డేనిష్ భాష ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందింది .ఈ భాష డెన్మార్కు దేశ భాష .13 వ శతాబ్దికి పూర్వం ఈ భాష ‘’రూనిక్ ‘’లిపిలో వ్రాయబడేది. క్రీ శ. 1300లో లాటిన్ లిపి ప్రవేశపెట్టబడింది .లాటిన్ లిపిలో మొదటగా మూడు న్యాయ శాస్త్ర గ్రంథాలు మూడు వేర్వేరు మాండలికాలలో రచి౦ప బడినాయి .అంటే అప్పటికి డేనిష్ భాషకు దేశీయ సాహిత్యభాష ఇంకా యేర్పడలేదన్నమాట .క్రీ,శ.1200లో దేశం లో క్రైస్తవం ప్రవేశించగా ఆ దేశానికి పడమటి యూరోపియన్ సాహిత్యం తో పరిచయమేర్పడింది .యూరప్ దేశ పౌరాణిక గాథలు లాటిన్ నుంచి 14వ శతాబ్దం లో డేనిష్ భాషలోకి అనువాదం పొందాయి .ఆ యుగం లో వెలువడిన సాహిత్యం లో జానపద సాహిత్యమే అగ్రస్థానం పొందింది .1591లో ఈసాహిత్య లోని 100జానపద గేయాలను ‘’యా౦డర్స్ సోరస్సన్ వేడెర్ ‘’మొదటిసారిగా సంకలనం చేశాడు .
16వ శతాబ్దానికి జానపదం తో పాటు మానవతావాదం కూడా సాహిత్యం లో స్థానం పొందింది .ఈమార్గ౦ లో నడిచినవాడు క్రిస్టియరల్ పీడర్సేన్ .ఇతడు 1554లో మరణించాడు.ఇతడేబైబిల్ ను మొదటగా డేనిష్ భాషలోకి అనువాదం చేశాడు .లౌకిక సారస్వతం లోమొదట కనబడేది . 1555కు చెందిన హెమ్మెన్ హీగర్ జర్మన్ కావ్యాన్ని డేనిష్ లోకి చేసిన అనువాదం మెచ్చదగినది ..రినై సెన్స్ కాలం లో డేనిష్ సాహిత్యం లోనూ యూరోపియన్ సాహిత్యం తో పాటు కొత్త చైతన్యం వచ్చింది . ఆనాటి కవులలో 1634-1703కు చెందిన థామస్ కి౦గోఅనే ప్రార్ధనా గీతాలరచయిత ప్రముఖుడుగా చెప్పవచ్చు .వచన రచనలు కూడా అప్పుడు చాలా వచ్చాయి .భాషా శాస్త్రం ,భాషాచరిత్ర లలో కృషి చేసిన ఓల్ వరన్,ఎరిక్ పొంటో స్పిడన్,పీడర్ సైవ్ లు ప్రసిద్ధులు .మహిళా రచయితలలో లియోనారా క్రిస్టి నావుల్ ఫెల్ట్,బ్రిజిటీ తోట్ ప్రఖ్యాతులు ఫెల్ట్ 20 ఏళ్ళ తన జైలు జీవితాన్ని గుండెలు కరిగేట్లు చిత్రించింది .లాటిన్ భాషలో ఉన్న తత్వవేత్త ‘’సెనెకా ‘’రచనలకు బ్రిజిటీ డేనిష్ భాషాను వాదం చేసింది .
18వ శతాబ్ది పూర్వార్ధం లో ఉన్నకవులలో లడ్విక్ హాల్ బెర్గ్(1684-1754) ను’’ డేనిష్ సాహిత్య పిత ‘’ అంటారు .అనేక ప్రహసనాలు ,34 సుఖాంత నాటకాలు ,చాలా నవలలు రాశాడు .డేనిష్ సాహిత్యం ఇతని వలన సుసంపన్నమైంది .ఆయుగం లో ఇతనితర్వాత ప్రముఖ రచయిత క్లోప్ స్టాక్ . జర్మన్ సాహిత్యఉత్తమ లక్షణాలన్నీ డేనిష్ సాహిత్యం లోకి ప్రవేశపెట్టి ఆ సాహిత్య విలువను అన్ని విధాలా పెంచి చిరస్మరణీయత కలిగించాడు .
