డచ్ భాష -ఇండో యూరోపియన్ భాషా కుటుంబం లో జర్మానిక్ వర్గ పడమటి శాఖకు చెందింది డచ్ భాష .హాలండ్ లో ఎక్కువభాగం ,ఉత్తర ఫ్రాన్స్ లో కొన్నిభాగాలలో డచ్ మాతృభాష .దక్షిణాఫ్రికా బోయర్ల భాష ఐన ఆఫ్రికాన్స్ కూడా డచ్ భాషయే.ఇందులో ఒక మాండలికంగా ఉన్న ఫ్లెమింగ్ 1200 నుంచి స్వతంత్ర భాషా ప్రతిపత్తి పొందింది .రైన్ నది పరిసర ప్రాంతాలలో ప్రాచీనకాలం లో ఉన్న కొన్ని జర్మానిక్ మాండలికాలు క్రమంగా కలిసి పోయి క్రీస్తు శకం ప్రారంభం లో సామాన్య భాష గా మారి డచ్ భాష అయింది .ఐతే ఈప్రాచీన భాషలో సాహిత్యం ఏదీ రాలేదు .ప్రాచీన డచ్ క్రమంగా రూపురేఖలు మారి క్రీ.శ. 1100కు మధ్యయుగ డచ్ భాష గా మారింది .16వ శతాబ్ది దాక ఇదే వాడుకలో ఉన్నది .తర్వాత యూరప్ లో అరిగిన అనేక రాజకీయ పరిణామాలవలన ఫ్లాండర్స్ రాష్ట్రం వాళ్ళు హాలండ్ కు వలసవచ్చి ,ద్వివిద సంస్కృతుల మేళన జరిగి,ఇవాల్టి డచ్ భాష ఏర్పడింది .హాలండ్ లో చాలా మాండలికాలున్నా ,సాహిత్యభాష గ్రాంధిక డచ్ భాష మాత్రమే. అందుకనే అక్కడి గ్రాంధిక భాషకు వ్యవహారిక భాషకు తేడాచాలా ఉంటుంది .రోమన్ లిపి లోనే డచ్ భాష రాస్తారు .
సాహిత్యం –డచ్ జమీందార్లు డచ్ భాషా సాహిత్యానికి మొదట రూపంకల్పించారు .12వ శతాబ్దం లో ధనికులు కాలక్షేపానికి మాతృభాషలో రచనలు చేయటం మొదలెట్టారు .ఇవే తొలి సాహిత్య రచనలు .కాని విద్వాంసులు లాటిన్ భాషా మోజులో ,దేశీయ భాషలను ప్రోత్సహించకపోవటం తో వ్యాప్తి తగ్గింది .దేశీయ భాషా రచనలలో దొరికిన దాని బట్టి 12 శతాబ్ది చివర్లో ‘’హెయిన్ రిక్ ఫన్ వాల్ డేకెన్ ను మొదటికవిగా,,ఆ శ్రీమంతుడు రాసినవే మొదటి రచనలుగా భావిస్తారు .యితడు సెయింట్ సెర్వెషియస్ జీవిత చరిత్రను ,కొన్ని ఫ్రెంచ్ రచనలను అనువాదం చేశాడు .సుకుమార భావాలతో ఉన్న ఇతని శృంగార గీతాలు యూరప్ లోని చాలాభాషలలోని అనువాదం పొందాయి .ఇతన్ని ప్రేరణగా తీసుకొని కొందరు మధ్యయుగ డచ్ భాషలో కావ్యాలు రాశారు .వీరిలో’’ హాడెవిచ్’’ అనే కవయిత్రి ప్రసిద్ధురాలు .13వ శతాబ్దం లో మిస్టిక్ పోయెట్రి బాగా వచ్చింది .
15వ శతాబ్ది లో బర్గండీ రాజులు హాలండ్ ను జయించటం,లాటిన్ పై వీరాభిమానం ఉండటం తో డచ్ సాహిత్యానికి విఘాతం కలిగి,17వ శతాబ్ది దాకా స్తబ్దత ఏర్పడింది సాహిత్యం లో ..17వ శతాబ్దం లో పీటర్ కార్నిలిషూస్ హూఫ్ ట్ -1581-1647,గెర్ బ్రాండ్ అడ్నాస్ జూన్ బ్రేడేరో లు దేశ భాషనూ ఉద్ధరించాలనే సంకల్పం తో మధురంగా సుకుమార శైలిలో గేయాలు నాటకాలు రాశారు .శైలిలో వీరిద్దర్నీ మించిన వారు ఆ సాహిత్యం లో లేరు అని అభిజ్నులభావన .ఈ శతాబ్దం మొదట్లో జూస్ట్ ఫన్ డెన్ వాండేల్-1587-1679 సుప్రసిద్ధ రచయితగా పేరు పొంది’’డచ్ కవితా సార్వభౌముడు ‘’అనే బిరుదు పొందాడు అధిక్షేపకావ్యాలతో సహా అనేక గద్య పద్య రచనలితడు చేశాడు.నాటకరచనలోనూ అందెవేసిన చేయిగా ప్రసిద్ధుడయ్యాడు .అతని ‘’లూసిఫర్ ‘’నాటకం ఉత్తమ శ్రేణికి చెందింది .దేవుడిని ధిక్కరించి దేవతాగణ౦ తిరుగుబాటు చేసి విఫలమైన విషాదాంత నాటకం ఇది .ఈ నాటికీదీన్ని మించిన నాటకం లేదంటారు .ఆడంబరం లేని పద లాలిత్యం కమ్మని కవితాశైలి ఇతని సొమ్ము .ఎందరో అనుకరించే ప్రయత్నం చేసి విఫలురయ్యారు .
