ప్రపంచ దేశాల సారస్వతం
7- నార్వీజియన్ సాహిత్యం -2(చివరిభాగం )
నాలుగువందల ఏళ్ళ చీకటి
స్కాండినేవియన్ యూనియన్ కాలం లో నార్వీజియన్ సాహిత్యం ఏమీ రాలేదు .తర్వాత డానో-నార్వీజియన్ అంటే 1387-1814కాలాన్ని ఇబ్సెన్ ‘’నాలుగువందల ఏళ్ళ చీకటి ‘’అన్నాడు .అప్పుడు కోపెన్ హాన్ యూనివర్సిటి ఒక్కటే యువతకు దిక్కు .ఇక్కడే అందరికి శిక్షణ ఇచ్చేవారు .గేబెల్ పేడర్సన్ మానవత్వ విలువలున్న లూధరన్ బిషప్ .అతని పెంపుడు కొడుకు అబ్సలాన్ పడర్సన్ బెఎర్ ఆయన మార్గదర్శకత్వం లో నడిచాడు .ఇద్దరూ జాతీయ దృష్టితోకవిత్వం రచనలు చేశారు ,అందులో ‘’కన్సర్నింగ్ ది కింగ్డం ఆఫ్ నార్వే ‘’పుస్తకం 1567లో వెలువడి కొత్త ఆలోచనలను తెచ్చింది .ప్రేడల్ క్రాసాన్ ఫ్రిస్’’హేల్మిన్స్కిన్గ్లా ‘’ను అనువాదం చేసి పునరుద్ధరించాడు .ఇదే మొట్టమొదటి వాస్తవ చరిత్ర .దీనివలననే నార్వే ను అధ్యయనం చేయటానికి వీలైంది .
17వ శతాబ్దిలో ‘’మెర్జర్ లిటరేచర్ ‘’లో ను పెట్టర్ డాస్’’నార్వీజియన్ ట్రంపెట్ ‘’ రాశాడు .ఇందులో ఉత్తర నార్వే దేశ భౌగోళిక స్థితి ,ప్రజలు , ఆచారవ్యవహారాలు పండగలు పబ్బాలు జీవన విధానం అన్నీ రాశాడు .1634-1713కు చెందిన డోరోతి ఎంగెల్బ్రేస్త్స్ డాటర్ అనే మహిళా మొదటి రచయిత్రిగా గుర్తింపు పొందింది .ఆమె రాసిన ‘’సైలెంట్ సాంగ్ ఆఫర్ ‘’1678లో పబ్లిష్ అయింది .ఆమెరచనల రెండవ సంపుటిగా ‘’సారే ఆఫర్’’1685లో ప్రచురించింది .ఆండర్సన్ ఆరేబ్బో క్రిస్టియన్ సాల్మ్స్ ను నార్వీజియన్ భాషలోకి అనువదించింది .
1811లో నార్వీజియన్ యూనివర్సిటి క్రిస్టియానా అంటే ఇప్పటి ఒసియో లో ఏర్పడి.అమెరికా ఫ్రెంచ్ విప్లవాల ప్రభావం పడి,డెన్మార్క్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశం ఏర్పరచాలన్న ఉద్యమం తీవ్రమై విడిపోయి 1814లో మొదటి రాజ్యాంగాన్ని రాసుకొన్నది .స్కాండినేవియన్ రచయితలూ బాగా రాస్తూ ప్రపంచ వ్యాప్తిపొందారు .హెన్రిక్ వేర్గేర్ లాండ్ నవ నార్వీజియన్ సాహిత్యపిత అయ్యాడు .ఈకాలం లో నార్వీజియన్ జానపద కధలను సేకరించి పీటర్ అస్బ్జోర్న్సన్,బిషప్ జార్గెన్ మోల్ లు ప్రచురించారు.ఇవి జర్మనీలో ‘’బ్రదర్స్ గ్రిం’’ల సేకరణలా ఉంటుంది .వీటివలన పర్వతప్రాంత జానపద సాహిత్యం జీవితం తెలుస్తాయి .రాజధానికి చాలాదూరం లో ,ఏకాంత౦ గా ఉన్న ప్రజల జనజీవితంస్థానిక మా౦డలీకాలలో ప్రతిబింబిస్తుంది .ఈ సంకలకర్త మేధావి ఐన ఇవార్ ఏసన్(1813-1898).స్వయంగా భాషా శాస్త్రం అధ్యయనం చేసినవాడు .నార్వీజియన్ జానపద భాష కు నిఘంటువు ,వ్యాకరణం రాసి మహోపకారం చేశాడు.ఈ భాషనే ‘’నినార్సిక్ ‘’అంటే నవీన నార్వీజియన్ అంటారు .నార్వీజియన్ భాషలో ఇది రెండవ అధికార వ్రాత భాష గా గుర్తి౦పు పొందింది .
ఆధునికకాలం లో రాల్ఫ్ జాకబ్ సెన్ రాసిన కవిత్వం ‘’నట్టా పెంట్’’20వేలకాపీలు అమ్ముడయ్యాయి .హరాల్డ్ స్వెర్ ద్రుప్ రాసిన ‘’లైసేట్స్ఏర్బ్లిక్ ‘’కూడా బాగా అమ్ముడయింది .జాన్ ఎరిక్ ఓల్డ్ రాజకీయ కవిత్వం రాశాడు .ఇతని తర్వాత రాసినవారంతా విభిన్న మార్గాలలో వైవిధ్యంగా రాశారు .నవలలకన్నా కవిత్వం అభిరుచి క్రమంగా తగ్గింది .నార్వే ప్రజలు నాటకాలను పెద్దగా ఆదరించరు.జాన్ ఫ్రాస్ ఫ్రాస్సే ఒక్కరే దేశీయంగా అంతర్జాతీయంగా నాటకరచయితగా పేరు పొందాడు Bjørnstjerne Bjørnsonకు సాహిత్యం లో నవలా రచనకు నోబెల్ పురస్కారం వచ్చింది .మరో ఇద్దరు నవలా రచయితలూ ‘’నాట్ ఆమ్సన్,’’మార్కేంస్ గ్రోడ్’’లకు 20వ శతాబ్ది నోబెల్ అందుకొన్నారు .
సశేషం
కనుమపండుగా శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-1-20-ఉయ్యూరు