సరసభారతి పుస్తక ప్రసాద వినియోగం
సెప్టెంబర్ 29 ఆదివారం ఆశ్వయుజమాస శుద్ధ పాడ్యమి నవరాత్రి ప్రారంభం రోజు ఉదయం మా ఇంటికి వచ్చిన కడప జిల్లా ఒంటిమిట్ట డాక్టర్లైన సాహితీ బంధువులసాహిత్యాభిమానానికి ,భగవద్భక్తి కి సంతోషపడి , మూడుకార్లలో వచ్చిన వారందరికీ శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ సరస్వతీ దేవి ప్రసాదంగా సరసభారతి ప్రచురించిన పుస్తకాలలో 13రకాల సుమారు 350 పుస్తకాలు వీరికీ , అక్కడి దేవాలయాలకు , సాహితీ బంధువులకు అందించమని వారికి అంద జేశాను . వారు మహా ప్రసాదంగా కళ్ళకు అద్దుకొని వెంట తీసుకు వెళ్లారు .వారి సౌజన్యం మరువ లేను .వారికి దసరా నవరాత్రి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్