అదొక్కటే మందు అన్నిటికి
వార్ రూమ్ లో పార్టీ అగ్ర నేతలు భేటీ అయ్యారు .ఎజెండా ఏమిటో ఎవరికీ తెలీదు ఆ ఇద్దరికీ తప్ప .టీ సరఫరా నిరంతరంగా జరుగుతోంది. తాగి శీతాకాలపు చలికి కొంచెం ఉపశమనం కలిగించుకొంటున్నారు .ఇంతలో ‘’జోడీ ‘’వస్తే ,లేచి నిలబడి అభివాదం చేశారు .నంబర్ 2మొదలు పెట్టాడు ‘’మనం ఏది చేసినా జనం లో అసంతృప్తే కనిపిస్తోందని రిపోర్ట్ లు తెగవస్తున్నాయి .స్థానిక కోర్టులు ,పై కోర్టులు ఇచ్చిన తీర్పులుకూడా మనమే ఇప్పించినట్లు ముద్ర వేస్తున్నారు .ప్రజాస్వామ్యం కాపాడటానికి తెల్లవారు ఝామున గవర్నర్ ను లేపి ,రాష్ట్ర పతి పాలన తీసేయించి ,గంటలోపే మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాం ఆఫ్ కోర్స్ అటువైపున్న బలమైన నాయకుడి బంధువును దువ్వి ,పెద్ద కు౦భ కోణం కేసును మాఫీ చేయిస్తామని నోటిమాట ఇచ్చి, బాబాయిని ఎడం కాలితో తన్ను తన్నించి,అతడి వెంట బలమున్నట్లు నమ్మించి ,మనవాడే కనుక రాజభవన్ ‘’నాయనను’’రాజ్యాంగ అతిక్రమణ అయినా ఫర్లేదని ,ప్రమాణ స్వీకారాలు చేయి౦చేశాం .మొత్తం పవర్ అంతా మా చేతిలో ఉ౦ది కనుక నిమిషాలమీద ఇదంతా జరిపింఛాం.ఇదేదో పెద్ద కుట్ర అని,ప్రజాస్వామ్య విఘాతం అనీ పత్రికలూ ,పార్టీలు ,పెద్దలు గగ్గోలు పెడుతున్నారు .కోర్టుకూ వెళ్ళారు .నిన్నరాత్రి హోటల్ లో మీడియా ముందు వాళ్ళ బల ప్రదర్శనతో ,కంగారు పెట్టేశారు .సుప్రీం రేపే బల నిరూపణ చేయమని ఆదేశించటం తో కక్కుర్తి పడి ముఖ్య ,అముఖ్య అయిన మనవాళ్లిద్దరూ ఆఘమేఘాలమీద రాజీనామా చేసి ప్రజాస్వామ్య వీర గౌరవం కాపాడి శివాజీ ఆదర్శాన్నిఅక్షరాలా పాటించారు .అదీ మన పార్టీ ఘన చరిత్ర .ఇందులో ఏదో మేమిద్దరమే అంతా చేశామని మాకు మకిలి అంటించటం బాగుందా ‘’? గుక్కతిప్పుకోకుండా మాట్లాడి గ్లాసెడు నీళ్ళు తాగి .చప్పట్లు వీర మోతమోగించారు .
