ప్రపంచ దేశాల సారస్వతం
11- జపనీస్ సాహిత్యం -3
ఈడో యుగం (1603-1868)-16వ శతాబ్ది చివరికి అంతర్యుద్ధాలు పూర్త యి ,శక్తి వంతమైన ప్రభుత్వమేర్పడి రాజాధాని రాజకీయ ,సాంస్కృతిక కేంద్రమైన ‘’ఈడో’’అంటే క్యోటో కు మారింది .ఈకాలపు సాహిత్యమే ఈడో యుగ సాహిత్యం .16వ శతాబ్ది ప్రారంభం లో జపాన్ పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఏర్పరచు కొనటం వల్ల క్రైస్తవం వ్యాపించింది కాని తర్వాత అణగార్చబడటం వల్ల సాహిత్యంపై పాశ్చాత్య ప్రభావం పెద్దగా పడలేదు .ఈ కాలం లో విద్యాప్రచారం బాగా జరిగి ,చైనా జపాన్ గ్రంథ ప్రతులు తయారీకి సన్యాసులు నియమి౦ప బడ్డారు .విద్యాలయాలు చాలా నెలకొల్పారు .గ్రంథ ముద్రణ ఏర్పాట్లు కూడా జరిగాయి .జపాన్ భాషలో మార్పుకూడా వచ్చింది .చైనాపదాలు ఎక్కువగా చేరి భాష సంపన్నమైంది .వ్యాకరణం సరళమై గ్రాంధిక రచనకు ప్రోత్సాహం లభించింది .
చైనా భాషా ,పాండిత్య ప్రభావం జపాన్ భాషా సాహిత్యాలపై బాగా పడింది .చైనా ప్రాచీన రచనలపై ఆదరం తో ‘’చూహ్సి శాఖకు చెందినకొత్త కన్ఫ్యూషియస్ ‘సిద్ధాంతాన్ని ’’’ఫుజి వారా నీకా (1561-1619) ప్రచారం చేశాడు .చరిత్ర భావనా గరిమ ,హాస్యరస రసాలతో వాజ్మయం వృద్ధి చెందింది .ట్రాజడీలు ,విషయలాలసా పుస్తకాలు విజ్రు౦భి౦చాయి .ఈ కాల చైనా పండితులలో అగ్రేసరుడు ‘’అరై హుకు సేక్ ‘’(1657-1725)1701లో భూస్వాముల చరిత్ర వివరించే ‘’హాన్ కంపు ‘’ అనే బృహద్గ్రంధం రాశాడు.కైబరా ఎక్కెన్(1630-1714)వందకు పైగా రచనలు చేశాడు .ఇతర విద్వాంసులలో హయషి గాజన్ (1583-1657)కినో షిటాజువాన్ ,కుమజావా బంజన్,యమగాసోకో ,ఇటో జిన్సై,ఒగ్యూ సొరై ముఖ్యులు .చైనా సాహిత్యానికి పోటీగా జపనీస్ సాహిత్యమూ బాగానే వచ్చింది .’’టోకుగావామిట్సు’’,ప్రారంభించిన ‘’డైని హాన్ షె’’అనే చైనా భాషలో రాయబడిన జపాన్ దేశ చరిత్ర చాలా ప్రాముఖ్యత వహించింది .భాష సరళ సుందరం .రచన ప్రామాణికం.,కవి ,చారిత్రకుడు ,భాషా తత్వ వేత్త ‘’మోటూరి నొగి నాగా’’ (1730-1801) 49 సంపుటాలలో ‘’కోజి కోడేన్ ‘’అనే కోజికి వ్యాఖ్యానం రాశాడు ..రాయ్ సన్యో(1780-1832)’’నిహాన్ గైషీ ‘’అనే అనే జపాన్ దేశ చరిత్ర రచించాడు .కమోనో మబుచి ,హిరటా అట్సు టానె అనే వారు ఈ శాఖ ఇతర పండితులు .ఇదే జాతీయతను జపాను లో రేకెత్తించి,’’మెయిజియుగం ‘’లోని పునరుద్ధరణకు దారి తీసింది .
జపాన్ లో బాగా ప్రసిద్ధి చెందినా నాటకం ‘’కిబుకి’’16వ శతాబ్దిలో రాయబడింది .దీని చారిత్రకపరిణామంలో మూడు దశలున్నాయి 1-ఒంనా కబుకి –మహిళానాటకం 2-వకషూ కబుకి –యువక రూపకం 3-యరో కబుకి –పురుష నాటకం .ఐతే ఈనాటకానికి సాహిత్యంలో పెద్దగా గౌరవం లేదు .ఈ యుగ గొప్పచారిత్రిక గృహ సంబంధ నాటకాల కర్త’’చికమట్సుమొ౦జే యెమన్(1653-1724).ఇవి.ఐదేసి అ౦కాలున్నఆనంద ప్రధాన నాటకాలు .ఇతని నాటకాలలో ముఖ్యమైనవి –కోకు సెన్యకస్సెన్,సోనొజికిషింజు,మెయి డోనాహిక్యకు ,హకటకొజోరోనమి మాకుర.ఇతర నాటకకర్తలలో ప్రసిద్ధులు-టకెడ ఇజుమొ(1691-1756),నమికి షోజో(1630-93) కవటకమొకు అమి(1816-93).,
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-1-20-ఉయ్యూరు