మహా భక్త శిఖామణులు
7-అప్పాస్వామి
తమిళనాడుకు చెందిన అప్పాస్వామి అసలుపేరు ‘’మరుల్ నీకియార్ ‘’.తండ్రి పులగానార్ .తల్లి మతినియార్ .అప్పా అక్క తిలాతవధియార్ ను కలిప్ప హయ్యార్ అనే పల్లవరాజు సైన్యాదికారికిచ్చి పెళ్లి చేయాలనుకోగా ,అతడు ఉత్తర దేశం నుంచి వచ్చిన ఒక వీరుడిని ఎదుర్కొని పోరాడుతూ చనిపోయాడు .ఈలోపే ఈపిల్ల తలిదండ్రులూ చనిపోయారు .బాలిక సతీ సహగమనం చేద్దామని ప్రయత్నించింది ,కాని ఉన్న ఒక్కగానోక్కతమ్ముడు దిక్కులేని వాడైపోటాడని ప్రయత్నం విరమించుకోన్నది .అప్పాఆలోచనలు వయసు వచ్చినకొద్దీ తత్వ జిజ్ఞాసపై మరలింది .అప్పటికి మంచి ఊపులో ఉన్న జైనమతం ఆకర్షించి ,జైనతీర్ధం పుచ్చుకొని గ్రంథాలు బాగా పఠింఛి ,అనంత జ్ఞాన సంపన్నుడయ్యాడు .తర్వాత పాటలీ పుత్రం వెళ్లి ,తనప్రతిభ చూపి జైనసంఘానికి ఆధ్యాత్మిక నాయకుడయ్యాడని ఒక కథ ప్రచారం లో ఉంది .
తమ్ముడిలా మత భ్రస్టుడయ్యాడని అక్క చాలా విచారించి ,స్వగ్రామం లో ఉండలేక కేటిలాం నదీ తీరాన ఉన్న ‘’తిరుఅతి కై ‘’అనే శైవ క్షేత్రం చేరి ,పరమ శివారదనలో గడిపింది .కాని తమ్ముడు తిరిగి వస్తాడన్ననమ్మకం ఆమె మనస్సులో గాఢంగా ఉంది .ఆమె ప్రార్ధన పాలించి నట్లుగా ,పాట్నాలో సుఖ జీవితం గడుపుతున్న తమ్ముడికి ఒక రోజు కడుపులో భరింపరాని బాధకలుగగా,జైన సన్యాసులు ఎన్నో మంత్రాలు మందులతో తగ్గించే ప్రయత్నాలు చేసినా బాధ పెరిగిందేకాని తగ్గక ,మరణబాద అనుభవించి ,దూరాన ఉన్న దిక్కులేని అక్క గుర్తుకు వచ్చి ,కన్నీరు జలజలా ఏరులా ప్రవహించగా ,చివరికి అక్కకు ఒక పరిచితుడిద్వారా కబురు చేశాడు .
ఆ కబురు విన్న అక్క తాను అన్యమతం వాడి ముఖం చూడనని ,ఆప్రదేశానికి రాన నీ ఖచ్చితంగా ప్రత్యుత్తరం పంపింది .అతనిలో మార్పు వచ్చి మతాన్ని వదిలేసి ,అక్క అనురాగం పొందాలని తపించి ,ఆలస్యం చేయకుండా ,అక్క ఉన్న చోటుకు వెళ్లాలని నిశ్చయించి ఒక అర్ధరాత్రి జైన దుస్తులు తీసిపారేసి ,భిక్షాపాత్ర, నెమలికన్నులు ఆశ్రమంలో వదిలేసి అక్క ఉన్న చోటికి ఎవరికీ తెలియకుండా బయల్దేరి వెళ్ళాడు .దారిలో కడుపులో బాధ మరింత పెరిగి,చివరికి తిరు అతి కై చేరి అక్కపాదాలపై పడి’’నీకు ద్రోహం చేసిన పాపిని క్షమించు అక్కా ‘’అని ఏడ్చేశాడు .అక్క మనసుకరికి అక్కున చేర్చుకొని తమ్ముడిని ఊర డించి ధైర్యం చెప్పి,లేవదీసి ముఖాన భస్మం రాసి దేవాలయ గర్భాలయ౦లోకి తీసుకువెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయించి,శివ ప్రార్ధన చేయించింది .ప్రార్ధన పూర్తికాగానే అతడి ఉదర వ్యాధి తగ్గిపోయింది .ఇది శివమహిమ అని నమ్మకం కలిగి ఆనంద పారవశ్యంపొందాడు .అకస్మాత్తుగా అతని నోటినుంచి మధుమదురమైన శివ భక్తి గీతాలు వెలువడినాయి .అతని రచనలో ఇవే చాలా ఉత్కృష్టమైనవిగా భావిస్తారు .
