ప్రపంచ దేశాల సారస్వతం
22- ఇటాలియన్ సాహిత్యం -2(చివరి భాగం )
నిత్య జీవిత సమస్యలతో బాందేల్లో నావెల్లాలు రాశాడు .దానినుంచే నవల పేరు వచ్చింది షేక్స్పియర్ నాటకాలకు ఇటాలియన్ నవలలే ప్రేరణ .నాటకాలు రాసినవారు రేసేల్లె ,జిరాల్డీ,స్పెరోనీ మున్నగువారు .మాకియవిల్లీ మాన్ద్రగోలా బ్రూనో రాసిన ఇల కాండేలాయియో నాటకాలు ప్రసిద్ధాలు అరియోస్తో ‘’ఓర్లాండో పూరియోనో ‘’ప్రబంధం రాశాడు .17వ శతాబ్దిలో చర్చి పెత్తనం పెరిగి రచన తగ్గింది .ఆడంబర శైలి మారి కమనీయ రచనలు వచ్చాయి .18వ శతాబ్దిలో వ్యక్తి స్వాతంత్ర్యం చైతన్యం తో రచనలు వచ్చాయి. శుద్ధ సాహిత్యాన్ని గొల్దోనీ రాశాడు .1816లో నవీన భావాలతో కావ్యాలు వచ్చాయి .వేల్లికో వివాదాస్పద ఫ్రాన్సెస్కా దరిమిని నాటకం రాశాడు .రాష్ట్రీయ భావనతో కూడా నవలలు రాశారు. ధ్వనికావ్యాలు జియుస్తీ తో ప్రారంభమయ్యాయి .1870లో ఇటలీకి స్వాతంత్ర్యం వచ్చి యదార్ధవాద రచనలు విరివిగా వచ్చాయి .నాటకాలను పునరుద్దీపింప జేసినవారు ఫావోలో ఫెరారీ, రోబెర్తో బ్రాకో లు .20వ శతాబ్ది సాహిత్యాన్ని గాబ్రియేలేదా మంజియో ప్రారంభించాడు .ఇతనిప్రభావం స్వేవో,బ్రూనో మొదలైన వారిపై ఉన్నది .వీరంతా నియంతృత్వాన్ని సమర్ధించారు .మారినేట్టి అధ్యక్షతన ఒక సాహిత్య సమితి ఏర్పడి నవ్యోత్సాహంతో కవులు కవిత్వం చెప్పారు. వీరిలో పపీనీ ప్రఖ్యాతుడు .ఇతని ఆత్మకథ ఉన్ ఉయో మోఫినితో బాగా పాప్యులర్ అయింది కోరజ్జోనీ ధ్వని ప్రధాన కావ్యాలురాశాడు .రెల్లీ గోప్పనాటకాలు రాసి ఆ రంగాన్ని ప్రభావితం చేశాడు .క్రోచే 20వ శతాబ్ద సాహిత్య సౌందర్య మీమాంసలో అభి వ్యక్తి వాదాన్ని నెలకొల్పాడు .
1230లో తలీలో సిలికాన్ స్కూల్ వచ్చి ఒకేరకమైన రచనలు వెలువడినాయి .సార్డా నియా రాజు ఎంజియో దీనికి ప్రేరణ .స్టాండర్డ్ ఇటాలియన్ లో కవిత్వం వచ్చి రెండవ ఫ్రెడరిక్ కాలం లో కొత్త దొరణలేర్పడ్డాయి ‘’.ఉమ్బ్రియాలో జాకోపోన్ డ తోడి ‘’కవి మతభావకవిత్వం రాశాడు .13శతాబ్ది లో టస్కన్ లో లాటిన్ కు దగ్గరగా ఉన్న భాష మాట్లేడేవారు .అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వం క్రోత్తశైలి కవిత్వానికి నాంది పలికింది .19,20 శతాబ్దాలలో ఎమిలీ జోలా ప్రభావం ఇటాలియన్ రచయితలపై పడింది .ఆ ధోరణిలో గ్రాజిల్లా డేలేద్డారచనలు చేసింది .స్త్రీలు ప్రోగ్రెసివ్ భావాలతో గొప్ప రచనలు చేశారు .హక్కులకోసం స్త్రీవాద రచనలు వచ్చాయి .మేరియా మేస్సినా రాసిన ‘’ఏ హౌస్ ఇన్ ది షాడోస్ ‘’,లారా డీఫిల్కా రచన ‘’ఫియర్ ఆఫ్ ది డే’’ రచనలు స్త్రీల జాగృతిని తెలియజేసేవి .
టాప్10 ఇటాలియన్ రచయితలు
1-డాంటే అలిఘరి-డివైన్ కామెడి 2-ఫ్రాన్సేస్కో పెట్రార్కా –ది ట్రయంఫ్స్ 3-జియోవన్నీ బోకాస్సియో –డేకామేరన్4-నికోల్లో డీబెర్నార్డో డీ మాకివిల్లి-ఇల్ ప్రిన్సైప్ 5-లుడోవికో అరిస్టో-కస్సారికా 6-అలెస్సాండ్రోమాన్జోని –ది బెట్రో తెడ్ 7-ఆల్బెర్టో మొరావియా –గిలి ఇన్ డిఫరెంసి 8-ప్రిమో మైకేల్ లేవి-దిస్ ఈజ్ ఎ మాన్ 9-ఇటాలో కాల్వెనో –ది క్రో కమ్స్ లాస్ట్ 10-అమ్బెర్టో ఇకో –ది నేం ఆఫ్ ది రోజ్.
ఇటాలియన్ రచయితలలో నోబెల్ పురస్కారం పొందినవారు -1-జియోసు కార్డకి -1906 2-గ్రాజియా డేలేడ్డా-1926-3-లుయిజి పిరాన్డేల్లో-1934 4-సాల్వటోర్ క్వాసిమోడో-1959.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-3-20-ఉయ్యూరు