ప్రపంచ దేశాల సారస్వతం
8- స్కాండి నేవియన్ సాహిత్యం
.స్కాండినేవియన్ సాహిత్యాన్ని నార్డిక్ సాహిత్యం అంటారు .అంటే నార్డిక్ దేశాలైన ఉత్తరయూరప్ లోని డెన్మార్క్ ,ఫిన్లాండ్ ,ఐస్ లాండ్ ,నార్వే, స్వీడన్ ,స్కాండినేవియాకు చెందిన అసోసియేటెడ్ అటానమస్ టెర్రిటరీలు అయిన ఆలాండ్ ,ఫారో ఐలాండ్స్, గ్రీన్ లాండ్ దేశాలు .ఇందులో మెజారిటి దేశాలు ఉత్తర జర్మని భాష ను వాడుతాయి .ఫిన్లాండ్ ప్రజలలో ఎక్కువమంది యురాలిక్ భాషలు మాట్లాడుతున్నా ,ఫిన్లాండ్ చారిత్రకంగా స్వీడెన్ ,నార్వే లతో బాగా కలిసిపోయింది .దీనిపై ‘’సమీ పాప్యులేషన్ ‘’ప్రభావం ఎక్కువ .ఈ దేశాలు ప్రబలమైన సాహిత్యాన్ని వెలువరించాయి .నార్వీజియన్ నాటకకర్త హెన్రిక్ ఇబ్సెన్ ఆధునిక వాస్తవిక నాటకం యూరప్ లో వ్యాపించటానికి ముఖ్యకారకుడు .అతని ‘’ది వైల్డ్ డక్’’,ఎ డాల్స్ హౌస్ ‘’నాటకాలు యూరప్ తోపాటు ప్రపంచ దేశాలనూ ప్రభావితం చేశాయి వీరిలో Nobel prizes for literature have been awarded to Selma Lagerlöf, Verner von Heidenstam, Karl Adolph Gjellerup, Henrik Pontoppidan, Knut Hamsun, Sigrid Undset, Erik Axel Karlfeldt, Frans Eemil Sillanpää, Johannes Vilhelm Jensen, Pär Lagerkvist, Halldór Laxness, Nelly Sachs, Eyvind Johnson Harry Martinson, and Tomas Tranströmer..
మధ్యయుగ స్కాండినేవియన్ సాహిత్యం
మధ్యయుగ స్కాండినేవియన్ సాహిత్యం మొదట ప్రోటో నార్స్,తర్వాత ఓల్డ్ నార్స్ సామాన్యభాషగా ఉండేవి .స్కా౦డినేవియాలో మొదటి వ్రాతప్రతులు రూనిక్ ఇన్స్క్రిప్షన్స్.ఇవి రాయిలేక ఇతరవస్తువులపై ఉంటాయి .వీటిలోకొన్ని నార్సే మైధాలజి,కొన్ని చిన్నచిన్న కవితలు ,యమక శబ్దాలతో కూడినవి ఉన్నాయి .వీటిలో 8వ శతాబ్ది రోక్ రున్నేస్టోన్ లో వలసలకాలానికి చెందిన గాథలుంటాయి .9వ శతాబ్దం లో ‘’ఎద్డిక్ కవితలు ‘’వచ్చాయి ఇవి 13వ శాతబ్దం లో మాత్రమే వ్రాతప్రతులుగా లభ్యమయ్యాయి .స్కాండినేవియా రాజుల, వీరుల గాథలు వర్ణించబడ్డాయి .9వ శతాబ్ది కి ముందే నుంచే మౌఖికంగా స్కాల్దిక్ కవిత్వం ఉన్నా,ఆశతాబ్దిలోనే వ్రాతప్రతులలో చేరాయి .ముఖ్యంగా ‘’కార్లేవి రూన్ స్టోన్’’లో ఇవి లభ్యమయ్యాయి . 10వ శతాబ్దం లో క్రైస్తవమతం వ్యాపించి ,యూరప్ తో స్కా౦ డినేవియాకు సంబందాలేర్పడి లాటిన్ వర్ణక్రమ౦ ,లాటిన్ భాష దేశం లో ప్రవేశించాయి .దీనిఫలితంగా డేనిష్ భాషలో ‘’గెస్టా డానోరం’’అనే చారిత్రాత్మక రచన సాక్సో గ్రమారిటస్ రాశాడు .13వశతాబ్దం ఐస్లాండ్ సాహిత్యానికి స్వర్ణయుగం .స్నోర్రి స్టూర్లుసన్’’ ప్రోజ్ ఎడ్డా’’,హీమ్స్క్రిమింగ్లా రాసి మంచి రచయితగా పేరుపొందాడు .
