9-స్కాటిష్ సాహిత్యం
స్కాట్ లాండ్ దేశం లో స్కాటిష్ ప్రజల చేత రచి౦ప బడినదేదే స్కాటిష్ సాహిత్యం .ఇది ఇంగ్లిష్ ,స్కాతిక్ గేతిక్,స్కాట్స్ ,బ్రితోనిక్,ఫ్రెంచ్ ,లాటిన్ ,నార్మ్ మొదలైన స్కాట్ లాండ్ సరిహద్దులలో ఉన్న భాషలలో రాయబడిన సాహిత్యం .ఇవాళ స్కాట్ లాండ్ గా పిలువబడుతున్న దేశం లో మొట్టమొదట బ్రితోనిక్ భాషలో 6 వ శతాబ్దం లో వేల్శిష్ సాహిత్యం గా పుట్టింది .తర్వాతి శతాబ్దాలలో కేధలిక్ చర్చి ప్రభావంతో లాటిన్ భాషలో తర్వాత ఆంగ్లియన్ సెటిలర్స్ తెచ్చిన ఓల్డ్ ఇంగ్లిష్ లో సాహిత్యం వర్ధిల్లింది .స్కాట్ లాండ్ లో ఆల్బా రాష్ట్రం అభి వృద్ధి అయ్యాక 8వ శతాబ్ది నుంచి గేతిక్,లాటిన్ భాషలలో సాహిత్యంపుస్తకాలుగా విపరీతంగా ఐర్లాండ్ మొదలైన చోట్లలాగా ఏర్పడింది .13వ శతాబ్దిలో డేవిడియన్ విప్లవం తర్వాత ,ఫ్రెంచ్ భాష సంస్కృతీ ప్రభావం హెచ్చింది .అదే కాలం లో స్కాండి నేవియన్ సెటిల్ మెంట్ లో నార్సే సాహిత్యం వ్యాప్తి చెందింది .స్కాట్లాండ్ దేశం లో మొదటి గ్రంథంగా గుర్తింపబడింది 14వ శతాబ్దిలో జాన్ బార్బర్ రాసిన ‘’బ్రస్’’అనే ఎపిక్ .దీనితర్వాత వ్యావహారిక భాషలలో వరుసగా చాలా వచ్చాయి .వీటి తర్వాత 15వ శతాబ్దిలో వచన రచనలు ఎక్కువ వచ్చాయి .
ఆధునికకాల ప్రారంభం లో రాజ కుటుంబాల పోషణలో కవిత్వం ,డ్రామా బాగా వ్యాప్తి చెందాయి .ఐదవ జేమ్స్ రాజు ఆస్థానం లో మౌ౦ ట్స్ కు చెందిన సర్ డేవిడ్ లిండ్సే’’ది త్రీ ఎస్టసిస్ ‘’వచ్చింది .16వ శతాబ్ది చివరలో ఆరవ జేమ్స్ రాజు స్కాటిష్ కవుల సంగీతకారుల పాలిటి కల్ప వృక్షం అయ్యాడు .ఈ బృందాన్ని ‘’కాస్టాలియన్ బాండ్ ‘’అంటారు .1603లో సింహాసనం ఎక్కాక చాలామంది ఆస్థాన గౌరవం పొందారు కాని కవిత్వం సన్నబడింది .17వ శతాబ్దిలో 1707లో ఇంగ్లాండ్ తో యూనియన్ అయ్యాక అల్లాన్ రామ్సే ,జేమ్స్ మాక్ ఫెర్సన్ లు ప్రముఖులయ్యారు .మాక్ ఫెర్సన్ ‘’ఒస్సియన్ సైకిల్ ‘’మొదటి స్కాటిష్ కవిగా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు .ఇతని ప్రభావం రాబర్ట్ బర్న్స్ పై తీవ్రంగా పడి,జాతీయ కవి అయ్యాడు .వేవర్లి, నవలలు రాసిన సర్ వాల్టర్ స్కాట్ 19వ శతాబ్దిలో స్కాటిష్ అస్తిత్వానికి పట్టాభి షేకం చేశాడు తన రచనలద్వారా .ఇతని టాలిస్మన్ రాబ్ రాయ్ ,దిపైరేట్,ఇవాన్ హో,దిబ్లాక్ డ్వార్ఫ్ మొదలైన నవలలు సుప్రసిద్ధమైనవి .విక్టోరియా శకం చివర్లో రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ ,ఆర్ధర్ కోనాన్ డోయేల్ ,జే.ఏం బారిస్ ,జార్జి మాక్ డోనాల్డ్ వంటి చాలామంది స్కాట్ లాండ్ రచయితలు ప్రపంచప్రసిద్ది పొందారు .
20వ శతాబ్దిలో రినైసేన్స్ ఇక్కడా వచ్చి స్కాటిష్ రినైసేన్స్ గా ప్రచారమైంది .హాగ్ మాక్ డయార్మిడ్ స్కాటిష్ భాషను స్కాటిష్ సాహిత్యానికి తీవ్రమైనదిగా భావించి రాశాడు .యుద్ధానంతర కవులలో ఎడ్విన్ మోర్గాన్ ,మొదటి స్కాట్ మకార్ ను 2004లో స్కాటిష్ ప్రభుత్వాన్ని ఏర్పరచి నెలకొల్పాడు .1980తర్వాత సాహిత్యం లో రెండవ రివైవల్ వచ్చి ,జేమ్స్ కేల్మాన్ ,ఇర్వీన్ వెల్ష్ ,కరోల్ ఆన్ డుఫీవంటి స్కాటిష్ కవులు ప్రధాన పాత్ర పోషించారు .
ఇంగ్లాండ్ లోని స్కాటిష్ నాటకకర్తలు కేధరీన్ ట్రాటర్ ‘’ఫాటల్ ఫ్రెండ్ షిప్’’ ,ది కామెడి లవ్ ఎట్ లాస్ ‘’హిస్టరీ ఆఫ్ రివల్యూషన్ ఇన్ స్వీడెన్ నాటకాలు ,డేవిడ్ క్రాఫోర్డ్ రాసిన ‘’ రెస్టోరేషన్ కామెడీస్ ‘’లవ్ ఆఫ్ ఫస్ట్ సైట్ మొదలైనవి బాగాఆదరం పొందాయి .జోనాన్న బెయిలీ మహిళా నాటకకర్త .క్లోసేట్ డ్రామాలు కూడా అభి వృద్ధి చెందాయి .నాటకశాలలు 1760లో వచ్చి నాటకాలకు మంచి ఊపు వచ్చింది .అమెత్యూర్ కంపెనీలు వచ్చినా నిలబడ లేకపోయాయి .గ్లాస్గోలో పుట్టిన కరోల్ ఆన్ డుఫీ 2009లో మొదటి మహిళా ఆస్థాన కవయిత్రిగా’’ గే పోయెట్ ‘’గా రికార్డ్ సృష్టించింది ‘
స్కాటిష్ సాహిత్యం లో మొదటి నోబెల్ బహుమానం -1901లో సల్లీ ప్రూధోమ్ కు కవిత్వం లో వచ్చింది .తర్వాత ఎవరికీ వచ్చినట్లు లేదు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-1-20-ఉయ్యూరు