వినమ్ర కృతజ్ఞతాంజలి
నా దోవలో నేనేదో రాసుకుంటూ,చేసుకొంటూ పోతూంటే ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అనే రాష్ట్ర స్థాయి సాహిత్య సంస్థ దుర్భిణీ వేసి గుర్తించి ,ఒక కొత్త ‘’జ్ఞాన జ్యోతి’’పురస్కారం మొదటి సారిగా ఏర్పరచి ,దానిని ప్రప్రథమంగా నాకు అందజేయటం వారి సౌజన్యానికి నిలువెత్తు ఉదాహరణ .వారందరికీ కృతజ్ఞతలు .ఇది నా అదృష్టమే .సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ స్థాపించి 10 సంవత్సరాలు దాటిన శుభసందర్బం లో ఈ పురస్కారం అందుకోవటం వలన ఈ పురస్కారం సరసభారతి కే చెందుతుందని మనస్పూర్తిగా,వినమ్రంగా భావిస్తున్నాను .పురస్కార విషయం తెలుసుకొన్న అశేష సాహితీ బంధువులు ,సాహితీ మిత్రులు,సాహిత్యాభిమానులు , కుటుంబ బంధుగణం ,పెద్దలు ,పిన్నలు అందరూ విశేషంగా స్పందించి అభిన౦దనలు తెలియ జేసినందుకు అందరికీ కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను .నాపైనా ,సరసభారతి పైనా ఉంచిన మీ అందరి నమ్మకానికి శత సహస్ర నమస్సులు .
జ్ఞాన జ్యోతి పురస్కార ప్రదానం సందర్బంగా అందజేసిన విలువైన కానుక ,అభినందనపత్రం ,జ్ఞాపిక
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-19-ఉయ్యూరు