శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం –దేవుని కడప
‘’ కాదనకు నామాట కడపరాయ – నీకు గాదెఁబోసే వలపులు కడపరాయ చ : కప్పుర మియ్యఁగరాదా కడపరాయా – నీకుఁ గప్పితి నాపయ్యెదెల్లఁ గడపరాయ కప్పుమివే కుచములు కడపరాయా – వో కప్పుమొయిలు మేనిచాయ కడపరాయ చ : కందువకు రారాదా కడపరాయా – ముందే గందమిచ్చినవాఁడవు కడపరాయ కందము నీమాటలిఁకఁ గడపరాయా – వో కందర్పగురుఁడ మొక్కేఁ గడపరాయ చ : కలసితివిటు నన్నుఁ గడపరాయా – నా కల నేఁడు నిజమాయఁ గడపరాయ కలదాననే నీకుఁ గడపరాయా – వో కలికి శ్రీవేంకటాద్రి కడపరాయ అని అన్నమయ్య కొలిచిన దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం.
ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప గడప అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. కృపాపురమే కడపగా మారిందంటారు. క్రీ.శ. 2వ శతాబ్దంలో టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు. ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని రాశాడు. కరిపె అనే మాటే చివరికి కడపగా మారి ఉండవచ్చు.
ఏడుకొండల వేంకశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలసిన శ్రీలక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు.ఈ గుడిలో ఒక మందిరంలో వేంకటేశ్వరుడు, ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘ శుద్ధ పాడ్యమి నుండి సప్తమి (రథసప్తమి) వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడిమాన్యాలు, బంగారు సొమ్ములు ఈ స్వామికి సమర్పించారు. తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ స్వామి మీద 12 కీర్తనలు చెప్పాడు. ఈ గుడిలో విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి చూడదగినవి. ఇక్కడ ఇటీవల నిర్మించిన అద్దాల మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ.
గర్భగుడి వెనుకవైపు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహముంది. ఈ ఆంజనేయస్వామి ఈ క్షేత్రపాలకుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం. దేవుని కడపలో ఇంకా సోమేశ్వరాలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణ మంటపముంది.
క్షేత్ర ప్రాశస్త్యం
దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకు వెళ్ళే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది.
తిరుమలవరాహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. అందుకు చిహ్నంగా ఇక్కడ స్వామి వెనుక భాగాన నిలువెత్తు విగ్రహరూపంలో ఆంజనేయ స్వామి నెలకొని ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంఖ చక్ర ధ్వజ గరుడ ఆళ్వారు, హన్మత్ పెరుమాళ్ళు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డనామాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలుంటాయి. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాపనివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు.
ఈ ఆలయానికున్న మరో విశిష్టత మతసామరస్యం. ఉగాదినాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు. రథసప్తమి రోజు జనసందోహం మధ్య స్వామి రథాన్ని కులమతాలకతీతంగా లాగడం మతసామరస్యానికి నిదర్శనం.
ఉత్సవాలు
దేవుని కడప ఆలయ చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తారు. హనుమ క్షేత్రం అయినందున హనుమత్ పుష్కరిణి అనికూడా అంటారు. కొలనులోని నిరయమంటపం, పడమరన తీర్థవాశి మంటపం ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి నీరొచ్చే మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఏడో రోజు మాఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. రథోత్సవంలో భాగంగా స్వామి గ్రామంలో ఊరేగుతాడు.
40, 50 సంవత్సరాలక్రితం వరకు కడప జిల్లాలోని కోడూరు ప్రాంతం నుంచి తిరుమల లోని గోగర్భం వరకు కాలిబాట వుండేది. తిరుపతి ప్రాధాన్యత తగ్గకూడదన్న విషయంపై పలు చర్చల అనంతరం కోడూరు నుంచి వున్న అడ్డదారి గురించి వెలుగలోకి రాకుండా చేశారు. త్రేతాయుగంలో శ్రీ రాముడు సీతాదేవిని వెతుకుతూ వింధ్య పర్వతాల నుండి బయలుదేరి ఆంధ్రతీర ప్రాంతాల నుంచి బయనిస్తూ దట్టమైన అరణ్యంలో రాక్షస సంచారం ఎక్కువగా వుండడం వలన దారిపొడవునా హనుమంతుని చిత్రాలు గీస్తూ వెళ్లాడని చరిత్రకారులుచెబుతున్నారు. ఆ విధంగా పెద్ద బండరాయిపై గీసిన చిత్రం నేటికీ దేవునికడపలో వుంది. నేటికీ చరిత్ర చెప్పిన సాక్ష్యాల ప్రకారం ముందుగా దేవునికడపకు హనుమత్ క్షేత్రం పేరు. