అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -14(చివరిభాగం )
14-నండూరు గుండమంత్రి
13వ శతాబ్ది వెలనాటి బ్రాహ్మణుడు నండూరు గుండమంత్రి వెలనాటి రాజేంద్ర చోడుడి మంత్రి .బాపట్లతాలూకా నండూరు వాసి .ఇతనికి శివలెంక మంచన కవి తన కేయూరబాహు చరిత్ర కావ్యం అంకితమిచ్చాడు .ఇతని తాత కు దాత గోవిందన వెలనాటి గొంక భూపతి మంత్రి .గొంక రాజు చివరిరోజుల్లో పాకనాటిపై దండెత్టినట్లు బాపట్ల భావనారాయణస్వామి ఆలయ శాసనం లో ఉంది .గొంకన నెల్లూరుదాక పాలించాడు .కులోత్తుంగ చోళుడికాలం లోవేంగిపై కల్యాణి, కటకం సామంతులు దండెత్తివచ్చినా, కొమ్మనమంత్రి కొత్తచర్లదగ్గర వారిని ఓడించి రాజుకు విజయం చేకూర్చాడు .మూడవ గొంక రాజు తర్వాత 1186లో ధనదుప్రోలు సింహాసనమెక్కిన వెలనాటి చివరి రాజు .శ్రీకూర్మం దాకా రాజ్య విస్తరణ చేశాడు .ఇతన్ని చంపిన తిక్కరాజు రాజేంద్ర చోడుడి కొడుకు .తిక్కరాజుమంత్రి కేతన .కేతన మనవడే గుండన మనుమసిద్ధి రాజు మహా సచివుడు .మన్మసిద్ధి తండ్రి తిక్కరాజు పృధ్వీశుడిని చంపాడు .తిక్కరాజు 1250వరకు రాజ్యం చేశాడు .కేతన మనవడు గుండనకు కేయూరబాహు చరిత్ర అ౦కిత మివ్వటం చేత ఇతనికాలం 13వ శతాబ్ది .’’ధరణిం దాన గుణు౦డ వీవని ,కవీంద్ర శ్రేణి వర్ణింప గా బిరుడదుల్నిండిన గుండ యే౦ద్రునకు ‘’అనే పద్యాన్ని బట్టి యితడు దాతలకే గురువు కవుల పొగడ్తలు అందుకొన్నవాడు, అనేక బిరుదులున్నవాడని తెలుస్తుంది .మంచన నన్నయ తిక్కనాదులను స్తుతించలేదు .
గుండనమంత్రి ‘’ప్రజ్ఞ సంభావిత కావ్య దక్షుడవు భావ్యమతిన్ ద్విజదేవ ‘’అని సంబోధించి ఒకకావ్యం రాసి అంకితమివ్వమని కోరాడు .అందులో ‘’స్థాయి రసము శృంగారంబై యలవడ గథలు నీతులైయెడనెడరా’’గేయూరబాహు చరితము ‘’సేయుము –నీ వ౦ధ్రభాష శిల్పము మెరయన్ ‘’అని చెప్పాడు. ‘’సుగుణుని నినుబొంది మదీయ కవిత నెగడుం బుడమిన్’’అని తృప్తితో గుండనమంత్రికి అంకితమిచ్చాడు మంచనకవి .ప్రతియేటా జరిగే కాకుళేశ్వరుని ఉత్సవాలలలో గుండన మంత్రి మాడలు, రాత్నాలు,సువర్ణం అర్ధులకు, అర్హులకు యిచ్చి సంతృప్తి పరచేవాడని వర్ణించి చెప్పాడు .అదీ గుండన ఔదార్యం .అందుకే స్తుతిపాత్రుడయ్యాడు
.’’ అపూర్వాంధ్ర పూర్వామాత్యులు ‘’సమాప్తం .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-19-ఉయ్యూరు