దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4
1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –4 (1759-1847)
శిష్య పరంపర -2
11-కన్నయ్య భాగవతార్ –త్యాగరాజ కృతులను తంజావూర్ మహారాజు,వాగ్గేయకారుడు స్వాతి తిరుణాల్ ఆస్థానంలో పాడి వినిపించాడు
12-ముత్యాల్పేట త్యాగయ్య
వీణ కుప్పయ్య కొడుకు .108కీర్తనలు వర్ణాలు, రాగమాలికలు రాశాడు .ఈతని ఇల్లు గాయకులకు యాత్రాస్థలంగా ఉండేది .నారుమంచి సీతారామయ్య ,పిరాట్ల శంకరయ్య ,సుబ్రాయ శాస్త్రి,దుడ్డు సీతారామయ్య ఇతని ముఖ్య శిష్యులు .1917లో చనిపోయాడు .
13- ఝంఝా మారుతం సుబ్బయ్య ,
తంజావూర్ కన్నయ్య శిష్యుడైన వడ్డి సుబ్బయ్యకు స్వాధ్యాయి .త్రిస్థాయి గాత్రం లో ఘనుడు .మైసూర్ మహారాజు ‘’ఝంఝా మారుతం’’బిరుదు ఇచ్చాడు .
14-మైసూరు సదాశివరావు
వాలాజాబాద్ వెంకటరామయ్య శిష్యుడు .సర్వతో ముఖ ప్రజ్ఞతో కృతులు, తిల్లానాలు స్వరజతులు ,తానవ ర్ణాలు ,పదవర్ణాలు రాసిన ఘనుడు .మధురగాత్రం తో మైసూర్ మహారాజా మూడవ కృష్ణరాయల ఆస్థానగాయకుడయ్యాడు.మహా నారసి౦హోపాసకుడు .ఒకరోజు సాయంత్రం మిత్రులు ‘’కమలామనోహరి రాగం’’ లో ‘’నరసింహు డుదయించె’’కృతి పాడమని పట్టు బట్టారు .చాలా పవిత్రంగా పాడే కృతి ఆది.బలవంతం మీద పాడాడు. ‘సరసి జానందము పగుల ‘’అనే వాక్యాన్ని ముగించగానే నరసింహస్వామిఫోటోకి ఉన్న గ్లాసుపగిలి పోయింది .అందరికీ భయం ఆశ్చర్యం కలిగింది. దీపాలు ఆరిపోయాయి .వెంటనే పాట ఆపేసి హారతిచ్చాడు.తీర్ధయాత్రలు చేస్తూ అక్కడి దేవుళ్ళపై కీర్తనలు భారవి, మోహన, కాంభోజి, ,తోడి, హరి కాంభోజి, బలహంస ,అఠాణా రాగాలలో కూర్చాడు.గజానన, ఆంజనేయ త్యాగారాజుల పైనా కీర్తనలు రాశాడు .తనప్రభువుపై పదవర్ణనలు,తిల్లానాలు అల్లాడు. ఇతని స్వర ,తాళజ్ఞానం అపూర్వం .రాగ భావ అర్ధపుస్టి,గణ యతి ప్రాసలతో ఈతని కీర్తనలు బహుజనాభిమానం పొందాయి
15-వాలజి పేట కృష్ణయ్య
అనేక కృతులు స్వరజతులు రాశాడు .
16-అన్నాస్వామి
1827లో పుట్టి సుబ్బరాయ శాస్త్రికి దత్తుడయ్యాడు .కావ్యాలంకార నాటక వ్యాకరణ సంగీత శాస్త్రం ఫిడేలు వాద్యంలో ప్రవీణుడు .’’పాలించుకామాక్షి ‘’,’’పాహి శ్రీ గిరిరాజ ‘’ కృతులకు స్వరాలు కూర్చాడు ఇతని శిష్యులు తచ్చూరి సి౦గరాచారి సోదరులు గ్రంథ కర్తలు .
17-తిరువాయూరి పంచాపకేశన్
త్యాగయ్య గారి సోదరుని మనవడు.మానంబు చావడి శిష్యుడు .అపార సంగీతజ్ఞానమున్నవాడు .22ఏట చనిపోయాడు .కొడుకు రాముడు భాగవతార్ మహా గాయకుడు .
18-సాదు గణపతి శాస్త్రి (1893-1945)
జలతరంగ వాద్యం లో మాహా విద్వాంసుడు. తండ్రి నాగరత్నం మానంబు చావడి మేనల్లుడు .రామనాడు ,పిఠాపురం ,త్రిపు నా౦డాల్,స్వాధీనం జమీందార్లు ఇతన్ని ఆహ్వానించి కచేరీలు జరిపించి సత్కరించారు .సోదరుడు సుబ్రహ్మణ్యం మంచి గాత్ర జ్ఞుడు ..లార్డ్ సైమన్ ,లివింగ్టన్ల నుంచి ప్రశంసా పత్రాలు పొందాడు’
19-ఆలగుంట సీతారామయ్య (1806-86)
తిన్నవెల్లి జిల్లా ఎలవర్స నొండల్ గ్రామస్తుడు .ఎట్టియా పురం ఆస్థానగాయకుడైన కృతికర్త.ఇతని గానవైదు ష్యానికి శివాజీ భోంసలే మెచ్చి అనేక బిరుదాలు, అశ్వాలు ,గజాలు ఇచ్చి సన్మాని౦చాడు .వాటిని మధుర మీనాక్షి అమ్మవారికి సమర్పించాడు.ఎల్వరస నొండల్ రాజా ఆదిపట్టి గ్రామం ఈనాం గా ఇచ్చాడు .భజనపద్ధతిపై ‘’రామ మహోత్సవ ప్రాక్తిక’’రచించాడు .
20-పుదుక్కొట సుబ్రహ్మణ్య భాగవతార్ (1823-96 )
పుదుక్కోటరాజు తొండమాన్ రఘునాథ రామ చందర్ ఆస్థానగాయకుడు .తండ్రి వెంకటరామయ్య .తిరువయ్యార్ లో త్యాగరాజస్వామిని సేవించిన అదృష్టవంతుడు.శివానంద నౌక ,ప్రహ్లాద చరిత్ర ,గద్య పద్య కీర్తనావళి రాశాడు .కొడుకు నాగరత్నం ఆస్థాన విద్వా౦ సుడే.తిరువాన్కూర్ రాజు చే గౌరవి౦పబడ్డాడు .’’ఇతని మరణంతో కర్ణాటక గానం అంతరించింది ‘’అన్నాడు రాజా రామ చందర్ .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-19-ఉయ్యూరు
స్వాతి తిరునాళ్
‘’
—