొద్దికాలానినే తండ్రి మరణం .అయిదేళ్ళ కొడుకును తీసుకొని తల్లి ఊరూరూ తిరుగుతూ చివరికి బుక్కరాయలు పాలించే విజయనగరం చేరింది .వేపుపైఉన్న కొడుకున్ చక్రతెర్ధందగ్గరున్న కోదండ రామాలయం దగ్గర దింపి భిక్ష కోసం ఊళ్లోకి వెళ్ళింది.నిద్ర పోతున్న ఆకుర్రాడికి ఒక ఘటసర్పం పిల్లాడికి ఎండ సోకకుండా పడగా విప్పిగొడుగులా నిలిచింది .అటుగావచ్చిన ఒకపాములాడికి ఇది గొప్ప వి౦తనిపించి ఈ బాలుడు దశ ఉన్నవాడైతే నేనిప్పుడు నాగస్వరం ఊడితే అనాగుపాము మళ్ళీ రావాలి అనుకొనిఊదగా,ప్రక్కనే ఉన్న పుట్టలోని ఆనాగం మళ్ళీ వచ్చి బాలుడి శిరసుపై పాడగా నీడ పట్టి రెండు గంటలు ఆడి. వెళ్ళిపోయింది.మళ్ళీ అవాక్కైన ఆ ‘’నాగాభోగి ‘’అంటే పాములాడు ఆపిల్లాడిని లేపి హత్తుకొని విషయం చెప్పి ,’’నీకు అదృష్టం కలిసివస్తే నాకేమిస్తావు ?’’అనిఅడిగితే’నాకే మహర్దశ ప్రాప్తిస్తే కొన్ని చెరువులు నగరాలు నీపేర నిర్మిస్తాను ‘’అని చెప్పాడు .మళ్ళీ కుర్రాడిని ముద్దాడి వాడు వెళ్ళిపోయాడు భిక్షాటనకు వెళ్ళిన తల్లి మేళమ్మతిరిగివచ్చింది .కొదుకువ్అలన అంతాతెలుసుకొని అబ్బురపడిందితల్లి .
రోజూ తానూ అతడిని వదిలి వేడుతున్నదుకు బాధపడుతూ అన్చిమాటలు చెప్పి వెళ్ళేది అతడుకూడా తల్లికి తలవంపు వచ్చే పనులు చేయనని తల్లికి తప్పక సంతోషం కలిగిస్తానని తమక్స్తాలు కలకాలం ఉండవని చెప్పేవాడు .బుక్కరయలమంత్రి నారాయణ దగ్గరకు ఒకరోజు ఆమె వెళ్లి తన దీనగాద విన్నవించగా అతడు దయాళువై వారిద్దర్నీ తనింట్లో ఉంచుకున్నాడు .చిక్కన్నకు ఉపనయనం చేసి చదువు చెప్పించి ,తీర్చిదిద్ది రాజసభకు తనతో తీసుకెళ్ళేవాడు .ఒకరోజు అర్ధరాత్రి ధిల్లీపాదుషా నుంచి ఒకఫర్మానావస్తే ,దాన్ని చదివి చెప్పటానికి సమాధానం రాయటానికి లేఖకుడేవరూ దొరక్కపోతే భటులు వెతుకుతుంటే చావడి అరుగే తలగాడా గా నిన్ద్రపోతున్న చిక్కన్న కనిపించగా ,లేపి రాజ భవనం లోకి తీసుకెళ్ళారు .చిక్కన్న దాని చక్కగా చదివి వివరింఛి సంతోషం కలిగించి ,ఇంటికి వెళ్ళాడు .
మార్నాడు బుక్కరాయల సభలో పాదుషా లేఖకు సమాధానం రాయమని వ్రాయస గాండ్లకు చెబితే అందులోని పదబంధం తమకు అర్ధంకావటం లేదుకనుక సమాధానం రాయటానికి అశక్తులం అన్నారు .లేఖ కనబడక పోవటంతో చిక్కన్నను మళ్ళీ పిలిపింఛి ఆలేఖకు కాపీ రాయమని కోరాడు . రాత్రి తాను చదివిన విషయాలన్నీ గుర్తు ఉండటంతో అలాగే లేఖ కాపీరాసి ఇచ్చి వెళ్ళిపోయాడు .రాజు అంతఃపురం వెళ్ళే దూలం నేర్రెలో ఉన్న పాదుషాఉత్తరం చూసి ,చిక్కన్న రాసిన దానితో పోల్చి చూసి ,అతడి బుద్ధి విశేషాలకు ఆశ్చర్యపడి ,తానూ కొలువున్న సభకు సగౌరవంగా ఆహ్వానించి ,మెచ్చుకొని ‘’అమాత్యపదవి ‘’తోపాటు ‘’ఒడయరు ‘’బిరుదు ప్రదానం చేశాడు .