వాండేల్ తర్వాత చాలాకాలం దాకా పేరుపొందిన రచయితలు లేరు .అధిక్షేప విమర్శనాత్మక కావ్యరచన బాగానే వచ్చింది .ముల్తా తులీ ఉరఫ్ ఎడ్వర్డ్ డవెస్ డెక్కర్-1820-1887 దీనిలో ప్రసిద్ధుడు .ఇతని ‘’మేక్స్ హెవ్ లార్ అనే నవల లో డచ్ అధికారులు జావా ద్వీపం లో చేసేదారుణాలను సునిసితహాస్యం తో అధిక్షేపించాడు .ఇతనికాలం వాడే ఐన పట్ జీటర్-1808-1875,బుస్కేన్ హుట్ లు ‘’ది గైడ్ ‘’అనే మాసపత్రిక నడిపారు .మంచి విమర్శ ,విశ్లేషణలతో ఎన్నో రచనలను ఆపత్రికలో సమీక్షించారు .1880 పునరుజ్జీవన ఉద్యమం వచ్చి యువత నాయకత్వం వహించింది .విల్లెం క్లూస్ -1859-1938,ఆల్బర్ట్ వెర్ వే-1865-1937,లడ్విక్ ఫన్ డై జెల్అనే మారుపేరున్న కెరెల్ అల్బర్డింగ్ దిం వీరిలో ముఖ్యమైనవారు .వీరు ‘’నవీ గైడ్స్ ‘’మాసపత్రిక పెట్టి కావ్య ప్రయోజనంరసానుభూతి మాత్రమె అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు ,తమశైలికి ‘’వర్డ్ ఆర్ట్ ‘’అంటే పదాత్మక కళ అని పెరుపెట్టుకొన్నారు .వేలాది పదాల సృష్టికర్తలయ్యారు వీరు .వీరివలన భాష పరిపుష్టి పొందింది
1880 తర్వాత దశాబ్దానికి ఒక వాదం బయల్దేరాయి .కాలం గడిచినకొద్దీ వీటిలోని వైరుధ్యాలన్నీ మాసి పోయి అన్నీ సాహిత్యాభి వృద్దికే అనే భావం ఏర్పడింది .చుట్టూ ఉన్న పరిస్థితులపై ఈకవులకు అసంతృప్తికలిగి కవిత్వం లో బహిర్గతమైంది .
విలియం ఆఫ్ ఎబెర్స్ బెర్గ్ అనే జర్మన్ ఆబ్బట్ సాంగ్ ఆఫ్ సాల్మన్ కు రాసిన వ్యాఖ్యానం పురాతన వ్రాత ప్రతి .అతిప్రాచీన కవిత్వం ను వెస్ట్ ఫ్లెమింగ్ మాంక్ 1100లో రాసిన ‘’హేబ్బాన్ ఒల్లా ఒగ్లా ‘’.ఓల్డ్ డచ్ కు చెందిన’’రైన్ లాండిక్ రైమింగ్ బైబిల్ ‘’ప్రసిద్ధమైనది.20వ శతాబ్దిలో చారిత్రిక రచన జోహాన్ హూజింగా చేశాడు .ఇది అనేకభాషలలోకి అనువాదం పొందింది .ఎందరో రచయితలకు ప్రేరణకలిగించింది .న్యు ఆబ్జెక్టివిటి ఫోరం ఏర్పడి కొత్తరచనలు వచ్చాయి .బోర్డే విజిక్ రాసిన ‘’బింట్’’కథ కు బ్రహ్మ రధం పట్టారు .ఎడ్గార్ డు పెళ్ళాన్ కొత్త నవలలు రాసి పేరుపొందాడు .రెండవ ప్రపంచయుద్ధం తర్వాత అన్నే ఫ్రాంక్ అనే జ్యూయిష్ బాలిక రాసిన ‘డైరీ ‘’కొత్త రికార్డ్ సృష్టించి పలుభాషలలోకి తర్జుమా అయింది .ఈ డైరీ చాలామందిలో ప్రేరణకలిగించి తమ అనుభవాలతో ఉన్న డైరీలు వచ్చాయి .మారగా మింకో రాసిన చైల్డ్ హుడ్, రచయిత్రి హెల్లా హాసీ రచనలు ప్రసిద్ధి చెందినవే .ఐడియలిజం అదృశ్యమైంది .
టాప్ టెన్ రైటర్స్ గా –గేరార్డ్ రీవ్ ,ఫ్రెడరిక్ హీర్మన్ , హారీ మూస్లిష్ ,జాన్ వోకేర్స్ ,అన్నేఫ్రాంక్ ,డిక్ బ్రూనా ,అన్నీ ష్మిస్ట్ , హెల్లా హాసే ,బాంట్ జెర్,మైకేల్ ఫేబెర్.
80నవలలు రాసిన హార్రీ మూస్లిష్ కు నవలా సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .
ఫెడ్రిక్ హీర్మాన్ ,గేరార్డ్ రీవ్ ,హారీమూస్లిష్ లను ‘’త్రీ జైన్ట్స్ ఇన్ డచ్ లిటరేచర్ ‘’అని గౌరవంగా పిలుస్తారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-3-20-ఉయ్యూరు
—