దీనిని 10శతాబ్దం లో చోళరాజులు నిర్మించారు .తమిళం లో సంస్కృతం లో కూడా ఉల్లం అంటే మనసు అని అర్ధం .ఇక్కడి చండీశ్వరుని కి చేసే ప్రదక్షిణాలకు గోప్పఫలితం ఉంటుంది
నందలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా, నందలూరు మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం.[1] ఇది సమీప పట్టణమైన రాజంపేట నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.
గ్రామచరిత్ర[
నందలూరు గురించి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో పలు విశేషాలు నమోదుచేశారు. 1830నాటికి ఈ గ్రామం పుణ్యక్షేత్రంగా పేరొందింది. వీరాస్వామయ్య ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ’’ ఊరి వద్ద చెయ్యారనే నది గడియదూరం వెడల్పు కలిగుందన్నారు. నదికి ఇరుపక్కల గుళ్ళున్నవని, పరశురాముని మాతృహత్య నివర్తించిన స్థలమని ఆయన పేర్కొన్నారు’’.[3].
ఈ గ్రామం ఒకప్పుడు బౌద్ధ క్షేత్రం. నందలూరుకు సమీపంలోని ఆడపూరు దగ్గర బౌద్ధారామముండేది. ఇప్పటికీ దీనిని బైరాగి గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట కింద సొరంగ మార్గముంది. నందలూరు దగ్గర చాలా గుహలున్నాయి. సిద్ధవటం కోటలోనుంచి నందలూరు గుహల్లోకి రహస్య మార్గముందంటారు. పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో బౌద్ధ స్తూపాలు, బౌద్ధ విహారం, కొన్ని కట్టడాలు, 1600 పైగా సీసపు నాణేలు, మరికొన్ని బౌద్ధ చిహ్నాలు దొరికాయి.
పేరు వెనుక చరిత్ర
ఈ గ్రామానికి పూర్వం తొండమండలం, నిరంతపురం, చొక్కనాథపురం అనే పేర్లు ఉండేవి. నిరంధర అనే మహారాజు నిరంతపురం అనే గ్రామాన్ని నిర్మించగా అది బాహుదా నది వెల్లువలో కొట్టుకుపోగా తరువాత నలంద అనే రాజు ఉంపుడుగత్తె ఈ ప్రదేశాన్ని సందర్శించి నెలందలూరు అనే పేరుతో తిరిగి గ్రామాన్ని నిర్మించినట్టు మెకంజీ కైఫీయత్లో పేర్కొనబడింది[4]. పూర్వం ఒక తెలుగు చోడ ప్రభువు గోహత్య పాప నివారణార్థం బాహుదానదీ తీరం వెంబడి 108 శివాలయాలను నిర్మించాడు. ఆ దేవాలయాలలో నంది విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల ఆ నది గట్టున ఉన్న గ్రామానికి నం(ది)దుల ఊరు అనే పేరు వచ్చిందనీ అదే వ్యవహారికంలో నందలూరుగా మారిందని మరొక ఐతిహ్యం[5].
చూడదగ్గ ప్రదేశాలు
సౌమ్యనాథ స్వామివారి ఆలయం
11వ శతాబ్దంలో చోళవంశరాజులచే నిర్మించబడిన ఆలయం. సంతాన సౌమ్యనాథునిగా, వీసాల సౌమ్యనాథునిగా ప్రసిద్ధికెక్కాడు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళ కళాశిల్ప నైపుణ్యానికి ప్రతీక. 11వ శతాబ్దపు పూర్వార్థంలో చోళరాజులు నిర్మించి స్వామివారికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాల్లో లిఖించబడి ఉంది. అప్పటి నుండి చోళపాండ్య కాకతీయ మట్లి మున్నగురాజులు 17వ శతాబ్దం వరకు దశలవారీగా ఆలయనిర్మాణం చేపట్టి పలు రాజుల పాలనలో శ్రీవారి ఆలయం ప్రసిద్ధికెక్కింది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించి నందలూరు, ఆడపూరు, మందరం, మన్నూరు, హస్త వరం అయిదు గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనాలు ఉన్నాయి. ఆ గ్రామాల రెవెన్యూ ఇప్పటికీ ఆలయానికే అందుతోంది. అన్నమయ్య జన్మస్థానమైన తాళ్ళపాక గ్రామం నందలూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
శ్రీ సౌమ్యనాథుని చొక్కనాథుడని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణానికి ఎర్ర రాయిని వినియోగించారు. ఆలయ కుడ్యాలపై వివిధ రాజుల సంకేతాలుగా మత్య్స, సింహ, అర్థచంద్రాకారపు చిహ్నాలున్నాయి. తమిళ శాసనాలు అధికంగా ఉండగా, తెలుగు శాసనాలు కొన్నిమాత్రమే. దేవస్థానంలో గోడలపైన కాకుండా నిలువు బండలపై 11వ శతాబ్దం నుండి విజయనగర పాలన వరకు ముఖ్యమైన అనేక వివరాలతో 54 శాసనాలు ఉన్నాయి.
ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, కోర్కెను మొక్కుకుని, 108 ప్రదక్షిణలుచేస్తే, నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి జిల్లా నలుమూలల నుండియేగాక, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ]
దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో నందలూరులోని సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాథుడని, చొక్కనాథ పెరుమాళ్ అని, కులోత్తుంగచోళ ఎంబరుమన్నార్ విన్నగర్ అనే పేర్లు గలవు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడుతో ఈ ఆలయానికి చారిత్రాత్మక అనుబంధం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. సౌమ్యనాథుడన్నా.. చొక్కనాథుడన్నా సౌందర్యవంతుడని అర్థం. సౌమ్యనాథుడనగా సౌమ్యకు(శ్రీలక్ష్మీదేవికి) నాథుడని అర్థం. స్వామి మూలవిరాట్ ఏడడుగుల ఎత్తు ఉండి చాలా సౌమ్యంగా అభయముద్రాలంకితమై ఉంటుంది.
ప్రత్యేకత
బ్రహ్మమానసపుత్రుడు.. తిలోకసంచారి.. లోకకల్యాణకారకుడు.. కలహప్రియుడు నారదుడు నందలూరు గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్ను ప్రతిష్టించారని శాసనాలు ధ్రువీకరిస్తున్నాయి.
ఎటువంటిదీపంలేకున్నా..
ఎటువంటి దీపం లేకున్నా సౌమ్యనాథస్వామి ఉదయం నుంచి సాయంకాలం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయం నిర్మించడం అద్భుతం. గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరం నుంచి కూడా స్వామి చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఏడాదిలో ఏదో ఒక రోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు నిర్మించారు.
దేవాలయంలోమరోఆలయం
ఆలయంలో లోపలికి ప్రవేశించగానే రాతి మంటపంపై నుంచి గర్భాలయంలో ప్రవేశించాల్సి ఉంది. ఈ మంటపం ముందు భాగం శిఖరంలో సింహం తల ఆకారంలో ఇరువైపులా ఉన్నాయి. ఏ దేవాలయానికి అయినా ఆలయ పైభాగంలో సింహం తలలు అమర్చిబడివుంటాయి. కానీ సౌమ్యనాథస్వామి ఆలయంలో లోపలి మంటపంలోని ఓ భాగమంతా సింహం తలలతో నిండి ఉండటం కనిపిస్తుంది. కాబట్టి ఆలయ పైభాగంలో ఉండే ఈ సింహం తలలు ఆలయ లోపల ఉండటం వల్ల.. భూగర్భలో మరో ఆలయం ఉన్నట్లుగా గోచరిస్తోంది. రాతి మంటపం అడుగున ఉన్నది శివాలయంగా చెప్పుకుంటున్నారు.
మత్స్య,సింహంచిహ్నాలు
ఆలయ కుడ్యాలపై (లోపల)పై భాగంలో మత్స్య, సింహం చిహ్నాలు ఉన్నాయి. మత్స్య ఆకారాన్ని మలిచి ఉన్నారు.. లోపల సీలింగ్ పై ఒక పెద్ద మ త్ష్యం చెక్కబడింది . భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు వచ్చినా ,ప్రళయం సంభవించినా ఆలయాన్ని ముంచెత్తినప్పుడు.లేక ప్రళయం సంభవించినప్పుడు
పైభాగంలోఈచేపకు ప్రాణం వచ్చి వరదలలో కలిసిపోతుందని స్థానికుల నమ్మకం. అంటే అప్పటికి కలియుగం అంతమైపోతుందనే అర్థం వస్తుందని చెబుతుంటారు. .
