ప్రపంచ దేశాల సారస్వత౦ 13-టర్కిష్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వత౦

13-టర్కిష్ సాహిత్యం

టర్కీభాష –టర్కీ బాష ను తుర్కి ,తర్కీష్ ,టర్క్ అనీ అంటారు .క్రీశ 6వ శతాబ్దానికే మధ్య ఆసియాలో ఈభాష వాడుకలో ఉందని శాసనాలు చైనా చరిత్ర చెబుతున్నాయి .అక్కడినుంచి ఇతరప్రాంతాలకు వెళ్లి వాటిని యించి స్థిరవాసం ఏర్పరచుకొని భాషావ్యాప్తి చేశారు  .ఇందియావంటి దేశాల్లో కాలక్రమలో అంతరించింది సోవియెట్ యూనియన్ ,అజర్ బైఆన్ మొదలు ఆల్టాయ్ పర్వత పరిసరాలవరకు ,చైనీష్ తుర్కి స్తాన్ లలో కొన్ని మాండలికాలు ఉన్నాయి సాహిత్యభాషగా టర్కీ దేశం లోనే వికాసం పొందింది .ఈ భాష ఫిన్నో-ఉగ్రియన్ (ఊరాల్ –అల్టాయిక్)భాషా కుటుంబానికి చెందింది .ద్రావిడ  భాషలులాగా సంయుక్త దాటు రూప పద భాష .సంయుక్తాక్షరాలు తక్కువ .కఠినధ్వనులు లేకుండా ,అచ్చులతో సామరస్యంకలిగి వీనులకు ఇంపుగా ఉంటుంది .ద్రావిదభాశాలలో కొన్నిటికి దీనికి వాక్య నిర్మాణం లో పోలిక ఉన్నది .చివరి క్రియాపదం లుప్తం అవుతుంది దాటు రూపమే విధ్యర్ధకం గా ఉంటుంది ..వ్యాపించిన చోట్ల స్థానిక లిపినే ఆశ్రయించింది .మొదట్లో ఆరబిక్ లిపిలో రాయబడేది .ఐతే ముద్రణకు అనుకూలం కాకపోవటం వలన 1928నుండి శాసనాలలో రోమన్ లిపి వాడారు

   టర్కిష్ సాహిత్యం –ఉత్తర మంగోలియాలోని ఒర్హాన్ శాసనాలు ,చైనా టర్కీ లో కనబడిన ఉయ్ గూర్ గ్రంథాలలోఉన్నది ఇస్లాం పూర్వ యుగానికి చెందిన ప్రాచీన సాహిత్యం .మాహమూద్ కాష్గరి 1073లో కూర్చిన నిఘంటువు  లో టర్కీ జానపద కవిత్వం లోని కొన్ని భాగాలు ఉదహరింప బడినాయి .1069లో రాజైన కతత్కులిక్అను పరిపాలనకు చెందినా రచన ఇస్లామిక్ యుగం లో మొదటి ఉదాత్త గ్రంథం.ఇది ఆరబో –ఫారసీ ఛందస్సులో రాయబడింది .

   తర్వాత టర్కిష్ సాహిత్యం చాగటే,అజెరి,అనటోలియన్అనే మూడు మాండలికాలలో వృద్ధి చెందింది .తూర్పు టర్కీల సాహిత్యభాష చగటే మధ్య ఆసియా ,గోల్డెన్ హార్డ్(కివ్ చక్కుల)చేత వ్యవహరి౦పబడింది .15వ శతాబ్ది పెజరి తుర్క్ ,16శతాబ్ది బాబరు నామా అనేవి  ఈమా౦ డలికం లో రెండు ఉత్తమ రచనలు .ఆధునిక ఉజ్ బెక్ దీనిలోంచి పుట్టినదే తూర్పు ఓగజ్-పడమటి పర్షియా ,ఇరాక్ ,తూర్పు అనటోలియాలలో ఉన్న టర్కుల భాష అజెరెకి,అనటోలియన్ భాషలకు పెద్దగా తేడా ఉండదు .మర్మకవి నేసిమి ,హటై మారుపెరుగాకల సఫావిద్ వంశ స్థాపకుడు షా ఇస్మెయిల్,16శతాబ్ది గేయకవి ఫుజూలి అనే వారు ఈకవులలో ముఖ్యులు