ఆకాలం లో దక్షిణ దేశంలో కొలేరూన్ నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలన్నీబలసంపంనులైన పల్లవరాజుల ఆధీనం లో ఉన్నాయి . అప్పటి రాజు ‘’కదవ ‘’జైనమతావలంబి .కనుక యువ శివస్వామి అప్పాస్వామిని అన్ని రకాలబాధాలకు గురి చేయమని ఆజ్ఞ జారీ చేశాడు .కాని వినకపోతే తనదగ్గరకు తెప్పించుకొవాలని భావించి భటుడికి చెబితే తనవల్లకాదని అంటే మంత్రినే పంపగా రాజు మనసు మార్చాలని స్వామి వెంట వెళ్ళాడు .యువ స్వామిని కొట్టించాడు సున్నపు బట్టీలలో దొర్లించాడు ,సముద్రంలోకి విసిరేయి౦ చాడుకాని అతనికి ఏమీకాలేదు యోగికనుక నీటిపైతేలి ,భక్త ప్రహ్లాదునిలాగానే శివభక్తి మహిమతో ‘’తిరుప్ప తిరి పులియూర్ ‘’తీరం చేరాడు .పై సంఘటనలో ఆతడు శివమహిమలను కీర్తిస్తూ రాసినవన్నీ బహుళ ప్రచారమయ్యాయి .చివరికి కేతిలాం నది దాటి ఉన్న చోటుకు చేరాడు .పల్లవ కదవ రాజు స్వామి మహిమ గ్రహించి జైనం వదిలి శైవం స్వీకరించి స్వామి శిష్యుడయ్యాడు .జైనమందిరాలు పడగొట్టించి శివాలయాలు కట్టించాడు .తిరు అతి కై లో గొప్ప శివాలయం నిర్మించాడు పల్లవరాజు .
అక్క దగ్గర కొంతకాలం గడిపి తీర్ధ యాత్రలు చేస్తూ ,చిదంబరం వెళ్లి ,నటరాజ స్వామి సన్నిధిలో భక్తిభావబందురపద్యాలు , గేయాలన్నో రచించాడు .అవి ఇప్పటికీ ప్రజలనాలుకలమీద నర్తిస్తున్నాయి .తర్వాత కావేరి నదీ తీరశైవాలయాలన్నీ ,తంజావూరులోని ‘’శియాలీ ‘’తో సహా సందర్శించాడు .తి౦గలూరులో’’అప్పుధి’’అనే బ్రాహ్మణ సాధువు ను దర్శించగా స్వామి వెల్లాల కులం వాడని తెలిసినా ఆదరంగా ఆదరింఛి ఆతిధ్యమిచ్చాడు .ఈ ఇద్దరి కలయిక తమాషాగా జరిగింది .సాదువుకొడుకుకు పాము కరిస్తే అప్పాస్వామి మంత్రం తో నయం చేసి బ్రతికించాడు .అక్కడి నుంచి అప్పాస్వామి కీర్తి దశదిశలా బాగా వ్యాప్తి చెందింది .
తర్వాత తంజావూర్ జిల్లా తిరుఆరూర్ చేరి ,అక్కడినుంచి పంప కాలూర్ వెళ్లి స్థిరంగా ఉన్నాడు .చాలామంది సాధువులతో పరిచయమేర్పడింది .సంబంధర స్వామి తో కలిసి అప్పాస్వామి తిరు ఆరూరు కు దక్షిణాన వున్న క్షేత్రాలన్నీ దర్శించాడు .పురాతనమైన వేదారణ్యం వెళ్ళగా అక్కడి దేవాలయం తలుపులు చాలాకాలం నుంచి మూసే ఉంచారని తెలిసి౦ది .వేదాలు స్వయంగా వచ్చి ఇక్కడి శివుడిని దర్శించి పూజించేవి .అలాంటి ఆలయం మూయబడి ఉండటం బాధకలిగింది .వేదాలుకూడా వచ్చి పూజించటం మానేశాయట. సంబందార్ అప్పాస్వాములిద్దరూ ఆలయం బయటద్వారం వద్దే నిలబడి భక్తిగా శివస్తోత్రాలు పరవశంగా గానం చేశారు .అప్పాస్వామి మధుర మంజుల స్వరంతో మహేశ్వరుని కీర్తించాడు .అప్పాస్వామి పదవ గేయం ముగించగానే ఆలయం ద్వారాలు వాటంతటికి అవే తెరుచుకొని ఆశ్చర్యం కలిగించాయి .సంబంధస్వామికూడా ఆర్తిగా ఒక గేయం రచించి గానం చేశాడు .ఒకొక్క గేయానికి ఒక్కొక్క తలుపు తెరచుకొని మూసుకున్నాయట .స్వాములగానం జరుగుతున్నంతవరకూ ఇలా తలుపులు తెరుచుకొంటూ మళ్ళీ మూసుకోవటం మహా వింతగా ఉన్నది .ఇదంతా వేదం మహిమ ,భక్తిగరిమ తెలిపే విషయం .ఆలయ ప్రవేశం చేసి స్వామి దర్శనం తో పులకించి బయల్దేరారు ఈస్వాములిద్దరూ .
