గాంధీ కోరాడు .మొదటిది దోపిడీకి సంబంది౦చి౦ది..అధిక వస్తూత్పత్తి పై నాలుగు వాదాలున్నాయి .1-అధిక వస్తూత్పత్తి శ్రామికులను నిర్లక్ష్యం చేస్తుంది 2-మార్కెట్ మీద ఆధారపడుతు౦ది కనుక .మార్కెట్ లేనిదే అస్తిత్వం ఉండదు .అవసరమైనవారికి సరఫరా జరగదు 3-అధికోత్పత్తి అంటేమెషిన్ పై,అధికోత్పత్తిపై గుత్తాధిపత్యం .ఉత్పత్తి పరిశ్రమల యాజమాన్యం చేతిలోనే బందీ అవటం 4-అధికోత్పత్తి వినియోగదారులను ,ఉత్పత్తి ధోరణి లకు అలవాటు పడేట్లు చేస్తుంది .దీనితో తప్పుడు అవసరాలకు ఉత్పత్తి జరగుతుంది . .ఈనాలుగు విషయాలు ఆయన 1934లోనే చెప్పాడు .వీటిని జాగ్రత్తగా గమనిస్తే అదంతా కాపిటలిజం పై విమర్శ ఆనే అనిపిస్తుంది .1930కాలం లో ఆయన ఎప్పుడూ నిరుద్యోగం ,,ఈ సమస్యను తీర్చటానికి పటిష్టమైన ఎకానమీ అవసరం పైనే మాట్లాడాడు .నిరుద్యోగతవల్ల ,అనుత్పత్తి వల్లా వచ్చే సాంఘికపరిణామాలు ఆయన ఊహించాడు .కనుక ప్రతి వ్యక్తీ తనను తాను పోషించుకొనే పని చేయటానికి తగిన అవకాశాలు కలిపించాలని గట్టిగా కోరాడు .
కనుక ఆయన ఆధునికతను వ్యతిరేకించాడు అంటే కాపిటలిజం ను వ్యతిరేకి౦చాడనే భావం .దీనిపై స్పందించాల్సిన అవసరం అత్యాధునిక సమాజం పై ఉందని అర్ధం .కాపిటలిజం పై వ్యతిరేకత అంటే సమాజాన్ని రెచ్చగొట్టటం కాని ,అంతకుముందున్న స్థితికి తీసుకు వెళ్ళటం కానీ కాదు .నిజాన్నిఅంటే వాస్తవాన్ని ఎప్పటికప్పుడు ఆయన గుర్తించాడు .కనుక పరిస్థితిని మార్చాలని కోరాడు .దీనికోసం ఆయన ఆడర్శదామం అంటే ‘’యుటోపియ’’మనము౦౦దు౦ చాడు .అదే స్వయం పాలన అనే ఆదర్శం .దీని ఉద్దేశ్యాన్ని తరచుగా ఆయన చెప్పేవాడు .ఆదర్శం ఒక దారి చూపే వెలుగు( బీకాన్ ) ,వేలుపెట్టి పొడిచి నడిపిస్తూ పరిపూర్ణ స్థితికి చేరుస్తుంది .ఈ మార్గంలో ఆధునికత ఆకారం మారుస్తూ ,కాపిటలిజాన్ని మచ్చిక చేస్తూ సాగాలి .ఈ సూత్రాలు ఆధునికతకు లోపల బయటా అమలుజరగాలి .ఒకసారి ఆయన భావాలను పునశ్చరణ చేస్తే –1యంత్రం మానవ శ్రమ కు ప్రత్యామ్నాయం కారాదు 2-యంత్రాలు అవసరమే కాని దేశం అధీనం లో ఉండాలి 3-సంపద ట్రస్టీ షిప్ అధీనం లో ఉంటె వ్యక్తిగత ఆస్థి ఉండక దోపిడీనివారింపబడుతుంది .దేశం అధీనం లో ఉండటం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాధీనం లో అని.ప్రైవేట్ ట్రస్టీ షిప్ అంటే నాగరక సమాజం అని ఆయన అభిప్రాయం .4-మరొక ముఖ్యసూత్రం సాధారణ జీవితం గడపటం .సాధారణ జీవితంలో రెండు విధానాలున్నాయి .ఒకటి దురాశ మన జీవితాలను శాసి౦చ రాదు., మనకు అవసరమైన సదుపాయాలతో బతకటం .కాని దీనికి విధి విదానంకాని బ్లూ ప్రింట్ కాని ఉండదు అన్నాడు.రెండవది సరళీకృత ఉత్పత్తి ,మార్పిడి ,వినిమయం అనేవి స్థానికంగా జరగాలి .స్థానికత అంటే అధికోత్పత్తికాదు . అవసరాలకు తగినంత ఉత్పత్తి .వినియోగం ఆ గ్రామం లోనే జరగాలి .స్థానికత అంటే ఒకప్రదేశం అంటే అన్నీ ఉన్న ఇంగ్లాండ్ లాంటి చిన్న దేశం అని అర్ధం .
ఇప్పటిదాకా ఆధునికత కాపిటలిజం లగురించి విస్తృతంగా చర్చించాం .ఇప్పుడు మరో రెండు ముఖ్య విషయాలు అహింస ,సత్యాగ్రహం ఉన్నాయి .ఈ రెండిటిద్వారా సమకాలీన పరిస్థితులకు అనుగుణమైన పౌర సమాజం ఏర్పడాలి .ఆధునికతను అవసరం మేరకు ఉపయోగించుకోవచ్చు .అది పడమటిదేశాలదే, కాలనీయులదే అయి ఉండాల్సిన పని లేదు .అది ‘’మనది’’గా మన ప్రత్యేకతలను కాపాడుతూ విశ్వ జనీనంగా ఉండాలి .శ్రామికులతో కూడిన పరిశ్రమ లు ఉండటమే ‘’మనది’’ అవుతుంది .సాధారణ జీవితం అంటే మన తప్పుల్ని ఒప్పుల్ని బేరీజు వేసుకొ౦టూ జీవించటమే .మన లౌకికవాదం అంటే మత సామరస్యమే కాని రాజ్య మతం కాదు ..యూని వర్సలైజేషన్(సార్వ జనీకరణం ) అంటే సమాజాల విచ్చిత్తికాదు .వాటి అస్తిత్వాలనుకాపాడుతూ కలిపి ఉంచేది .ఏదో ఒకటి పెత్తనం చేస్తే అది యూనివర్సలైజేషన్ కాదు.అసలైనది కాపిటలిజాన్ని తుడిచిపెట్టేదిగా ఉండాలి .ఈ దృక్పధం తో చూస్తే ముసుగులో ఉన్న పెత్తందారీ తనాన్ని మనం ఎదిరించి చేసే పోరాటాలకు కావలసినంత శక్తి చేకూరుతుంది .
సమాప్తం
ఆధారం –సుహాస్ పైషికర్ రాసిన వ్యాసం –‘’గాంధి అండ్ మోడర్నిటి’’
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ 23-10-19-ఉయ్యూరు , ,