స్వీడిష్ భాషా సాహిత్యం -3(చివరిభాగం )
బాలడ్(గేయకథా)సాహిత్యం
18వశతాబ్దిలో బాల్లడ్ సాహిత్యాన్ని బెలిమన్ కవి మొదలుపెట్టాడు .యూనివర్సిటి చదువుల విజ్రు౦భణలో వెనకబడి మళ్ళీ 1890పుజు కున్నది .గేయానికి సంగీతం తోడై ఎక్కువ మంది శ్రోతలను ఆకర్షి౦చేట్లు కవులు రాసి ప్రచారం తెచ్చారు .1900లో 90కి పైగా కవులు ఈప్రక్రియ బాగా పండించారు .గుస్తాఫ్ ఫ్రోడింగ్ ,ఎరిక్ ఆక్సెల్ కారల్ఫీల్డ్ కవులు ఇందులో ముఖ్యులు .ఎవర్ట్ త్రాబే (1890-1976)పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ గా రుజువు చేసుకొన్నాడు .మూడు దశాబ్దాలు స్వీడెన్ దేశమంతా తిరిగి ప్రదర్శనలిచ్చి జయభేరి మోగించాడు .నావికులపైనా ,అర్జెంటీనా ,స్వీడిష్ పల్లెప్రాంతాలపైనా ఈబాలడ్స్ రాసి వన్నె తెచ్చాడు .1962నుంచి చనిపోయేదాకా బాలడ్ రచన, గానం లో ప్రఖ్యాతుడైనవాడు కార్నేలిస్ వీస్ వ్రిజ్ .ఇందులోకొన్ని లెఫ్ట్ ప్రొటెస్ట్ సాంగ్స్ అంటే సొసైటీ ఆఫ్ అండర్ డాగ్స్ పైనా రాసినవి .ఈయనవలన స్వీడిష్ సాహిత్యం అత్యంత ప్రభావితమైంది .మరణానంతరం ఆయన కవిత్వ మాధురి మరింత ఆకర్షణీయమైంది జనానికి .
కవిత్వం
1930-40కాలం లో స్వీడిష్ కవిత్వం ఆధునికత మోజు లో ఉంది .ప్రయోగం శైలీ ,వచనకవిత్వం బాగా వచ్చింది .హజాల్మార్ గుల్బెర్గ్ (1898-1961)అనేక మిస్టికల్ క్రిస్టియన్ ప్రభావ కవిత్వం రాశాడు .వీటిలో ‘’ స్పిరి ట్యుయల్ ఎక్సర్ సైజెస్ ‘’వంటివి ఉన్నాయి .కొంత విరామం తర్వాత 1950లో కొత్త శైలిలోయువతకు ప్రేరణగా రాశాడు .గున్నార్ ఎక్లాట్ (1907-1968)స్వీడిష్ మొదటి సర్రియలిస్టిక్ కవిగా’’సెంట్ పా జోర్డన్ ‘’కవితా సంపుటితో గుర్తి౦పు పొందాడు .అతని సమకాలికులు దీన్నిఅర్ధం చేసుకోలేకపోయారు .బాణీమార్చి రొమాంటిక్ కవిత్వం తో ‘’డెడికేషన్ ‘’సంపుటి 1934లో తెచ్చాడు .ఇది అందరికీ నచ్చింది .ముసలితనం మీదపడే దాకా రాసి కవిత్వం లో డామినెంట్ పర్సనాలిటీ గా స్థిరపడ్డాడు .అతని శైలి భారంగా సింబాలిక్ గా ,సమస్యాత్మకంగా హింసాత్మక వ్యంగ్యంగా ఉంటుంది .