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం అనంతరం కలిప్రవేశం జరిగిందని కృపాచార్యులు కలియుగ దైవం వెంకటేశ్వరుని దర్శించుకుందామని వింధ్య పర్వతాల నుంచే కాలి నడకన బయలుదేరారు. అలా నడుచుకుంటూ వచ్చిన కృపాచార్యులు హునుమత్ క్షేత్రం వచ్చిన తరువాత ఆయన ప్రయాణం ముందుకు సాగలేదు. అలాంటి దశలో కృపాచార్యులు ఏ హనుమత్ క్షేత్రం వద్దకు వచ్చిన తరువాత ఆయన ప్రయాణం ముందుకు సాగలేదు. అలాంటి దశలో కృపాచార్యులు నా బోటి వారికే దర్శనం కష్టంగా వుందని తలచి శ్రీవెంకటేశ్వరును ప్రార్థించారు. కృపాచార్యునికి హనుమత్ క్షేత్రంలో వెంకటేశ్వరుడు దర్శనమిచ్చి తమ దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా హనుమత్ క్షేత్రంలో తమను దర్శించుకొని తిరుమలకు వస్తారని కృపాచార్యులకు చెప్పారని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పుడు కృపాచార్యులు స్వామి అనుమతితో లక్ష్మీ వెంకటేశ్వర్లు ప్రతిమలు ప్రతిష్టించారని ప్రతీతి. తిరుమలకు తొలి గడపగా హనుమత్ క్షేత్రం చివరి గడపగా వరాహ క్షేత్రాన్ని కొలుస్తున్నారు. నేటికీ కూడా తిరుమల కొండల క్రింద హనుమంతును పెద్ద విగ్రహం దర్శనమిస్తుంది. దేవుని కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాట్ విగ్రహ వెనుకభాగంలో పెద్దరాతిపై హనుమంతుని విగ్రహం వుంది. దండకారుణ్యమైన ఈ ప్రాంతంలో రాక్షస సంచారం ఎక్కువగా వుండేదని అందువలన భక్తజన సంరక్షకుడిగా ప్రసన్న వెంకటేశ్వరునిగా ప్రసిద్ధుడైన స్వామిగా వెలసిన ప్రాంతమే దేవునికడప. దండకారణ్యంలో హనుమత్ క్షేత్రాలు ఎక్కువగా వున్నాయి. కృపాచార్యులచే ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుని ప్రతిష్ట జరిగిందని ఈ ప్రాంతాన్ని ఇక్కడి ప్రజలు కృపావతి మండలంగా పిలుస్తుండేవారు. పామరజనంనోట కృపావతిగా పిలువను రాక కురుపాయి , కడుపాయి, కడపగా మార్పు చెందింది. గత 70, 80 సంవత్సరాల క్రితం బ్రిటిషు పరిపాలనలో కలెక్టర్ల వద్ద పనిచేసే బిళ్ళ బంట్రోతుల వద్ద గల బిళ్ళలపై కడుపాయి తాలూకాగా వున్న నిదర్శనం వుంది. కడపకు వచ్చిన నెహ్రూ కూడా కడపను కడప అని సంబోధించక కుడుప్పాయి అని సంబోధించారు. ఈ ఆలయ పునరుద్ధరణకు కృషి చేసినవారు ఎందరో వున్నప్పటికీ 14వ శతాబ్ధం నుంచి కొంతమంది మహారాజుల పేరు చరిత్రకారులు పొందుపరచిన సమాచారంలో వున్నాయి. విజయనగర సామ్రాజ్య హరిహరరాయులు, బుక్కరాయులు, పాల్యం వంశీయుడైన నరసింహరాయులు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ రాయులు, స్వామి ఆరాధన కోసం అమూల్యమైన ఆభరణాలు, మడిమాన్యాలు, సమర్పించారు. నంద్యాల అహోబిలేశ్వర దేవమహారాజు స్వామి కైంకర్యాని కి భూదానం చేశారు. మగమండలేశ్వరుని తిమ్మయ్య దేవ మహారాజు ఉదయగిరి సీమలోని గ్రామానికి చెందిన రాబడిని ఈ ఆలయానికి ఇచ్చారు. ఆరణం సర్వప్ప స్వామికికిరీటం సమర్పించారు. చిన్న ఆవు బలరాజు స్వామికి పూలతోట కోసం భూమిని దానం చేశారు. ఈ వివరాలన్నీ ఆలయంలో వున్న శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. వెంకటేశ్వరుని వరప్రసాదాన జన్మించిన మహాభక్తుడు తాళ్లపాక అన్నమాచార్యుడు కడపలోనే కొంతకాలం వుండి కడపరాయుడైన వెంకటేశ్వరుని ప్రత్యక్షంగా సేవించినట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలోని స్వామి సన్నిధిలోని మండపం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. తాండవ గణపతి శిల్పం మనోహరమైంది. ఆలయ రాజగోపురం మట్లిరాజుల కాలంలో నిర్మింపబడి నదిగా చెప్పబడుతోంది. గోపుర ద్వారాన ఇరువైపులా రాయలవంశీకుల శిల్పాలు వున్నాయి. ఏడుకొండల వేంకశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలసిన శ్రీలక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు. ఈ గుడిలో ఒక మందిరంలో వేంకటేశ్వరుడు, ఆయనకు ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘ శుద్ధ పాడ్యమి నుండి సప్తమి (రథసప్తమి) వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం. దేవుని కడపలో ఇంకా సోమేశ్వరాలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణ మంటపముంది. ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంఖ చక్ర ధ్వజ గరుడ ఆళ్వారు, హన్మత్ పెరుమాళ్ళు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డనామాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలుంటాయి. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాపనివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు. ఈ ఆలయానికున్న మరో విశిష్టత మతసామరస్యం. ఉగాదినాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు. రథసప్తమి రోజు జనసందోహం మద్య స్వామి రథాన్ని కులమతాలకతీతంగా లాగడం మతసామరస్యానికి నిదర్శనం.
ఇక్కడి శ్రీ సోమేశ్వరాలయం లోవర్షాలలకోసం సహస్ర ఘటాభి షేకం చేస్తారు .మంత్రపూతంగా 108 బిందెల నీరు స్వామికి అభిషేకం చేస్తే ,ఆలయం లో అభిషేకజలం యెంత ఎత్తున ఉంటుందో ,ఆతర్వాత ఎంతమంది ఎన్ని వందల బిందేలనీరు భక్తులు తెచ్చిపోసినా ఒక్క మిల్లీమీటరు కూడా అభిషేక జల మట్టం పెరగదు.అదీ ఇక్కడి సోమేశ్వరస్వామి మహాత్మ్యం అని ప్రత్యక్షం గా చూసిన ఒంటిమిట్ట డా శివకుమార్ మాకు చెప్పారు . మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-19-ఉయ్యూరు
image.png