ఫిన్నిష్ సాహిత్యం -1
ఫిన్లాండ్ దేశ సాహిత్యమే ఫిన్నిష్ సాహిత్యం .యూరోపదేశం లోమధ్య యుగం లో 13వశతాబ్దం లో నవ్ గోర్డ్ నుంచి వచ్చిన ‘’ బిర్చ్ బార్క్ లెటర్ 292 ‘’మాత్రమే ఫిన్నిష్ సాహిత్యానికి చెందినది .రష్యాలోని ఒలోనేట్స్ ప్రాంతం లో మాట్లాడే ఫిన్నిక్ భాషా మాండలికమైన’’ క్రిల్లిక్’’ లో ఇది రాయబడింది .ఫిన్నిష్ మధ్యయుగకాలం లో ఫిన్లాండ్ లో రచనలు స్వీడిష్ కాని లాటిన్ భాషలోకాని రాసేవారు .16వ శతాబ్దం నుంచి నెమ్మదిగా ఫిన్నిష్ సాహిత్యం ప్రారంభమైంది .రాసే విధానం మాత్రం బిషప్ ,ఫిన్నిష్ లూధరన్ సంస్కర్త 1510-1567కుచెందిన మైకేల్ అగ్రికోలా తో ప్రారంభమైంది .1548లో ఈయన న్యు టెస్టమెంట్ ను ఫిన్నిష్ భాషలోకి అనువదించాడు .
19వ శతాబ్ది ప్రారంభం లో ఫిన్లాండ్ రష్యా లో భాగమైనప్పుడు విద్య,జాతీయతలపై ఆసక్తి పెరిగి ఫిన్నిష్ జానపద సాహిత్యం విస్తృతంగా వచ్చింది .క్రమగా స్వీడిష్ భాషావ్యామోహం తగ్గి తమదైన ఫిన్నిష్ భాషకు పట్టం కట్టాలన్న ఆలోచన అన్ని వైపులనుంచి ఉధృతంగా వచ్చింది .వేలాది జానపదగీతాలను సేకరించి ‘’సుయోమేన్ కంసాన్ వాన్ హట్ రనాట్’’అంటే ప్రాచీన ఫిన్నిష్ ప్రజల కవితలు పేరిట సేకరించి భద్రపరచారు .కలేవాలా అనే ప్రముఖ కవితా సంకలనం మొదటి సారిగా 1835లో వెలువడింది .1870లో ఫిన్నిష్ భాషలో మొదటినవల ‘’సెవెన్ బ్రదర్స్ ‘’అలెక్సిస్ కివి (1834-1872)రాశాడు .1919లో ఫ్రాన్స్ ఈమిల్ సిన్నాపా(1888-1964 ‘’మీకా హెరిటేజ్ ‘’నవలరాసి ఫిన్నిష్ భాషా సాహిత్యం లో మొదటి నోబెల్ బహుమతి పొందాడు .ఇతనితర్వాత ప్రసిద్ధుడు వైనోలిన్నా .
1909-1979కి చెందిన మిక్కా వాల్టారి ‘’మైకేల్ ది ఫిన్ ‘’,’’ది సుల్తాన్స్ రెనిగేడ్’’ రచనలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి .పావో హవిక్కో,ఈవా లిసా మనర్ ల తో ప్రారంభమై 1960లో ఫిన్నిష్ కవిత్వం టి. ఎస్. ఇలియట్ , ఎజ్రా పౌండ్ కవిత్వ ప్రేరణతో ఫిన్నిష్ భాషలో గొప్పకవిత్వం రాశారు.ఈ ధోరణలో ప్రసిద్ధమైనకవి ఈనోలీనో టిమోకె.ముక్కా(1944-1973).ఈతనిని ‘’వైల్డ్ సన్ ఆఫ్ ఫిన్నిష్ లిటరేచర్ ‘’అంటారు .21వ శతాబ్ది ప్రముఖ రచయితలలో మిక్కో రిమినేన్ ,లీనాక్రోన్ లు .క్రోన్ ఫిన్లాండ్ ప్రైజ్ ను 1992లో అందుకొన్నాడు .2000 లో ఇదే ప్రైజ్ జోహన్నా సిన్సాలో కు దక్కింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-12-19-ఉయ్యూరు