1801నుంచి 1864 వరకు డేనిష్ సాహిత్యానికి స్వర్ణయుగం .క్రైస్తవ సాహిత్యం ,జాతీయతాభావం ,మానవ ప్రేమ త్రివేణీ సంగమ౦గా కాల్పనిక సాహిత్యంతో పెనవేసుకొని డేనిష్ సాహిత్యాన్ని అత్యున్నత స్థాయికి తెచ్చాయి .యాడెం ఓక్లెం ,ఫ్లేగర్ నికోలాయ్ , ఫ్రెడరిక్ నెవెరిన్,గ్రాండ్ విగ్ మహా కవులు ఆ యుగానికి వన్నె తెచ్చారు ,మార్గ్ గ్రండ్యరు .ఓక్లెం కవి వివిధ ప్రక్రియలతో డేనిష్ సాహిత్యాన్ని కొత్తమార్గాలలో నడిపించాడు .గ్రాండ్ విక్ కవి జాతీయ భావాలను తనకవిత్వం లో నింపి నిరంతర సాహితీ కృషి తో జనాలకు ప్రేరణ ,ప్రోత్సాహం స్పూర్తి కలిగించాడు .ఈ యుగం లో డేనిష్ సాహిత్యం నవ్యవాస్తవిక వాదానికి అత్యంత ప్రాముఖ్యత కలిగించింది .ఈ మార్గం లో నడచిన రచయితలలో పాల్ మార్టిన్ మొల్లర్,జూట్ స్టీవ్ ,స్టీవ్ వెన్ బ్లిచ్చర్ .గొప్ప నవలాకారులు ,ధాన్ సీన్ జిల్లెం బెర్గ్, ఎహరన్ స్వర్డ్ కథా రచయితలు .ఆనాటి నాటక రచయితలలో సుప్రసిద్ధుడు జోహన్ లడ్విక్ హై బెర్గ్ .ఈయన రాసిన ‘’ఎల్వర్ హోజ్ (దేవ శిఖరి ) ,సివ్ హోవర్డక్ రూపకాలు అత్యుత్తమ స్థాయి కి చెందినవిగా గుర్తింపు పొందాయి .వీరి కంటే అత్యుత్తమ ,విలక్షణ రచనలతో డేనిష్ సాహిత్యాన్ని వైభవ స్థితికి తెచ్చినవాడు హాన్స్ హా౦డర్సన్ (1805-1875).ఫిక్షన్ రచనలో ఈయన్ను మించినవారు డేనిష్ సాహిత్యరచయితలలో లేనేలేరు .
నవ్య సంప్రదాయ మార్గాన్ని అనుసరించినవారిలో 1842-1927 కు చెందిన జార్జి బ్రా౦డిల్ ప్రధముడు ,ప్రముఖుడు ..ప్రఖ్యాత విమర్శకుడుగా కూడా ఈయనకు పేరుంది .తర్వాత రచయితలకు ఈయనే మార్గ దర్శి .మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత డేనిష్ సాహిత్యం లో నవలా రచన బాగా ప్రాచుర్యం పొందింది .ఈ మార్గ గామి ‘’టాం క్రిస్టెన్ సన్’’ విశేష కీర్తి పొందాడు .గేయ కవులలో హాఫ్ మన్స్,హాసెన్ లు ప్రసిద్ధి చెందారు .రూపక రచయితలలో నాథన్ సెన్ ,కేరల్ గండ్రప్ లు గణనీయులు .
1917కార్ల్ అడాల్ఫ్ జేల్లరప్ ,హెన్రి క్ పొంటోప్పిడాన్ లకు సంయుక్తంగా సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .1944లో నోబెల్ ప్రైజ్ విన్నర్ కార్ల్ పీటర్ హెన్రిక్ డాం.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-12-19-ఉయ్యూరు
—