గౌతమీ మహాత్మ్యం—72-102- ఊర్వశీ తీర్ధం
శార్గ్జ్న ధారుడైన హరి కొలువై ఉన్నదే ఊర్వశీ తీర్ధం .ప్రమతి సార్వభౌముడు శత్రుజయం చేసిసురలతో ఇంద్రలోకం చేరి,పాశుహస్తుడైన ఇంద్రుని చూసి నవ్వగా సురలోకం లో మరుద్గణాలతో క్రీడిస్తే చాలు .నాతొ అనుభవించు’’అన్నాడు .ప్రమతి ‘’దేన్నీ పణంగా పెడతావు ‘’ని అడిగితె ‘’సకల యాగ ఫలం, ఊర్వశిని ‘’అన్నాడు .గర్వంతో ఉన్న రాజు అంగీకరించగా ‘’నీపణ౦ ఏమిటి ?’’ప్రశ్నించాడు సురప్రభువు ‘’దేనికైనా సిద్ధమనగా ఇంద్రుడు ‘’నీకవచం ,బాణాలు ,ధనుసుతో ఉన్న కుడి చేయి పణంగా కోరుతున్నాను ‘’అన్నాడు .జూదం లో ఇంద్రుడు ఓడిపోయి ఊర్వశిని పోగొట్టుకోగా ,రెండవ సారి పణం గా ఏమిటి అని అడిగితె ‘’వజ్రాయుధం, రధం ‘’అన్నాడు ఇంద్రుడు .ఈ సారికూడా పాచికలాట లో ప్రమతి జయి౦చ గా ఇంద్రుడు వాటిని ధారాదత్తం చేశాడు .ఇంతలోఅక్కడికి గందర్వాధిపతి అక్షజ్ఞుడైన విశ్వావసు వచ్చి తన గాంధర్వ విద్య పణంగా పెట్టాడు .మళ్ళీ రాజే గెలిసి గాంధర్వ విద్యనూ కైవశం చేసుకొన్నాడు .గర్వబలంతో ప్రమతి ‘’ఇంద్రా !నా చేతిలో ఓడిపోయావు .ఇక నువ్వు నన్నే ఆరాధించాలి .అసలు నీకు దేవేంద్రత్వం ఎలావచ్చిందో చెప్పు ‘’అన్నాడు .
ప్రమతి ఊర్వశిని తనకు సేవలు చేసుకో మన్నాడు .అలాగే అని దేవతలకు సేవ చేసినట్లే అతనికీ సేవలు చేస్తానన్నది ‘’.నన్ను మాత్రం నిందించకూడదు’’అన్నది .సేవ చేస్తాను ‘’ ‘’అనగా విశ్వావశు కొడుకు చిత్ర సేనుడు రాజుతో పాచికలకు సిద్ధమై ‘’జీవితం, రాజ్యం ‘’పణంగా ఇద్దరూ పెట్టి ఆడాడు .చిత్రసేనుడు జయి౦ఛి గా౦ధర్వాలైన పహా పాశాలతో రాజును బంధించాడు .ఇంతకు ముందు రాజు జయి౦చినవన్నీ చిత్ర సేనుని వశమయ్యాయి .ప్రమతి కొడుకు సుమతి పురోహితుడైన విశ్వామిత్రుని పుత్రుడు మధుచ్చందుని తన తండ్రి జాడ గురించి అడుగగా,దివ్య దృష్టితో విషయం తెలుసుకొని చెప్పి , జూదం వలన కలిగే అనర్ధాలు వివరించాడు జూదం ధర్మ భ్రస్టని చేస్తుంది .సుఖం పోగొడుతుంది .విధి విధానం తప్పించలేమని ఊరడించాడు ‘.
తన తండ్రి రాజ్యం దక్కాలంటే ఏమేమి చేయాలని అడిగితే ‘’గౌతమికి వెళ్లి శంకరుని ఆదిత్యుని ,వరుణ,విష్ణువు లను పూజించు.’’అనగా ,వెంటనే గౌతమీ తీరం చేరి పవిత్ర స్నానం చేసి ,ముని చెప్పినట్లే చేసి దీక్షతో శివుని గురించి తపస్సు చేశాడు .నూట ఒక్క సంవత్సరాలు దేవలోకం లో బంధింపడిన తండ్రి ప్రమతికి విముక్తి కలిగించాడు సుపుత్రుడు సుమతి .రాజ్యం తోపాటు గాంధర్వ విద్య కూడా పొంది దేవేంద్రుని మిత్రుడయ్యాడు ప్రమతి .ఈ తీర్ధమే ఊర్వశీ ,శాంభవం,,వైష్ణవం ,కైతవ తీర్ధంగా ప్రసిద్ధి పొందిందని నారదునికి బ్రహ్మ తెలియజేశాడు
103-సాముద్ర తీర్ధం
గౌతముని చే వదలబడిన గంగ లోకోపకారం కోసం పూర్వ సముద్ర తీరం వెళ్ళింది .దానిని బ్రహ్మ కమండలం లో బంధించాడు .తర్వాత శివ జటాజూటం చేరింది .విష్ణు పాదోద్భవ గంగ ను గౌతముడు భూలోకానికి తెచ్చాడు .సముద్రుడు చూసి చేతులు జోడించి ,ఎదురేగి స్వాగతమిచ్చి ‘’రసాతల ,భూమి ఆకాశం ,లో ఉన్న జలమంతా నన్నే చేరుగాక .నాలో రత్నాలు అమృతం పర్వతాలు రాక్షసులు ,దేవతలు ఉన్నారు .ఈ చరాచరం లో నాకు అసాధ్యం లేదు .నువ్వు పరమ పావనివి లోకోత్తర చరితవు కనుక నాతో సంగమించు ‘’అని కోరాడు .అప్పుడు గంగాదేవి సప్తర్షుల భార్యలను భర్తలతో సహా ఇక్కడికి తీసుకువస్తే ,అప్పుడు తాను అల్ప రూపిణి అవుతానని ,అప్పుడు సంగమానికి అభ్యంతరం లేదని చెప్పింది .నదీ ప్రభువు సముద్రుడు అఆగే వారిని వినయంగా ఆహ్వానించి తెచ్చాడు .అప్పుడు గంగ ఏడు పాయలు అయింది .గౌతమి ఏడుపాయలయ్యాక సముద్రం లో చేరింది .సప్తర్షుల పేర్లతో సప్త గంగ అయింది.ఈ చరిత్ర విన్నా, చదివినా అ౦దులో స్నాని౦చినా ఉత్తమోత్తమ ఫలితాలు కలుగు తాయని బ్రహ్మ నారదుని బోధించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-11-19-ఉయ్యూరు