శ్రీ శార్వరి సరసభారతి ఉగాది వేడుకలలో 3పుస్తకాల ఆవిష్కరణ
సాహితీ బంధువులకు విజయదశమి దసరా శుభాకాంక్షలు –
సరసభారతి నిర్వహించే శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో నేను అంతర్జాలం లో రాసిన, సరసభారతి ప్రచురిస్తున్న ఈ క్రింది 3 పుస్తకాలు ఆవిష్కరించాలని భావిస్తున్నాము
1-ఊసుల్లో ఉయ్యూరు -75ఎపిసోడ్ లలో ఉయ్యూరుకు సంబంధించిన సుమారు నా 75 సంవత్సరాల లోని అనుభవాలు జ్ఞాపకాలు ,పండుగలు వేడుకలు ,పెద్దలు పిన్నలు ,గురువులు స్నేహితులు ,మా కుటుంబానికి సేవచేసినవారు ,అంతరించిన సాహితీ సంస్థలు ,అసామాన్య ప్రతిభతో రాణించినవారి జీవిత విశేషాలు ,శ్రీ మైనేని గోపాలకృష్ణ (అమెరికా )గారి అనుభవాలతోసహా వెలువడువడుతున్న గొప్ప” నాస్టాల్జియా ”. .దీనిని మా గురువరేణ్యులు బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మగార్ల దంపతులకు అంకితమివ్వటానికి గురుపుత్రులైన శ్రీకోట సోదరులు అనుమతించారు . .
2-గుజరాత్ లోని సోమనాథ్ ,,ద్వారక ,అక్షరథాం అనే స్వామి నారాయణ దేవాలయం ,2కర్నాటక రాష్ట్రం లోని లోని మైసూర్ బెంగుళూర్ ,హలీబేడు ,శ్రావణ బెల్గోడా హిందూపూర్ మొదలైనవి ,3-తమిళనాడు లోని చిదంబరం ,శ్రీ రంగం వైదీశ్వర జంబుకేశ్వర ,పళని బృహదీశ్వరాలయం ,అరుణాచలం 4-కేరళరాస్త్రం లోని ఆదిశంకరాచార్య జన్మస్థలం కాలడి ,అనంతపద్మనాభస్వామి దేవాలయం మొదలైనవి 5-మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని ,ఓంకారేశ్వర్ ,ఖజురహో మొదలైనవి 6-ఉత్తర ప్రదేశ్ లోని కాశీ ,ప్రయాగ ,మొదలైన మా క్షేత్ర యాత్రా సందర్శన విశేషాలతో వెలువడుతున్న”ట్రావెలోగ్” పుస్తకం”
దీనికి సరసభారతి కార్యవర్గ సభ్యురాలు ,లోగడ వెలువరించిన ”మా అన్నయ్య ”కవితా స౦కలనం కు ప్రాయోజకురాలు ,మాతో కేరళ యాత్ర చేసిన శ్రీమతిసీతంరాజు మల్లికగారు ”స్పాన్సర్ ”
3-వివిధ రంగాలలో అరుదైన పరిశోధనలతో వన్నెకెక్కిన ,పెద్దగా ఎవరికీ తెలియని సుమారు 50మంది తెలుగు శాస్త్ర వేత్తల జీవిత విశేషాలతో వెలువరిస్తున్న ”ఆధునిక ఆంద్ర శాస్త్ర వేత్తలు ”
ఈ మూడు పుస్తకాలను ఆత్మీయులు రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారు సరసభారతి తరఫున ముద్రించి అందజేస్తున్నందుకు ధన్యవాదాలు .
సరసభారతికి మీరు అందిస్తున్న సహకారానికి ,ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞతలతో –
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -విజయదశమి -8-10-19-ఉయ్యూరు
—