ఫిన్నిష్ సాహిత్యం -2(చివరిభాగం )
21వ శతాబ్దం లో 2014లో’’ ఫ్రాంక్ ఫర్ట్ బుక్ ఫెయిర్ ‘’లో ఫిన్లాండ్ అంతర్జాతీయ స్థాయి సాధించింది .పారిస్ రివ్యు పత్రిక ‘’కొత్త తరహా ఫిక్షన్ తో ఫిన్ లాండ్ తన ముద్ర వేసింది ‘’అని పొగిడింది .2018కి ఫిన్నిష్ సాహిత్యం మూడు రెట్లు ఎగుమతి అయింది .అప్పటిదాకా ఉన్న జర్మనీ రికార్డ్ ను ఫిన్ లాండ్ ,ఆంగ్లో అమెరికన్ మార్కెట్లు అధిగమించాయి .ఈ శతాబ్దపు ప్రముఖ రచయితలు –సోఫీ ఓక్సనేన్ ,పాజ్టింస్టాటోవికి ,లారా లిండ్ స్టెడ్ ,మిక్కో రిమ్మినెన్ లు .మిక్కీ 2011లో ఫిన్ లాండియా ప్రైజ్ తననిరనతర సాహితీ కృషికి అందుకొన్నాడు .ఫిన్నిష్ ఫాంటసి ,సైన్స్ ఫిక్షన్ వేగవంతమై అంతర్జాతీయ గుర్తింపు పొందాయి .వీరిలో 1992లో ఫిన్లాన్డిక్ ప్రైజ్ పొందిన లీనాక్రోన్ ,2000లో అదే ప్రైజ్ అందుకొన్న జోహన్నా సిన్సాలో ఉన్నారు .
ఫిన్లాండ్ లో ఫిన్నిష్ భాషను విద్యలో పరిపాలనలో ప్రవేశ పెట్టాక ,స్వీడిష్ భాష ఫిన్లాండ్ లో ప్రాచుర్యమైనది .జోహాన్ లుడ్విగ్ రునేబెర్గ్ (1804-1877)స్వీడిష్ భాష మాట్లాడే రచయితగా బాగా పేరు తెచ్చుకొన్నాడు .అవర్ లాండ్ అనే కవితా అతని మొదటి కవిత’’మై లాండ్ ‘’ ఫిన్నిష్ స్వాతంత్ర్యం పొందటానికి 70 ఏళ్ళు ముందుగానే ఫిన్లాండ్ జాతీయ గీతంగా గౌరవి౦పబడి విశేష కీర్తి పొందింది .20వ శతాబ్ది పూర్వార్ధం లో ఆధునిక స్వీడిష్ భాష ఫిన్లాండ్ లో పురుడు పోసుకొని ఉద్యమంగా బలపడి ,అద్భుతమైన ప్రగతి సాధించింది .ఈ ఉద్యమనాయకుడు ఎడిత్ సోడేర్ గ్రాన్ ..ఫిన్లాండ్ లోవిశేష ప్రాచుర్యం స్వీడిష్ భాషా రచనలు టోవ్ జాన్సన్ రాసిన ‘’మూమిన్ బుక్స్ ‘’గా గుర్తింపు పొందాయి .వీటినే కామిక్స్ లేక కార్టూన్ బుక్స్ అంటారు .జాన్సన్ ఒక్కామే ఉవ్వెత్తుగా లేచిన బాలసాహిత్య సృజనాత్మక తరంగాలకు జీవం పోసింది .1960-70కాలం నార్డిక్ బాలసాహిత్యానికి బంగారుకాలం .జాన్సన్ కు సైదోడుగా నిలిచాడు ఇమ్మెలిన్ సాండ్ మన్ లిలస్ .ఫిన్లాండ్ లోని స్వీడిష్ రచయితలలో తరువాత చెప్పుకో దగినవారు హెన్రిక్ టిక్క నెన్,జెల్ వెస్టో .వీరిద్దరూ సెమి ఆటోబయాగ్రఫిక్ వాస్తవిక నవలా రచయితలుగా ప్రాముఖ్యం పొందారు .ఫిన్నిష్ ఫాంటసి సాహిత్యానికి సమాంతరంగా స్వీడిష్ ఫాంటసి కూడా వృద్ధి చెందించాడు జోహన్నా హాల్మ్ స్ట్రాం.
టాప్ టెన్ ఫిన్నిష్ బుక్స్
ఫిన్లాండ్ దేశాన్ని ‘’ది లాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్ అని కూడా పిలుస్తారు .దౌజండ్ లేక్స్ సాహిత్యమన్నా ఫిన్నిష్ సాహిత్యమన్నా ఒక్కటే .
1-టోవ్ జాన్సన్(మహిళ ) రచన –టేల్స్ ఫ్రం మూమిన్ వాలీ 2-ఎలియాస్ లోన్ రాట్ రచన –కలవేలా 3-మికా వాల్టారి రాసిన –ది ఈజిప్షియన్ 4-సోఫీ ఒక్సనెన్ (మహిళ ) రచన –పర్జ్ 5-ఆర్టో పాసలిన్నా రచన –ది యియర్ ఆఫ్ ది హేర్ 6-వైనో లిన్నా రాసిన –అండర్ ది నార్త్ స్టార్ 7-రిక్కా పుల్కిన్నేన్ (మహిళ )రచన –ట్రూ 8-అలెక్సిస్ కివి రచన –ది సెవెన్ బ్రదర్స్ 9-హన్ను మైకేలా రాసిన –మిస్టర్ బూ 10-లీనా లెహ్టోలైనెన్(మహిళ )రచన –మై ఫస్ట్ మర్డర్ .
తప్పక గుర్తుంచుకోవాల్సిన అయిదుగురు ఫిన్నిష్ రచయితలు -లీనా క్రోన్ –కలె క్టేడ్ వర్క్స్,ఎమ్మి ఎలిన్నా ఐట రాంటా-మెమరిఆఫ్ వాటర్ ,పాసి ఇల్మారి జాకేలేనెన్ –ట్విన్ పీక్స్ ,ఆంటి టుమోన్నెన్-ది హీలర్ ,జిర్కీ వైనో నేన్-దిఎక్స్ ప్లోరర్ అండ్ ఆదర్ స్టోరీస్
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-19-ఉయ్యూరు
.
—