అప్పాస్వామి తంజావూర్ జిల్లా ‘’తిరుప్పన్ తిరుతి ‘’ లో ఉంటుండగా ఒకరోజు సంబంధస్వామి పల్లకీలో వచ్చాడు .అప్పాస్వామి ఎదురువెళ్ళి తానూ శిష్యులతోపాటు పల్లకీ మోశాడు . ,ఇది తెలియని సంబంధస్వామి ‘’అప్పాస్వామి ఎక్కడ ?’’అని ప్రశ్నించాడు ..’’స్వామీ ఇక్కడే మీ పల్లకి మోస్తున్నాను ‘’అన్నాడు .కంగారుగా పల్లకి దిగి సంబంధస్వామి ,ఆనంద బాష్పాలు కారుస్తూ అప్పాస్వామిని కౌగలించుకొన్నాడు .మహాత్ములు యెంత వినమ్రంగా ఉంటారో తెలియేసే సంఘటన ఇది.
అప్పాస్వామి శైవ విజ్ఞానం ఆకళింపు చేసుకోవాలని దేశపర్యటన చేశాడు .కైలాసపర్వతం ఎక్కాడు .కొంత దూరం వెళ్లేసరికి ఆశరీరవాణి’’మహాత్మా !నువ్వు శిఖరం ఎక్కనక్కరలేదు .కావేరి తీరం లోని ‘’తిరు యియూరు ‘’చేరి ,శివుని తపస్సులో ధన్యుడవై చరితార్డుడవు కావలసినది ‘’అని చెప్పింది .ఆమాటప్రకారం మళ్ళీ ఆప్రదేశానికే చేరి తపస్సు చేశాడు పరమా శివుడు పార్వతీ సహితంగా పరమ సంతోషంతో ప్రత్యక్షమవగా పరవశంతో ఇద్దరిపై అనేక కీర్తనలు అలవోకగా చెప్పాడు .అవన్నీ గొప్ప ప్రాచుర్యం పొందాయి .
అప్పస్వామి భక్తీ పరీక్షకు అనేక సందర్భాలు ఏర్పడ్డాయి .పంపకాలూరులో శివ సేవకు వెడుతుంటే దారిలో బంగారు రాసులు వజ్రాల రాసులు కనిపించాయి .వాటిపై పై దృష్టిపెట్టక శివధ్యానంతో ఆలయం చేరాడు .మరోసారి గ౦ధర్వ స్త్రీలు అతని దగ్గరకొచ్చి ప్రలోభ పెట్టారు .కన్నెత్తి చూడక పశుపతి స్మరణే చేశాడు .ఆలయ ప్రాంతం లోని కలుపు మొక్కలను పీకేసేవాడు ,మట్టిని చదును చేసి పూలమొక్కలు నాటి నీరు పోసి పెంచేవాడు .శివభక్తిలో అతడు తరించాడు .అంతాశివమయంగా భావించాడు .
అప్పాస్వామి రచించిన పద్యాలు గేయాలు మూడువందలున్నాయి .ఇవి మూడుగ్రంథాలుగా ప్రచురణ పొందాయి .తమిళ శైవ వాజ్మయం లో’’తిరుమురై’’అని ప్రసిద్ధిచెందిన 12గ్రంథాల సంపుటిలో అప్పాస్వామి రచించిన పైమూడు గ్రంథాలు ఉన్నాయి అంటే అతడు ఎంతగొప్ప శివభక్తుడో ఎంతై మహాకవియో అర్ధమౌతుంది .
ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-19-ఉయ్యూరు