‘నూక వప్పెచిమాః-క్రమాత్ ”
ఇదేమిటి తలా తోకా లేని శ్లోకం తెచ్చి హడల గొడుతున్నావని అనుకోకండి .”స్టేషన్సు బెబ0 శాఖాయా0 -నూ క్రా శ్యాది నిర్ణయహ ” అని
-పూర్తిశ్లోకం శ్లోకం మొదటి పాదానికే కంపరమొస్తే
శేషం యేమిటి స్వామీ అనకండి . దీనికో కధ ఉంది .చెబుతా వినండి సారీ చదవండి .
దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు 18యేళ్ళు చిట్టి గూడూరు ఓరియెంటల్ కాలేజీ లో వ్యాకరణ శాస్త్ర బోధకులుగా ఉన్నారు .వారు స్వగ్రామం మసకపల్లి వెళ్ళటానికి బందరు వరకు ఒంటెద్దు బండీలో వెళ్ళి ,అక్కడ బెజవాడ పాసెంజర్ యెక్కి బెజవాడ్ చేరి అక్కడినుంచి ట్రెయిన్ లో వెళ్ళేవారు .వచ్చేటప్పుడూ అదే రూటు . బెజవాడ బందరు మధ్య దూరం 50మైళ్ళే కానీ హాల్టులు 12.. ట్రెయిన్ నడిచే సమయంకంటే ఆపుల సమయం యెక్కువై దున్నపోతు నడకగా పాకీ బండీలా ఉండేది . విసిగెత్తేది ప్రయాణం . అందులో శాస్త్రిగారికి ఈ హాల్టుల పేర్లు అసలు గుర్తుండేవి కావు . ఒకసారి అలాగే బెజవాడ నుండి బందరు పాసెంజర్ లోవస్తున్నారు . ప్రక్కన కూర్చున్న ఒక పెద్దమనిషిని బెజవాడ దాటగానే” తర్వాత స్టేషన్ యేదండి”అని అడిగారు .ఆయన ”తరిగొప్పుల ”అన్నాడు .కాసేపాగి మళ్ళీ అదే ప్రశ్న వేశారు శాస్త్రీజీ .”ఇందుపల్లి ”అన్నాడు . మరికొంత సేపటికి తర్వాత హాల్ట్ యేదిఅని అడిగితే ,ఆయన విసుగు ముఖంతో ”మీకేమైనా సంస్కృత జ్నానముందా””అని అడిగాడు . ”యేదో కొద్దిగా వచ్చు లెండి ”అన్నారు ..” నాకూ ఒకప్పుడు ఈ పేర్లు గుర్తుండక ఒక శ్లోకం అల్లుకున్నాను ..అది చెబుతా విని గుర్తు పెట్టుకోండి .యెవరినీ ప్రశ్నలతో వేధించక్కర్లేదు ”అని తాను అల్లిన పైశ్లోకాన్ని చెప్పాడు శాస్త్రిగారు ధారణ చేసి బెజవాడ నుంచి బందరు వరకు ఉన్న స్టేషన్లను దాని ద్వారా గుర్తు పెట్టుకొన్నారు .ఇంతకీ శ్లోక భావమేమిటి వెంకటేశా అంటే
బె-బెజవాడ ,రా-రామవరప్పాడు ,ని-నిడమానూరు ,ఉ-ఉప్పులూరు ,త-తరిగొప్పుల ,ఇం-ఇందుపల్లి ,దో-దోసపాడు ,గు -గుడివాడ ,నూ -నూజెళ్ళ,క-కవుతర0,వ-వడ్లమన్నాడు,పె-పెడన,చి-చిలకలపూడి ,మ-మచిలీ పట్నం
బెబం శాఖయా -అంటే బెజవాడ -బందరు లైన్ లో స్టేషన్సు -అంటే స్టేషన్లు అని అర్ధం అయింది కదా
దువ్వూరివారికి ”నూక్రాస్యాత్ ”అంటే యేమితో అర్ధం కాలేదు .మనకీ అంతేకదా సారూ .మోహ మాటం లేకుండా ఈ శ్లోకం అల్లినాయన్నే ప్రశ్నించారు .”కవి హృదయం చెబితేకాని తెలియదు లెండి ”అని చిరునవ్వు నవ్వి ”యేమీ లేదు మాస్టారూ!నూ-అంటే నూజెళ్ళ లో క్రా-అంటే క్రాసింగ్ ,స్యాత్ -అంటే అవుతుంది అని చెప్పాడు .హమ్మయ్య అనుకోని ”నాకు చాలా శ్లోకాలు నోటికి వచ్చుకాని ఇంతఉపయోగించే శ్లోకం యేదీ లేదు అయ్యా మీ అడ్రస్సు వగైరా ”అంటూండగానే యేదో స్టేషన్ వచ్చి ఆ సహ ప్రయాణీకుడు ,ఈ శ్లోక రచయిత గబగబా దిగి వెళ్లిపోయాడు . చాలాబాధ పడి,ఆయనెవరో,యే వూరో ,యేం చేస్స్తున్నాడో తెలుసుకోలేక పోయానే అని ఆ అజ్నాతకవి గురించి బాధ జీవితాంతం బాధపడుతూనే ఉన్నారు దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారు
ఆధారం -దువ్వూరి వారి స్వీయ చరిత్ర
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -6-11-19-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్