తర్వాత నంబర్ వన్ లేచి ‘’ భారత శిరోరత్నమైన రాష్ట్రాన్ని ,మూడు ముక్కలు చేశాం సారీ రెండు ముక్కలు చేశాం ,370 రద్దు చేశాం .తలాక్ కు తలాక్ ఇప్పించాం .అయోధ్యలో రాము లోరిగుడికి లైన్ క్లియర్ చేయించాం .నెలానెల వెన్నెల లాగా రేడియోలో వాయిస్తూనే ఉన్నా .నేషనల్ మీడియా అంతా మన వెంటే ఉండేట్లు ‘’నొక్కి పెడుతున్నాం ‘’.స్వచ్చ భారత్ స్లోగన్ వీక్ కాకు౦ డాబాగానే ఊదిస్తున్నాం .అయినా దేశం లో వీధులు నగరాలు అన్నీ మహా చెత్తగా ఉన్నాయని సోషల్ మీడియా శోష పడి చెబుతోంది .గంగ కాలుష్య౦ తగ్గలేదని సామాజిక నాయకులు దూషిస్తున్నారు . అది ఒకపట్టాన తగ్గేదా ?తల్లి భాష ను ప్రోత్సహించమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాం నేనూ ,తెలుగు పెద్దాయనా .కాదని ఇంగ్లీష్ మీడియం అని చట్టం తెస్తున్నారు వీళ్ళని ఏమీ చేయలేక పోతున్నాం. వాళ్ళ అవసరం ఎప్పుడైనా ఉండచ్చు .కుజనా ,రామేశులనుదువ్వి కాషాయం కప్పి వాళ్ళతో ఆపార్టీనుఛి పాతికా ఈపార్టీనుంచి సగం వస్తున్నారని ఊదర కొట్టిస్తున్నాం .వీళ్ళకు ఎన్నికలలో గెలిచే సత్తాలేదని తెలుసుకాని అవసరం అలాంటిది .అసలు తెలుగు రాష్ట్రాలలో మనకు గట్టి నాయకులు లేరు .అక్కడి సిఎం లను ఎదుర్కొనే మగాడు మనకు లేరు .మనవాళ్ళు గిరీశం చెప్పినట్లు ‘’వట్టి —-లోయ్ ‘’లా గా ఉన్నారు .మా ఇద్దరికీ జుట్టు లేకపోయినా ఏం చేయాలో తోచక తెగ పీక్కు౦ టున్నాం.వీటన్నిటికి ఒకే ఒక పరిష్కారం కావాలి .మీలో ఎవరైనా చెప్ప వచ్చు ‘’అని వాగ్ధోరణి ఆపి తనకిష్టమైన చాయ్ తాగి కూర్చున్నాడు .అంతామొహామొహాలు చూసుకొన్నారు .ఏ ఒక్కరూ లేచి నిలబడటం లేదు .నోరు మెదపటానికీ భయ పడుతున్నారు .
ఇదంతా ఆఇద్దరికీ తెలుసు .ఎవరూ మాట్లాడరనీ మాట్లాడితే ఏం జరుగుతోందో బాగా వాళ్లకి తెలుసనీ ఈ ఇద్దరికీ ఇంకాబాగా తెలుసు .మళ్ళీ నంబర్ 2 లేచి ‘’వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం .అందరి నోళ్ళు మూయించటం .చానళ్ళలో వ్యతిరేక వార్తలు రాకుండా కట్టడి చేయటం .నోట్ల రద్దు బూమేరాంగ్ అయి౦ది కనుక గోల్డ్ పై కట్టడి చేయటం ,ఏ కోర్టు అయినా మన కను సన్నల్లో ఉండేట్లు చేయటం .ఇవన్నీ కలిపి ఒకే రాజ్యాంగ సవరణలో పొందుపరచి చట్టం తేవటం .మీరేమంటారు ?’’అనగా అంతా బాగుంది బాగుందని చప్పట్లు కొట్టారు .నంబర్ 1 లేచి ‘’నంబర్2 చెప్పింది చాలా బాగుంది .అదే మన తక్షణ కర్తవ్య౦ .అయితే దీనికో తిరకాసు ఉంది .ఎప్పుడైనా ఖర్మకాలి మనం మన పార్టీ ఓడి పోతే ఇదే చట్టాన్నికొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మనమీద అంటే పాత ప్రభుత్వం మీద మనలాగే ప్రయోగింఛి కక్ష సాధించుకో వచ్చు .కనుక మనం తెచ్చే ఈ కొత్త సవరణ చట్టం లో ‘’ఈ ప్రభుత్వం అధికారం లో ఉన్నంత వరకే నని ,అధికారం కోల్పోతే ,చట్టం కొత్తప్రభుత్వానికి వర్తించదని’’ చేర్చాలి .అప్పుడు ఉభయ తారకంగా ఉంటుంది .’’అని తన నంబర్ 1 తెలివిని ప్రదర్శించాడు .బల్లలు పగిలే చప్పట్లు చరిచి మళ్ళీ టీలు తాగి వార్ రూమ్ లోంచి బయటికి వచ్చారు అగ్రనేతలు .
