ఉత్తరద్వార దర్శనం అంటే ఏమిటి ?
పరమాత్ముడు ఉన్న లోకానికి వెళ్ళటం దక్షిణ ద్వారదర్శనం భగవంతుని భగవంతుని చూడటం తూర్పు ద్వారా దర్శనామ్ ద్వార దర్శనం కీర్తించడం పశ్చిమ ద్వార దర్శనం భగవంతుణ్ణి సేవించటం ఉత్తరద్వార దర్శనం అని బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణం లో చెప్పబడింది
అన్ని కైంకర్యాలు పరమాత్మ చేయాలి అనేవారు అరుదుగా ఉంటారు అలాంటి వారిలో గోదాదేవి ఒకరు ఆమె ఆమె ఒక ఒక పాశురంలో”ఉనక్కెనాం లట్ చెయ్యో0 ”అంటే మేము నీ అంతరంగ సేవచేయాలని వచ్చాము .మత్తానం కా మంగళ్ మాతుం ”అంటే ఇంతకంటే వేరే కోరిక ఏదీ మాకు లేదు
వైకుంఠంలో అన్ని వేళల స్వామికి కైంకర్యం చేయాలన్న కోరికే ఉత్తరద్వార దర్శనం
— స్వామికి పాదాలు కొట్టటం చాలిస్తే దుప్పటికప్పటం అంటివి సేవలు కావు .అసలైన సేవకు ఉదాహరణ ఆదిశేషుడు అని యామణాచార్యులవారు ఒక శ్లోకం లో చెప్పారు –
”నివాస శయ్యా ,ఆసన పాదుక,అంశుక ,ఉపాదాన ,శీతాతపవార్షిణా విధి -శరీర భేదైఃః తవ శేషతాం గతః ”అంటే ఆది శేషుడు నువ్వు ఉంటాను అంటే ఇల్లు అయ్యాడు ,పాడుకొంటాను అంటే పానుపు అయ్యాడు ,కూర్చుంటాను అంటే సి౦హా సనమయ్యాడు నడుస్తాను అంటే పాదుకయ్యాడు తలవాలుస్తానంటే దిండు .,కట్టుకొంటాను అంటే వస్త్రం,చలికి దుప్పటి ,ఎండకు గొడుగు అయ్యాడు అందుకే ఆది అంటే మొదటి సేవకుదయ్యాడు నీకు ఓ మహా విష్ణూ .
పరమాత్మకు అన్నీ తానె అయినవాడే నిజమైన సేవకుడు అలా సేవించటమే ఉత్తర ద్వారా దర్శనం పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం 11 అదే ఏకాదశి ఈ పదకొండు పరమాత్మకు పరిపూర్ణంగా సమర్పించటమే వైకుంఠ ఏకాదశి ఉద్దేశ్యం ప్రేమతో నిన్దినద్వారమే ఉత్తరద్వారం దాని నుంచి దర్శించటమే పరమాత్మకు ఆంతరంగిక కైంకర్యం అందుకే ముక్కోటికి అంతటిఊ ప్రసిద్ధి’శరీరం లోని ఆణువణువూ మనసు అంతఃకరణం అన్నీ పరమాత్మకు అర్పించటమే ఉత్తర ద్వార దర్శనం
-దుర్గాప్రసాద్
ఆధారం -డా కందాడైరామానుజాచార్య ప్రవచనం