లేఖ సాహితి వారి మూడు ఆణిముత్యాలు
మిత్రులు ,శ్రీలేఖ సాహితి సంస్థ అధ్యక్షులుడా. శ్రీమాన్ తిరుకోవలూర్ శ్రీరంగస్వామి గతవారంనాకు సంస్థ ప్రచురించిన మూడు పుస్తకాలు పంపారు . అంది, చదివే సావకాశం లేక 28రాత్రి హైదారాబాద్ వస్తూ నాతో తెచ్చుకొని ,ఆది సోమవారాలలో చదివాను .వాటి గురించి నాలుగు మాటలు రాయటం ధర్మం అని భావించి ప్రయత్నిస్తున్నాను .
1-తెలంగాణా నవలా సాహిత్యం
శ్రీ లేఖ సాహితి శ్రీ రంగస్వామి సంపాదకత్వం లోతెలంగాణాలోని 9జిల్లాలలో వచ్చిన నవలలు ఆయా రచయితలపై వెలువరించిన వ్యాస సంకలనం .ముందుగా ఇలాంటి కృషి జరిపిన స్వామిగారినీ వ్యాస రచయితలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను .మా ఆంధ్రరాస్ట్ర0 లో ఇలాంటి ప్రయత్నం జరిగిందో లేదో నాకు తెలియదు చేసి ఉంటే సంతోషం .లేకపోతే ఆ దిశగా ప్రయత్నించమని కోరిక .నల్గొండ నవలా సాహిత్యం పై డా. రావి ప్రేమలత రాశారు .తొలి తెలుగు నవల ఈ నెలలోనే ఉద్భవించిందని రచయిత నల్లగొండ జిల్లా మునగాలమండలం బేతవోలు వాసి తడకమళ్ళ వేంకటకృష్ణారావు ‘’అనీ 1866లో రాసిన నవల ‘’కంబు కంధర చరిత్ర ‘’అని శేషభట్టారు వెంకటాచార్యులు ‘’ప్రాకృత దాంపత్యం ‘’నవల రాశారని ఇది ప్రకృతిని ఇతివృత్తంగా రాసిన నవల .ప్రకృతి ఈశ్వరుడు .భూమి కధానాయిక .ఆకాశం హీరో .షబ్నవీసు వెంకట నరసింహారావుబాలికా విలాపంరాశారు అజ్మతుల్లా ఖాన్ సంస్కృతాంధ్ర ఉర్దూలాలలో పండిత శ్రేష్టుడు.గ్రంధాలను విష్ణుమూర్తికి అంకితమిచ్చిన భక్త శిఖామణి. సుశీల సుజాత రంపరాకాసి ,మణిమొదలైన స్త్రీ పేర్లతో నవలలు రాశారు .సాంఘికాలే ,నీతి ధర్మాలకే ప్రాధాన్యం ..వట్టికోట ఆళ్వారు స్వామి ‘’ప్రజలమనిషి ‘’నవలకు జనం బ్రహ్మ రధం పట్టారు .ఒకరకంగా అది ఆయన జీవితమే ,తెలంగాణా విమోచన ఉద్యమం పై డా ముదిగొండ సుజాతారెడ్డి ‘’మలుపు తిరిగిన రధ చక్రాలు ‘’రాసి తొలి మహిళా నవలా రచయిత్రి గా పేరుపొందారు .మహమ్మద్ అబ్దుల్లా ‘’శిధిల గృహాలు ‘’,సత్యభామ శపధం వగైరా నవలలు రాశారు .నోముల సత్యనారాయణ చైనా నవలను ‘’నాకుటుంబం ‘’పేరుతో అనువదించారు .
రంగారెడ్డి జిల్లా నవలా సాహిత్యం పై డా.రాయవరపు సూర్యప్రకాశ రావు ,మహబూబ్ నగర్ -పై డా భీమ్ పల్లి శ్రీకాంత్,మెదక్-ఐతా చంద్రయ్య ,నిజామాబాద్ -డా నమిలికొండ రవీందర్ ,అదిలాబాద్ -గోపగాని రవీందర్ ,కరీం నగర్ -శ్రీ దాస్యం లక్ష్మయ్య ,ఖమ్మం -శ్రీ తాడికొండల నరసింహం ,టి వంశీ కృష్ణ ,వరంగల్ డా శ్రీరంగస్వామి తమపరిధిలో మంచి సేకరణలతో గొప్ప వ్యాసాలను రాసి రంగస్వామి ఆలోచనకు అక్షర రూపం చేకూర్చి బాధ్యత సక్రమంగా నిర్వహించి అభినందనలు అందుకున్నారు .
2-శ్రీ రామ శతకం -3-శ్రీరామ శతకం -విశిస్టాద్వైత సౌరభం
శతకాన్ని రంగస్వామి గారి తండ్రిగారు కీ శే .శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి రాశారు .వారే రాసిన మాతృస్మృతి ,మొదలైనవి కలిపి ప్రచురించారు .ధారాశుద్ధికి విశిస్టాద్వైత సిద్ధాంతానికి అవలంబనంగా రాసిన శతకం .కవిగారి శతజయంతి సందర్భంగా మలిముద్రణగా తెచ్చారు .మూడవ పుస్తకం రంగస్వామి తల్లిగారు కీ.శే శ్రీమతి తాయమ్మగారి కి అంకితంగా పై శతకం లోని విశిస్టాద్వైత సౌరభం అంతటినీ పిండి వడబోసి సారంగా బహు ప్రసిద్ధులైన రచయితల తో రాయించి తెచ్చిన వ్యాస సంకలనం.శతకం లోని యే పద్యాన్నీ యే భావన్నీ వదలకుండా కూర్చిన అక్షరమాలిక .రంగస్వామి గారి మాతా ,పితరుల కు కైమోడ్పు గా వెలువరించి రుణం తీర్చుకొని అందరికీ ఆదర్శప్రాయమైనందుకు శ్రీ రంగస్వామిని గారెని మనసారా అభినందిస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-3-20-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్