గాంధీజీ –ఆధునికత -5
రీజన్ ,సైన్స్ లలో దాగి ఉన్న అవకాశాలను ,యూరప్ దేశాలలో యదార్ధంగా ఈ రెండిటి అమలు ల మధ్య విలక్షణత నుగాంధీజీ గమనించాడు .ఆధునికులు అని చెప్పుకోనేవాళ్ళు గాంధీని సంప్రదాయ౦ లోకి తోసేస్తే ,,నయా ఆధునికత వ్యతిరేకులు ఆయనను ఆధునికతను మొత్తం అపహాస్యం చేస్తున్నాడని ముద్ర వేయటానికి ఉవ్విళ్ళూ రారు . ఇటీవలి విశ్లేషకుడు జావేద్ ఆలం ‘’ఒకే ఒక పాతుకు పోయిన ఆధునికత తప్ప మిగిలిన ఆధునికతలు పూర్తిగా అన్వేషణ చేయబడలేదు ‘’అని చెప్పాడు .కనుక పాశ్చాత్య ఆధునికత పై విమర్శ ఆధునికత కు పూర్తిగా లేక ప్రత్యేకంగా చెప్పబడింది కాదని గ్రహించాలి .ఆధునిక రీజన్ ,సైన్స్ ల కార్యక్రమాలు గట్టిగా నియంత్రణలో ఉండే సిద్ధాంతాలపై పని చేయాలని చెప్పాడుగాంధి .ఇవి సంప్రదాయం నుంచి పుట్టినవికావు .అవి మానవులమంచి కోసం యేర్పడినవిమాత్రమే .ఒక సిద్ధాంతం ,లేక కార్యం మంచిది అంటే అది మానవుల మంచితో సంబంధం కలిగి ఉండాలి .అదే హ్యూమన్ గుడ్ అన్నాడు .ఆమంచి సకలమానవాళికి మంచిది కావాలని ఆరాట పడ్డాడు మహాత్ముడు .ఈమానవీయ కోణమే గాంధీ సైన్స్, రీజన్ లకు తప్పక ఉండాలని కోరాడు .
ఆధునికత పై ఈవిమర్శ సంప్రదాయం –ఆధునికత లపై ఉన్న దురభిప్రాయాన్ని బైపాస్ చేస్తుంది అంటే తొలగిస్తుంది .ఇది మానవ అస్తిత్వ హక్కుకు వేదిక అవుతుంది .గాంధీజీ సంప్రదాయం ,సంప్రదాయ సమాజం లను గట్టిగా సమర్ది౦చాడని,నమ్మాడని అంటారు వీళ్ళు .అయన ఈ హక్కు అనే మోడెమ్ తోనే పని చేశాడు .సామూహిక క్షేమం ,అందరి సహకారం తో సాధించే ఆధునికత లో జీవించాలనే ఆయన కోరాడు .మితిమీరిన కోరికలు ఉంటెఅనర్ధ౦ అన్నాడు .పూర్తిగా ఆధునికతతో ,ఆధునికతను ఆధునికత కానిదానితో జతకలిపే ప్రయత్నం చేస్తూ గాంధి జీవించాడు .కనుక ఆయన సంప్రదాయాన్ని చరిత్ర చెత్తలో పారేయకుండా,ఆధునికమానవునికి సంప్రదాయం లో ఉన్న పరిమితి ప్రభావం శ్రేష్టత లను తెలియ జెప్పాడు .అప్పటికే అనుస్యూతంగా వస్తున్నా ,సంప్రదాయం లో ఆధునికత ను దర్శింప జేసి విజయం సాధించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-19-ఉయ్యూరు