11- జపనీస్ సాహిత్యం -5
1885 నుండి జపానీయులు పాశ్చాత్య వ్యామోహాన్ని తగ్గించుకొని స్వీయ సంస్కృతిని అవలంబించటం ప్రారంభించారు .ఎర్నెస్ట్ ఫెనోల్లాసా అనే పాశ్చాత్యుడు దేశీయ లలితకళల పునః పరిశీలనకు దారి చూపాడు .దేశీయ రచనలకు రచయితలూ ఆసక్తి చూపారు .ఒకరకంగా రాబోయే నవోదయానికి ఈ యుగం ఉషస్సు వంటిది .
మొయిజిసారస్వత చరిత్రలో ట్సుబెచి షోయో రాసిన ‘’షోసెట్స్ షింజు ఇ’’అనే విమర్శ గ్రంథంచాలా ప్రముఖమైనది .దీనిలో నవలా రచనా విధానం ,వ్యక్తీకరణ కళారహస్యాలు వివరించాడు సాహిత్యంలో కళముఖ్యం కాని నీతి కాదు అని తెగేసి చెప్పాడు .1890కి ఈయన నవలలు రాయటం మానేసి నాటక రచన ప్రారంభించాడు ..కిరి హిటాహో(1896),హిటోటో గిను కొజో రకు గెట్సు(1898),మకి నోకటాఅనే ప్రఖ్యాత నాటకాలు రాశాడు .నాటకరంగం పై అనేక సంస్కరణలు చేయటమే కాకుండా కొబుకి నాటకం లోని లోపాలు ప్రదర్శిస్తూ ,వస్తువు ,పాత్ర పోషణ లలో ప్రాధాన్యమిచ్చే కొత్త చారిత్రక నాటక రచనలకు దారి చూపాడు .ఇతనిపై షేక్స్ పియర్ ప్రభావం ఎక్కువ .ఈయన్ను అనుసరించి,వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చిన నవారు-పుట బటుయ్-షి మెయ్ (1864-1908,)యమడబిమ్యో(1868-1910),ఒజో కీకోయో .మొదటి ఇద్దరు వ్యావహారిక భాషలో రాశారు .టజో టకన్,కొంజికి యషఅనేవి ఒజకి రాసిన శృంగార రస నాటకాలు .
ఈ యుగరచయిత్రులలో హిగుచి ఇచియో( 1872-96)24ఏళ్ళు మాత్రమె బ్రతికినా ‘’టలె కురబె’’అనే ప్రఖ్యాత నవల రాసింది .టోకు టోమి రోకా (1868-1927) షి జెన్టుజిన్ సెయ్ అనే స్వేయ చరిత్రను ,హోటో టో గిను (1898)నవల రాసింది . ఈయుగం లో ఆదర్శ వాదం ప్రముఖంగా వచ్చింది .దీనిలో గొజూనోటో(1892)రాసిన కోడ రోహన్ మోరి ఒగై(1862-1922)కిటమురా టోకోకు(1868-94)1873లో పుట్టిన ఇజుమి ట్యోకాలు కాల్పనిక ఉద్యమానికి పట్టుగొమ్మలుగా నిలిచారు .
ఈ యుగం చివర్లో సహజవాదం బాగా వ్యాపించి టాల్స్టాయ్,ఇబ్సెన్ ఎమిలిజోల ,మొపాసా ల ప్రభావం ఎక్కువైంది .ఇక్కడి నేచురలిజం మానవ జీవితానికి సంబంధించింది .కళకళ కోసమే అన్న దాన్ని వదిలి సహజ జీవిత వర్ణన చేశారు .ఇందులో షిమముర హోగేట్స్,(1871-1919)హసే గవటేనకి (1876)లవిమర్శలకు మంచి బలం చేకూరింది .కొసుకి టెన్ గై(1865),కునికిటడోస్సో(1871-1908),షిమజికి టోసన్(1872),టయమేకో టై(18711930)నేచురలిస్ట్ లలో ప్రముఖులు ..షిమజికిచాలా రచనలు చేసి జపాన్ సాహిత్యానికి వన్నె తెచ్చాడు .హకై1906,హరు-1908,లె-1911అనే ముఖ్య నవలలు రాశాడు .’’యోకే మెయ్(ఉషస్సుకు ముందు )అనే ఇతని రెండుభాగాల నవల జపనీస్ సాహిత్యం లో మకుటాయమానం .పరిణత శిల్పం తో సమకాలీన జపాన్ చరిత్ర తెలియ జేసే నవల .షిమజికిషిన్టైషి అనే పాశ్చాత్య కవితాపద్ధతిని జపాన్ లో ప్రవేశ పెట్టాడు .ఈయుగం చివర్లో సహజవాదం బలహీనమై క్రొత్త ఉద్యమాలు ఊపిరి పోసుకొన్నాయి .జీవితంలోని కొత్తదనానికివి బలం చేకూర్చాయి .సహజవాదాన్నిప్రతిఘటించిన ప్రముఖుడు –నట్సుమేసోసెకి(1867-1916)అనే ఆయన ‘’యయూహా లేక జైకై హా ‘’(లీజర్ స్కూల్ )అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించాడు .వాగహై వనకోడే ఆరు(నేనొక పిల్లి)1905,బొట్చన్-1906,కుసుమకుర-1906,గుబి జిన్సో-1907,సస్షిరో-1908,మన్-1910అనే ముఖ్యనవలు రాశాడు .ఆధునిక రచయితలపై ఇతని ప్రభావం జాస్తి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-20-ఉయ్యూరు