ఆలయ నిర్మాణం
ఆలయాన్ని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలతో వైఖానస, వైష్ణవగామ ఆర్షపోక్త వాస్తుయుక్తముగా సువిశాలంగా నిర్మించారు. ఈ దేవాలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు శాసనాలలో ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజంపేట మండలంలోని ఆడపూరు, మన్నూరు, మందరం, హస్తవరం అనే ఐదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. అధికంగా తమిళ శాసనాలు కనిపిస్తాయి. సింహద్వారంలో గాలిగోపురం ఉత్తరగోపురం, దక్షిణగోపురం ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో రాతిదీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడమందిర, మత్స్యమంటపం, ఆంజనేయమంటపం, చిన్నకోనేరు, జయవిజయాలు, అంకుర్పారణ మంటపం, వంటశాల, శ్రీ యోగనరసింహస్వామి, శిల్పకళ, అంతరాళం ఉన్నాయి. దేవాలయ ఆవరణలో పెద్ద కోనేరు ఉంది.
. శాసనాలు
ఆలయంలో 54 శాసనాలు ఉన్నాయి. తొలిశాసనం క్రీస్తు శకం 1078 లోనిది గాను, క్రీ.శ 1619లో శాసనం చివరి శాసనంగా గుర్తించారు. ఇందులో దాన శాసనాలే అధికంగా ఉన్నాయి. ఈ శాసనాలలో ఉన్న వాటికి సంబంధించి ఇప్పుడైతే ఏమీ లేవనే స్పష్టమవుతోంది. క్రీ.శ 11వ శతాబ్దం మధ్యలో నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవస్థానం మొదటి వైష్ణవ ఆలయంగా గుర్తించారు. ఆళ్వారుల విగ్రహాలు ఒకే రాతిపీఠంపై ఉండేవి.. ఇప్పుడు లేవు. వీటిలో కొన్ని ధ్వంసం అయ్యాయి. మరికొన్ని పురావస్తు శాఖ మ్యూజియంకు తరలించారని అంటున్నారు.
కోర్కెలుతీర్చేదేవుడు
కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా సౌమ్యనాథస్వామి ప్రసిద్ధి చెందారు. గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. కోర్కెలు తీరిన తర్వాత గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. సంతానం కలగని వారు స్వామిని ప్రార్థిస్తే కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. స్వామిని దర్శించి స్మరిస్తే పాపాలు తొలిగిపోతాయట. మనసారా పూజించే వారికి భూత, ప్రేత, పిశాచాల బాధలు తొలిగిపోవడమే కాక చెడు కలలు రావడం ఉండవని చెబుతున్నారు. విదేశీయానానికి సిద్ధమవుతున్న వారు ఇక్కడికి వచ్చి.. స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతోంది.
శ్రీ మహా విష్ణువు నృసింహావతారం దాల్చి హిరణ్యకశిపుని సంహరించి ,మహోగ్రరూపం గా కొంతకాలం తిరిగి ఉగ్రం తగ్గి సౌమ్యుడిగా మారి ఇక్కడ వెలిశాడని అతిహ్యం .
ఈ గ్రామం లోనే శ్రీ కామాక్షీ సమేత ఉల్లంఘేశ్వరస్వామివారి ఆలయంకూడా ఉన్నది .దీనిని 10శతాబ్దం లో చోళరాజులు నిర్మించారు .తమిళం లో సంస్కృతం లో కూడా ఉల్లం అంటే మనసు అని అర్ధం .ఇక్కడి చండీశ్వరుని కి చేసే ప్రదక్షిణాలకు గోప్పఫలితం ఉంటుంది
నందలూరు కు సమీపం లో ఒంటిమిట్టకు దగ్గరలో చేయ్యుర్ లో ఉన్న శివాలయం లో కార్తీకమాసం మూడవ సోమవారం శివలింగం లోకి నీరు చేరుతుందట .మిగతా ఎప్పుడూ అక్కడ నీటి జాలు ఉండదట .ఇదొక విశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-19-ఉయ్యూరు