ప్రపంచ దేశాల సారస్వతం
8- కొరియన్ సాహిత్యం -2 (చివరిభాగం )
గోరియో పాటలు –హంజా పాత్రల నేపధ్యం లోని సాహిత్యంక్రమగా మారిపోయి గోరియా పాటలు వ్యాప్తిలోకి వచ్చాయి .ముందుగా మౌఖికంగా వ్యాప్తి అయి ,జోసేన్ పీరియడ్ లో వ్రాతరూపం పొందాయి .కొన్ని హన్గూయ్ లోకి మారాయి .వీటికవిత్వభాష ను పయల్గొక్ లేక చాంగ్గా అంటారు .కోర్యో రాజవంశ చివరికాలం లో వచ్చిన సాహిత్యం .మాధుర్యం ఎక్కువ .ప్రేమ ఆనందం బాధలనుచక్కగా శక్తివంతంగా వ్యక్తీకరిస్తాయి .ఆడవారు అలవోకగా పాడే వీలుండటం వలన పండుగలలో బాగా పాడేవారు .ఈవిధానాన్ని ‘’కిసేంగ్ ‘’అంటారు .ఇందులో దాలియోంకే,యియోయాంచే అని రెండురకాలు .మొదటిదానిలో అంతాఒకే స్టాంజా ఉంటె ,రెండో దానిలో చాల స్టాన్జాలలో ఉంటాయి జీవితాన్ని ప్రతిబింబించే పాటలుగా వీటికి ప్రత్యేకత ఉంది .
సిజో ,మరియు గాసా –జోసేయాన్ కాలం మొదట్లో వచ్చినవి .హన్గూల్ నుంచి అక్జాంగ్ లోకి మారాయి .కొరియన్ స్క్రిప్ట్ ప్రకారం రాసినవే .ముఖ్యంగా బౌద్ధ గీతాలు .సిజో అంటే అప్పటికప్పుడు వచ్చేవి .గోర్యోకాలంనుంచే ఉన్నా తర్వాతే అభి వృద్ధి జరిగింది కంఫ్యూజియస్ భావాలవ్యాప్తికి బాగా ఉపయోగపడ్డాయి .గోసా అంటే భావోద్విగ్నంలో వచ్చిన కవిత్వం .ఇవి వ్యాసంగా కూడా ఉంటాయి .ప్రకృతి ,మానవ మంచితనం ,ప్రేమ లపై అల్లబడినకవిత్వం .
వచన రచన –కొరియన్ వచనరచన నాలుగు రకాలు –వర్ణన ,కాల్పనికత ,కలగాపులగం .వర్ణ న లలో పురాణాలు ,లెజెండ్స్ ,జానపదకధాలు వ్రాతపూర్వకంగా లభిస్తాయి .మూడు రాజ్యాంగ వ్యవస్థలచారిత్రకకధనం అంతా వీటిలో ఉంది .సూర్యుడు ,చంద్రులగురించి మిథ్స్ఎక్కువ .వీరిద్దరూ కొరియా ,తాన్గూన్ నిర్మాతలని భావిస్తారు .పూర్వపురాజుల వీరోచితకార్యాల విశేషాలు ఉంటాయి .జానపదాల్లో జంతువులూ ,గోబిన్స్ మొదలైన సూపర్ నేచుర ల్ పాత్రలేఎక్కువ .దుస్ట శిక్షణ శిస్ట రక్షణఇందులో నీతి.వీటిని జెన్ మాస్టర్ రాశాడు .బౌద్ధమునుల అనుయాయులగాధలు వారు చేసిన అద్భుతాలు,బోధిసత్వకధలు అన్నీ ఉంటాయి .
ఫిక్షన్ –ఇది చాలారకాలు –ముందుగా కొరియన్ ఫిక్షన్ చైనీస్ భాషలో,తర్వాత కొరియన్ భాష లో వచ్చింది .రెండు-ఒకే ఒక గ్రంధం ఉన్న చిన్న వి 10భాగాలున్నమధ్యతరగతివి ,యాంగ్ భాన్ లు రాసినవి .అసలు కధకు చిలవలు పలవలు చేర్చి రాసినవి .అన్నీ సుఖా౦తాలే .కలగాపులగం లో వచ్చినవాటిలో చరిత్ర ,జీవితచరిత్ర స్వీయ చరిత్ర ,సాహిత్య విమర్శనం .కొరియాలో వచ్చిన మొదటి ఫిక్షన్ –గుయుమో సింహా –గుయోం పర్వతం గురించిన కధలు .. కిం సియుప్ చైనీస్ భాషలో రాశాడు.17వ శతాబ్దం చివర్లో పాన్సోరి ఫిక్షన్ జనసామాన్యం పై మౌఖికంగా వచ్చి వ్యాప్తి చెంది 1870లో పాసోరి రైటర్ లిఖితం చేశాడు .మిడ్ –జోసియన్ కాలం లో పారబుల్ లాంటి కధలలొచ్చాయి .తర్వాతమార్పు పొంది గిసేంగ్ గా మారాయి .
1980వరకు కొరియన్ సాహిత్యం బయటి ప్రపంచానికి తెలియదు .తర్వాతకొద్దిగా అనువాదాలు వచ్చి కొంతవ్యాప్తి జరిగింది.జపాన్ చైనాలలో కొరియన్ సాహిత్యానికి గిరాకీ ఉంది .కొరియన్ సాహిత్యానికి ఇంతవరకు నోబెల్ బహుమతి వచ్చినట్లు లేదు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-20-ఉయ్యూరు