  అటో మాన్ లేకదక్షిణ అని కాని పిలువబడే అనటోలియన్ 13వ శతాబ్దం నుంచి ఆతోమాన్ సామ్రాజ్యం లో వృద్ధి చెందింది .14,15శతాబ్దాలలో ఆశిక్ పాషా ,అహమేది సేహి ,అహమేద్ పాషా  నెకటి మొదలైన కవులు ఆరబో –పర్షియన్ విధానం లో టర్కీ భాషను ఇమడ్చాతానికి ప్రయత్నించి పార్శీ ప్రాచీన రచనల ప్రేరణ చేత గేయాలు ,ప్రేమ వృత్తాంతాలు రాశారు .వీరిలో ప్రసిద్ధులు యూసస్ ఎమ్రే,సులేమాన్ చెలెబి .ఎమ్రే మర్మకవిగా ప్రసిద్ధుడు అక్షరాత్మక ఛందస్సు అంటే సిలబిక్ మీటర్ పాటించాడు .చేలేబికవి మొదటి మహమ్మద్ గురించి పద్య స్తుతి రాశాడు .

   16 వ శతాబ్దం నుంచి కవులు పారశీక కవిత్వాన్ని జీర్ణం చేసుకొని సహజ లక్షనాలుకల స్వంత పద్య రచన చేశారు .వీరిలో బాకీ ,తస్లికలీ యాహ్యా ,రూహీ ,నెఫీ,సేయ్హులిస్లాం యాహ్యా ,నాబీ ,నేవీ ,నెడీం షెహ్ గాలిబ్ ముఖ్యులు .పారశీక ప్రభావంతో టర్కీ భాషా స్వాతంత్ర్యం పోయి కొద్దిమందికిమాత్రమే అంటే విద్యావన్తుఅలకు మాత్రమె దక్కింది సాహిత్యం .గద్య రచయితలలో హుకా సాడుద్దీన్ ,కాతిబ్ చేలేబి ,(హాజీ ఖలీఫా )పెశేని,నయీమా అనే చరిత్రకారులు ,ఆలీ చేలిబి అనే యాత్రికుడు ముఖ్యులు సాడుద్దీన్ చెవులకు ఇంపైన పదాలతో లలితసున్దరంగా కవిత్వం రాశాడు .మిగిలినవారి శైలి కరేస్పాన్దేన్స్ శైలి .జానపద వాజ్మయమూ బాగా వచ్చింది .ఈ కవులలో 17వ శతాబ్ది కరక వోగ్లాన్ ముఖ్యుడు .

   19వ శతాబ్దం నుంచి అనేక సంస్కరనలతోపాటు కొత్త సాహిత్యం వచ్చింది శినాసి అతని శిష్యులు నమిక్ కేమాల్ ,జియా పాషా  దీనిలో దిట్టలు .అబ్దుల్ హక్ హమీద్ ,అతని సమకాలికులు దీన్ని సంపన్నం చేశారు .నవల నాటకం వ్యాసం మొదలైన ప్రక్రియలలోనూ సాహిత్యం వచ్చింది .19వశతాబ్దిచివార్లో హవిడ్ జియా ఉసక్లిగల్ అనే నవలా రచయితా ,తెవ్ఫిక్ ఫిక్రేట్ అనే కవి మిత్రులుకలిసి ‘’సెర్వేటి ఉసన్ ‘’అనే పత్రిక అండతో కొత్తసాహిత్యశాఖ ఏర్పరచారు .వీరిది సర్వజన సమన్వయ విధానం .హుసేన్ ,అహ్మద్ లు దీన్ని వదిలేసి శక్తివంతమైన  వాస్తవిక శైలిలో ‘’ఇస్తాంబుల్ ‘’జీవితాన్ని వర్ణించారు .మిగిలినవారూ మారి సరళ టర్కీ భాషలో అక్షరాచందస్సులో రచనలు చేశారు .1908విప్లవం తర్వాత యువ రచయితలూ ‘’ఫెక్రి- అటి’’అనే సాహిత్య శాఖ కు చేరారు .వీరిలో సాన్కేతికకవి అహమద్ అసిం ..ఈకాలం లో యాహ్యా కమాల్ ప్రభావం వలన అందరూ ఆ దారిలో నడిస్తే ,మహమద్ అఖిఫ్ మాత్రం స్వతంత్రుడుగా ఉండి పోయాడు .