వస్తూ వారిలో వారు ‘’ఒకప్పుడు చెయ్యి పార్టీ అధికారం లో ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను దుర్విని యోగం చేశారని ఎన్నో కేసులు పెట్టాం .ఎమర్జన్సీ పెట్టారని వీధుల్లో జిల్లాల్లో పడ్డాం .ఇప్పడు అంతకుమించిన షాడో యెఅర్జెన్సేలొ బతుకు తున్నాం .వోటింగ్ మెషీన్లు ఫ్రాడ్ అని గగ్గోలు పెట్టాం .మన ‘’తెలుగు మేధావి’ ఒకాయన ఉద్గ్రంథమే రాసిపారేశాడప్పుడు . .ఇప్పడు మెషీన్లు అచ్చా బాలట్ పేపర్లు బురా అని తందానా అంటున్నాం .చానళ్ళ పై నియంత్రణ వద్దని వీధి పోరాటాలు చేశాం .ఆయారాం గయారాం లతో ఇబ్బందని కోర్టులకెక్కాం ,పేపర్ల నిండా ఏకి పారేశాం .ఎక్కడ ప్రాజాస్వామ్యానికి విఘాతం కలిగినా చట్ట సభల్లో నిలువరించాం .అన్యాయంగా చేసే రాష్ట్ర విభజనలను కట్టడి చేయమని ఒత్తిడి తెచ్చాం .ఎనభై దాటినా మన పెద్దాయనకు రాష్ట్రపతి పదవి ఇస్తున్నట్లు జ్యోతిర్లిన్గాలయం లో ప్రమాణం చేసి ఆంధ్రులకు కొత్తరాజదానికత్తించాతానికి అన్ని రకాల ఆర్ధిక సాయం చేస్తామని తిరుపతి బాలాజీ సమక్షంలో ,పార్లమెంట్ లో వాగ్దానం చేసి ,నిలబెట్టు కాకపోతే నోరు మెదపలేక పోయాం .తిలాపాపం తలాపిడికెడు అయింది మనబతుకు .నోటుకు వోటుచేటు అని వాదించాం.ఎమ్మెల్యేలను బందీ చేయటాన్ని నిరోధించాం.అన్యమతస్తులను గౌరవించాం.కానీ ఈ ఐదేళ్ళుగా ఇవన్నీ మనమే చేసి ,ప్రజాస్వామ్యఘాతకులమని అనిపించుకొంటూ ప్రజలకు మొహాలు చూపించలేక పోతున్నాం .కక్కా లేక మి౦గాలేని పరిస్థిలో ,శేష్మం లో పడ్డ ఈగల్లాగా ఉన్నాం .ఎలాంటి ఆదర్శనాయకులు పార్టీనీ ,ప్రభుత్వాన్నీ నడిపి అపోజిషన్ తోనూ , శెభాష్ అని పించుకొన్నారు ?ఇవాళ నాయకత్వానికి గెలుపు మీదేదృష్టి తప్ప రాజ్యాంగ వ్యవస్థ ,ప్రజాస్వామ్యం ,చట్ట సభలపై ,వ్యవస్థలపై గౌరవమే లేదు .అన్నీ నిర్వీర్యం చేస్తున్నారు .చెప్పాలని ఉన్నా,మన లోని ‘’మన్ కీ బాత్ ‘’ చెప్పలేక దిగమింగుకొంటున్నాం .ఆ మధ్య కర్ణాటకలో కక్కుర్తి గా ‘’ఎడ్డీ ‘’ని గద్దేనెక్కించి కోర్టు తీర్పుతో బిత్తరపోయి ,తెరవెనుక బేరసారాలు కూడా ఫెయిలయి, రికార్డ్ లు బయటికి వచ్చి ,బలనిరూపణముందే రాజీ నామా చేయించి కూడా ,మళ్ళీ ఇప్పుడు మహా లో మహా డ్రామా ఆడి తల బొప్పి కట్టించుకొన్నారు .అంటే అసలు వీళ్ళకు వ్యవస్థలమీద నమ్మకం ఉందా అని అనుమానం కలుగుతోంది .నిఘా నేత్రాల నీడలో బతుకు తున్నాం .ఇప్పుడు మన అగ్రనాయకులిద్దరూ తెచ్చే చట్టం తో ప్రజాస్వామ్యం ‘’హరీ’’ అనక తప్పదు .శాంతం పాపం .దేవుడే రక్షించాలి ఈ దేశాన్ని ‘’అంటూ గుడ్ల నీరు కుక్కుకొంటూ కార్లెక్కి వెళ్ళిపోయారు ,
మీ- గబ్బిటదుర్గాప్రసాద్ -26-11-19-ఉయ్యూరు