మరొక సారి మంత్రులందరూ కొలువులో ఉండగా తానూ రాజకీయ కార్య మగ్నుదవటం వలన చిక్కన్నకు పూర్తీ అధికారం తోపాటు ధనాగారమూ రాజముద్రిక అప్పగించి వెళ్ళాడు.రాజాజ్ఞను ఔదలదాల్చి నిత్యం సభకు వెడుతూ వ్యవహారాలూ చూస్తూ ,రాజులేని కొరత కనపడకుండా చేస్తున్నాడు .అతని రూపయవ్వన శేముషీ వైభవానికి ముచ్చటపడిన రాణి మోహపడి అతడిని తన మందిరానికి తీసుకురమ్మని చెలికత్తెను పంపింది .కొంచెం తటపటాయియి౦చి రాణి ఆజ్ఞ కాదంటే ఏం ప్రమాదమో అనుకోని వెళ్ళాడు .ఆమె అకస్మాత్తుగా వచ్చి అతడిని గాధంగా హత్తుకొని ప్రేమ కురిపిస్తే ‘’అమ్మా !నువ్వు తల్లిలా౦టి దానివి.కామం పనికి రాదు .నేను బ్రహ్మ చారిణి .ఇక ఇప్పటినుంచి ఏ స్త్రీముఖమూ చూడను .బ్రహ్మ చర్యం పాటిస్తా ‘’అని చెప్పి పాదాలకు నమస్కరించి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు .
మర్నాటినుంచి రాజాస్థానానికి వెళ్ళలేదు .బుక్కరాయలకు ఒక లేఖ రాసి అందులో ఆయన తనపై మోపిన కార్యభారాన్ని అ రోజు వరకు సంతృప్తిగా నేరవేర్చగాలిగానని కాని ఒక అవాంతర పరిస్థితి ఎదురై తన స్వాస్త్యం దెబ్బతిన్నదని ,ధర్మజ్ఞుడైన రాజు వెంటనే వచ్చి ,తనభారాన్ని తీసేయ్యమని ప్రాధేయపడ్డాడు .రాజు వెంటనే వచ్చి విషయం అంతా తెలుసుకొని తానూ అతడికి తగిన కన్యతో పెళ్లి చేయాలని యోచిస్తుండగా తొందరపడి చిక్కన్న బ్రహ్మ చర్య వ్రతం తీసుకున్నందుకు బాధపడి మరేదైనా వరం కోరుకోమన్నాడు చిక్కన్న ‘’ప్రభూ !మీ ధనాగారం లోని ధనం అంతా నాకు ఇచ్చెయ్యండి ‘’అనికోరగా అంతా ఇచ్చేసి పంపించాడు .
చిక్కప్ప సంతోషం తో పెనుగొండవైపు ఉత్తర దిశలో ప్రవహించే ఏటి ఒడ్డున ఒక తటాకం నిర్మించి ,దీనికి ఉత్తరాన ఒకగ్రామం ఏర్పాటు చేసి పాములవాడికి తానిచ్చిన మాట నిలబెట్టుకొని దానికి ‘’నాగ సముద్రం ‘’పేరుపెట్టాడు .దీనితో ఆగకుండా అగస్త్యాశ్రమం దగ్గర గాట్లను చీల్చుకొని ప్రావహించే పెన్నేటి కి అడ్డకట్ట కట్టించి ,ఒక చెరువు త్రవ్వించే పనిలో పొద్దునా సాయంత్రం వచ్చి చూస్తూన్న అతని కార్య దీక్షకు ముచ్చటపడి ఒక జవ్వని అక్కడ ప్రవాహ వేగామాపటం ఎవరి తరం కాదని కనుక వ్యర్ధ ప్రయత్నం మానుకోమని చిత్రావతి నది ఒడ్డున తటాకం నిర్మిస్తే భేషుగ్గా ఉంటుందని చెప్పి అదృశ్యమైంది .మర్నాడు అతనికి ఆమె చెప్పినమాటలు యదార్ధమే అనిపించి అక్కడవదిలేసి ,గార్గాశ్రమ భూమిగా పేరొందిన చోట దేవరకొండదగ్గర చదునైన ప్రదేశం లో మహావేగంగా ప్రవహించే ‘పా౦డునది’’ని చూసి ,తగిన ప్రదేశం అని నిర్న్నయించి అక్కడ ఒక చెరువు నిర్మించి ,దానికి తూర్పు పడమరలలో రెండు తూములు అంటే అలుగులు ఏర్పరచి ,రెండు వైపులా గ్రామాలు ఏర్పాటు చేసి తూర్పువైపు దానికి రాజుపేర ‘’బుక్కరాయ సముద్రం ‘’అనీ ,పడమటి వైపుదానికి రాణి అనంతాంబ పేర ‘’అనంత సాగరం ‘’అనీ పేర్లు పెట్టాడు .
చిక్కనామాత్యుడు అనంత సాగరం దగ్గర కృష్ణగిరిలో దేవాలయం కట్టించి ప్రాణలింగాన్ని ప్రతిస్టింఛి 1364లో ఒక శిలాశాసనం వేయించాడు .మరొక సారి నల్లగుట్ట లమధ్య ప్రవహించే చిత్రావతి నదిని చూసి దానిదగ్గర కరకట్ట పోయించి ఆ నీరు నిలవ ఉంచితే సాగుకు త్రాగటానికి పుష్కలంగా నీరు లభిస్తుందని భావించి వేలాది మంది కూలివాళ్ళను, వడ్డెర వాళ్ళను పిలిపించి తటాకం నిర్మించి ఒడ్డ్డున శ్రీ చౌడేశ్వరి దేవాలయం ,వినాయక దేవాలయం కట్టించి ,అక్కడే కొన్నేళ్ళు ఉండి సంతృప్తిగా ప్రాణాలు వదిలేశాడు .స్వార్ధం ,స్వాభిమానం లేని ,శుద్ధమనస్కుడు ,పరోపకారి ,ఔదార్య ఘనుడు చిక్కనామాత్యుడు ధన్యజీవి .
ఆధారం – –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన ‘’సచివోత్తములు ‘’ పుస్తకం
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-10-19-ఉయ్యూరు