డేనిష్ సాహిత్యం
16వ శతాబ్దంలో డెన్మార్క్ దేశం లోలూధరన్ రిఫార్మేషన్ వచ్చి ,సాహిత్యంలో కొత్త యుగావిర్భావం జరిగింది .ఈయుగ రచయితలలో హ్యూమనిస్ట్ క్రిస్టీ౦ పెడర్సన్ న్యు టెస్టమెంట్ ను డేనిష్ భాషలోకి అనువదించాడు .పౌల్ హీర్గర్సన్ రిఫార్మేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించాడు .19వశతాబ్ది మొదట్లో నాటకరచనప్రారంభమైంది .హీరోనిమాస్ జస్త్సేన్రాంచ్ మంచిరూపకాలు రాశాడు .17వ శతాబ్దం స్కాండినేవియన్ ప్రాచీన తకు అద్దంపట్టి వో వార్మ్ అగ్రస్థానం పొందాడు .ధామస్ కిన్గో పవిత్ర కవిత్వం రాశాడు .అ౦తర్యుద్ధాలు ఆక్రమణలతో రాజు సంపూర్ణాధికారం పొందాడు .బ్లూ టవర్ కు చెందిన లియోనార క్రిస్టియానా రిడెం ప్టివ్ ప్రోజ్ రాసి ఆకర్షించాడు .తర్వాతడేనిష్ రచయితలు ఆన్స్ క్రిస్టియన్ యాన్దర్సన్ ,సోరెన్ కర్క్ గార్డ్,జోహాన్నెస్ వి జేన్సెన్,కరెన్ బిక్సన్ లు వచనరచనలు ఎక్కువగా చేసి ప్రఖ్యాతిపొందారు
ఫారోస్ సాహిత్యం
ఫారోస్ లిటరేచర్ అంటే సుమారు 100-200 ఏళ్ళక్రితం వచ్చిన సాహిత్యం .దీనికి కారణం ఐస్ లాండ్ ఏకాంతం గా ఉండటం ,ఫారోస్ భాష 1890వరకు రాసే భాషగా మారకపోవటమే ..మధ్యయుగకాలం లో కవితలు కథలు మౌఖికంగా మాత్రమేప్రచారమై తరతరాలుగా వ్యాపించాయి .వీటిని రెండుభాగాలుగా 1-సాగ్నిర్ అంటే చారిత్రాతమైనవి 2-ఏవిన్ టైర్ అంటే కధలుగా,క్వేయో అంటే గేయాలుగా విభజించారు .వీటన్నిటికి లిఖితరూపం 19శతాబ్దం లో మాత్రమె వచ్చింది .కాని ఇదంతా అత్యంత ప్రభావ శీల సాహిత్యంగా పరిగణింప బడింది .
ఫిన్నిష్ సాహిత్యం
ఫిన్లాండ్ చరిత్ర గందరగోళం .చరిత్ర ప్రకారం చాలాకాలం ప్రభుత్వ భాష , మెజారిటీ ప్రజలభాష వేరు వేరుగా ఉన్నాయి .ఇది ఫిన్నిష్ సాహిత్యంపై తీవ్ర ప్రభావం కలిగించింది . గాఢమైన ఫిన్నిష్ అస్తిత్వంపైననే ఎన్నో రచనలు వచ్చాయి . జానపద గేయాల సంకలంగా ‘’కలవేల ‘’వచ్చి ఫిన్నిష్ జాతీయవాదానికి బలమైనది .సంకలనకర్త ఎలియాస్ లోన్రాట్ ఫిన్నిష్ ఎపిక్ రాసిన వాడుగా అభినందనీయుడయ్యాడు .ఇతను సంపాదకుడు సంకలనకర్తకూడా .1835లో ముద్రింపబడి ఫిన్నిష్ జాతీయతకు కారణమైంది .1870’’సెవెన్ బ్రదర్స్ ‘’అనే మొదటి ఫిన్నిష్ నవల అలెక్సిస్ కివి రాశాడు .ఇదే ఇప్పటికీ ఫిన్నిష్ సాహిత్యం లో అత్య౦త గొప్పరచనగా గుర్తింపు పొందింది .
