కిరాతార్జునీయం-8
పౌరుషహీనుడికి అనర్ధాలు ఒకదానిపై ఒకటి దాపరిస్తాయి .నిరుద్యోగికి పౌరుషహీనుకి సంపదలు నిలవవు .సమయం కోసం ఎదురు చూడటం నిరర్ధకం .కపటబుద్ధి కి రుజుమార్గ ప్రవర్తన ఉండదు .13ఏళ్ళుగా అనుభవిస్తున్న ఐశ్వర్యాన్ని వదులుకొనే బుద్ధిహీనుడుకాడు మనశత్రువు .యుద్ధం చేయకపోతే మన రాజ్యం మనకు ఇవ్వడు ,ఎప్పుడో చేయటం కంటే ఇప్పుడే యుద్ధం చేసి మనరాజ్యం దక్కించుకోవాలి .ఒక వేళ తనే దుర్యోధనుడు మనకు రాజ్యమిస్తే అప్పుడు మహాపరాక్రమవంతులైన నీ సోదరులకు పని ఉండదు .పోనీ దానికీ ఒప్పుకు౦దా మంటే ,క్షత్రియులు క్షాత్రం చేతనే రాజ్యం సాధించాలి కాని దయా ధర్మ భిక్షతో కాదుకనుక యుద్ధప్రయట్నం చేయి .మృగరాజు స్వయంగా మదపు టేనుగును చంపి తింటు౦ది కాని ,ఇతరజ౦తు వులు చంపిందాన్ని తినదు .అలాగే మహాపురుషుడు తనపురుశకార్యంతోనే దేనినైనా సాధించి అనుభవించాలి .కాని సామం పనికి రాదు .మనం శూరులం అని మరువ రాదు .యుద్ధం లో జయం మనదేఅని చెప్పలేముకూడా .యుద్ధంవలన అనేక నష్టాలు కలుగుతాయి .తేజస్వికి మానరక్షణప్రదానంకాని ,రాజ్య సంపదకాదు .రాజ్యం రావచ్చు ,పోవచ్చు కాని శత్రువును బ్రతిమాలితే మానం పోతుంది .లక్ష్మి చంచలం యశస్సు స్థిరం .స్థిరకీర్తికి ప్రాణాలను కూడా లక్ష్యపెట్ట రాదు .కనుక యుద్దంచేసి మాన సంరక్షణ చేసుకోవాలిమన౦ .కాలని బూడిదను కాలితో తొక్కినట్లు మండే నిప్పును తొక్కలేం ,అలాగే మానహీనుడిని తేజస్సు లేనివాడిని లోకం గౌరవించదు .ప్రాణ, మానాలలో మానం ముఖ్యం .కనుక శూరోచితమార్గం ఎన్నుకొని ప్రయత్నించు. ప్రయోజనం ఆశించకూడదు .ప్రయోజనం లేకపోయినా సింహం ఉరిమే మేఘం పై ఉరుకుతుంది .అదిగొప్పవారిస్వభావం .శత్రుసంహారం పరమ పురుషార్ధం. ప్రాకృత మార్గం లో నడవటం వివేకి విధానం కాదు ‘’అని ఇంకా చెబుతున్నాడు అపర మనుధర్మ శాస్త్రవేత్తలాగా అపర చాణక్యుడిలా భీముడు .
సశేషం
రథసప్తమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-2-20-ఉయ్యూరు