మరోముఖ్య మోడర్నిస్ట్ కవి హర్రి మార్టిన్సన్ (1904-1978)ప్రకృతి ఆరాధనతో సాటిలేనికవిత్వం రాశాడు .ఫ్రీ వెర్స్ నూ బాగా రాసి మెప్పించాడు .నవలలుకూడా రాసి పాక్షిక జీవిత చరిత్రగా ‘’ఫ్లవరింగ్ నేట్టీస్ ‘’1935లో రాశాడు..బాగా పేరు తెచ్చిందిస్పేస్ షిప్ అంతరిక్షం నుంచి దారితప్పిన అంజారా ‘’ ‘’అనే నవల – 20వ శతాబ్ది ప్రముఖకవి టోమాస్ స్ట్రాన్ స్ట్రోమార్.ఇతనికవిత్వం లో క్రిస్టియన్ మిస్టిసిజం కలకు నిజానికిఉన్న అంచుమీద ఉంటుంది .అంటే భౌతిక ఆదిభౌతికంగా ఉంటుంది .60లలో చరిత్ర మార్గదర్శకులపై కవిత్వం వెల్లి విరిసింది .ఇదంతా ప్రయోగాత్మకంగా సాగింది .దీన్ని వ్యతిరేకి౦చివారూ ఉన్నారు .70లలో బీట్ హవా నడిచింది .చిన్నపత్రికలు కవిత్వాన్ని ప్రచురించాయి.డాన్ ఆండర్సన్ కవి రచయిత .తనకవితలకు తానే సంగీతం కూర్చుకొన్నాడు .ఈయనను స్వీడిష్ ప్రోలిటేరేనియన్ రచయితగా గుర్తించారు .
నాటక సాహిత్యం
రెండవ ప్రపంచయుద్ధం తర్వాత నాటకరచయితలు బాగా రాశారు .పావెల్ రామేల్,కార్ల్ డీ ముమ్మా మంచి హాస్యనాటకాలు రాశారు .పత్రికలూ రేడియో,టివి లు నాటకాలను బాగా ప్రోత్సహించాయి .1960తర్వాత మార్పువచ్చి ,నాటకరంగం అందరి అభిరుచులకు నిలయం అయింది .లార్స్ నార్రెన్ ,పేర ఎలోవ్ ఎన్క్విస్ట్ లు ఈకాలం లో ప్రఖ్యాతులయ్యారు .
పాప్ మ్యూజిక్
1960లో స్వీడిష్ సాహిత్యాన్ని అమెరికా ఇంగ్లాండ్ లు ప్రభావితం చేశాయి .మొదట్లో అనుకరణగా ఉన్నా తర్వాత స్వంత బాణీ నేర్చింది .యువత విజ్రు౦భి౦చి రాశారు .ప్రోగ్రెసివ్ సాహిత్యం వచ్చినా ఆదరం పొందలేకపోయింది .జాతీయతావాదం మంచి ఊపు తెచ్చింది .మైకేల్ వీహీ ప్రముఖుడు .తిరుగుబాటు కవులలో ఉల్ఫ్ లండేల్ పాత ధోరణికి స్వస్తి చెప్పి మొత్తం తరానికి ప్రాతినిధ్యం వహించే ‘’జాక్’’అనే బీట్నిక్ నవల రాశాడు .విమర్శకులు అభిమాని౦చక పోయినా ఇప్పటికీ అదే బాగా పాప్యులర్ నవలగా ఉన్నది .
ఫిన్లాండ్
ఫిన్లాండ్ లో స్వీడిష్ భాష అదికారభాష .సుమారు 6శాతం జనానికి మాతృభాష కూడా .కనుక స్వీడిష్ సాహిత్యం ఫిన్లాండ్ లో బాగా ప్రభావంత౦గా కనిపిస్తుంది “a versatile and future-oriented cultural institution of Finland-Swedish literature, culture and research.” అన్నారు అందుకనే .గ్లోబల్ ఈక్వాలిటి కి ,ఫిన్నిష్ జాతీయ భావానికి స్వీడిష్ సాహిత్యం బాగా దోహదపడుతోంది .
నోబెల్ పురస్కారాలు
స్వీడిష్ సాహిత్యం లో వివిధ ప్రక్రియలలో నోబెల్ పురస్కారాలుందుకున్నావారిలో 1-సేల్మా లాంగాలోఫ్ (1909),2వెర్నెర్ వాన్ హీల్దేన్ స్టాన్(1916),3-ఎరిక్ ఆక్సెల్ కార్ల్ ఫీల్డ్(1931),4-పార్ లాజేర్విస్ట్ (1951) 5-ఈవిండ్ జాన్సన్ ,6-హారీ మార్టిన్సన్ (1974)7-టోమస్ స్ట్రాన్ స్ట్రోమార్ (2011)ఉన్నారు.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-1-20-ఉయ్యూరు