ఐస్లాండిక్ సాహిత్యం
ఐస్ లాండిక్ సాగాస్ లేక కుటుంబ సాగాలు పదవ ,పదకొండవశతాబ్దాలలోనివాస్తవ చరిత్ర సంఘటనలు .ఇవే ఐస్ లాండ్ లో మొదటి సాహిత్యంగా గణనకెక్కింది .మధ్య యుగాలలో’’రిమూర్ ‘’అనే బాగాప్రజాదరణపొందిన కవిత్వం రాయబడింది.రిఫార్మేషన్ తర్వాత వచ్చిన రచయితలలో హాలిగ్రిమూర్ పెటుర్సన్,జోనాస్ హాలి గ్రిమ్సన్,గున్నార్ గున్నర్సన్ ,హాల్డోర్ లాక్స్ నెస్ లు ముఖ్యులు .
నార్వీజియన్ సాహిత్యం
14నుంచి 19శతాబ్ది వరకు ఉన్న 400 ఏళ్ళను నార్వే లో ‘’చీకటి యుగం ‘’అన్నారు పెడర్ క్లాసాన్ ఫ్రిస్,లుడ్విగ్ హోల్ బెర్గ్ లు ఏదోకొంత డెన్మార్క్-నార్వే భాషలో రాసినప్పటికీ . 19శతాబ్ది మొదట్లో జాతీయవాదం ,స్వాతంత్రేచ్చ ప్రబలమైన తర్వాత నూతన నార్వీజియన్ జాతీయ సాహిత్యం ఆవిర్భవించింది .ఈ తరహా రచయితలలో హెన్రిక్ ఇబ్సెన్ మకుటాయమానంగా భాసించాడు తన నాటకాలద్వారా .పడమటి యూరప్ సాహిత్యంపై ఇబ్సెన్ ప్రభావం చాలా ఎక్కువ.ముగ్గురు రచయితలు నాట్ హామ్సన్ , ,బిజార్న్ స్టీన్ బ్జోమ్సన్,సిగ్రిడ్ అండ్ సెట్లు సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ లు పొందారు –
స్వీడిష్ సాహిత్యం
స్వీడిష్ సాహిత్యం లో ముగ్గురు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు .ప్రసిద్ధ రచయితలు- ఆస్త్రిడ్ లిండ్ గ్రెన్,గుస్టాఫ్ ఫ్రాడింగ్,కార్ల్ జోనాస్ లవ్ ఆల్మో విస్ట్ విహేలం నో బెర్గ్ ,ఆగస్ట్ స్త్రిండ్ బెర్గ్ టోమాస్ స్ట్రాన్ స్ట్రోమార్,.
నోబెల్ ప్రైజులేకాక ‘’ది నార్డిక్ కౌన్సిల్ లిటరేచర్ ప్రైజులు డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే, ఐస్ లాండ్ స్వీడెన్ రచయితలు ఒక్కో దేశంలో ఇద్దరేసి పొందారు ,నేషనల్ ప్రైజ్ లను ఫిన్లాండ్ లో ముగ్గురు ,నార్వేలో అయిదుగురు ,స్వీడెన్ లో ఆరుగురు పొంది దేశాల సాహిత్య దీప్తికి కారకులయ్యారు .
టాప్10 నార్డిక్ పుస్తకాలు
Tómas Jónsson, Bestseller by Guðbergur Bergsson (translated by Lytton Smith)
- Novel 11, Book 18 by Dag Solstad(translated by Sverre Lyngstad)
- The Endless Summer by Madame Nielsen (translated by Gaye Kynoch)
- Not Before Sundown by Johanna Sinisalo (translated by Herbert Lomas)
- New Collected Poems by Tomas Tranströmer(translated by Robin Fulton)
- Crimson by Niviaq Korneliussen(translated by Anna Halager)
- Mirror, Shoulder, Signal by Dorthe Nors(translated by Misha Hoekstra)
- The Tower at the Edge of the World by William Heinesen(translated by W Glyn Jones
- The Gravity of Love by Sara Stridsberg(translated by Deborah Bragan-Turner
- Inside Voices, Outside Light by Sigurður Pálsson(translated by Martin Regal)
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-1-20-ఉయ్యూరు
—