 ‘’ టర్కిక్ హార్త్ ‘’స్థాపించాక ,జెనెక్కలేమ్లర్లో భాషను సరళతరం చేసిన తర్వాత ,వచ్చిన జాతీయ సాహిత్యం కు జియా గోక్ఆల్ప్ నాయకత్వం వహించాడు .జాతీయ ఆశయాలను తెలిపి ,ప్రాచీన సంస్క్రతి చరిత్రల పరిశోధనలకు సూచనలు చేశాడు .ఫూ అద్ కోఫ్రూలూ  టర్కుల చరిత్ర సంస్కృతిలపై రాసి ప్రచురించాడు .నవరచయితలు సమకాలీన సమస్యలు ప్రస్తావిస్తూ రచనలు చేశారు .ఈ యుగ గొప్ప గద్యరచయితలు –ఒమర్సెయ్ ఫుద్దీన్ ,యాకుబ్ కద్రి,ఖలిదే ఎడిబ్,రేఫిక్ హవిడ్,ఫలిఫ్ రిఫ్కి ,రేసేద్ సూరి .ఫరుఖ్ సఫిజ్ ,నెసిబ్ ఫజిల్ మొదలైన వారు అక్షర ఛందస్సులో కవిత్వం రాశారు .నజీం హిక్మేట్ ఛందో రహితపద్యం ఫీవేర్స్ ప్రవేశపెడితే చాలామంది అనుసరించారు

  1930నుంచి టర్కిష్ సాహిత్యం లో మనస్తత్వం ,ఆత్మాశ్రయం స్వీయ చరిత్ర ,సాంఘిక సమస్యల చిత్రణ లతో రచనలు విరివిగా వచ్చాయి .కవులలో అహ్మద్ హండిటన్పినార్ ,ఒర్హన్ వెలి,కహిడ్సిడ్కి,ఫజిల్ హుస్నూ  ,కహిడ్ కూలెబి,నెకటి కుమలి అనే వారు ,గద్యం లో సబహద్దిన్ ఆలి ,సయీద్ ఫెయిక్,సమెద్అగావోగ్లు ,ఒర్హాన్ కేమాల్ ముఖ్యులు. అబ్దుల్ హక్ సినసి హిసార్ 1940లోనే ఉత్తమ రచనలు చేశాడు .

  ఫెరిట్ ఒర్హాన్ పామక్ కు నవలా రచనలో 2006లో నోబెల్ పురస్కారం లభించింది .ఈయన రచనలు 63భాషలలో 13 మిలియన్ లపుస్తకాలు అమ్ముడయ్యాయి .

The 10 Best Books by Turkish Authors

Madonna in a Fur Coat’ (1943) by Sabahattin Ali

The Time Regulation Institute’ (1954) by Ahmet Hamdi Tanpınar

Memed, My Hawk’ (1955) by Yaşar Kemal

Poems of Nâzım Hikmet’ (1986)

Istanbul Boy: The Autobiography of Aziz Nesin’ (1991)

‘The Museum of Innocence’ (2008) by Orhan Pamuk

Istanbul Istanbul’ (2015) by Burhan Sönmez

‘Three Daughters of Eve’ (2016) by Elif Shafak

New Selected Poems’ (2016) by İlhan Berk

The poems of Orhan Veli Kanik, Oktay Rıfat and Melih Cevdet Anday

The 10 Best Writers From Modern Turkey

Nazım Hikmet (1902-1963)

Ahmet H Tanpınar (1901-1962)

Yasar Kemal (born in 1923)

Bilge Karasu (1930-1995)

Orhan Pamuk (born in 1952)

Sabahattin Ali (1907-1948)

Sait Faik (1906-1954)

Melih Cevdet Anday (1915-2002)

Elif Shafak (born in 1971)

Selçuk Altun (born in 1950)

సశేషం

శ్రీపంచమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-20-ఉయ్యూరు

image.png
image.png

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.