లాటిన్ భాష –గ్రీకులు ట్రాయ్ నగరాన్ని ధ్వంసం చేశాక,ట్రాయ్ రాజకుటుంబాలు సురక్షిత స్థావరం కోసం వెతుకుతూ’’ ఈనియస్’’ నాయకత్వం లో ఇటలీ వచ్చారని కథనం ..వీరిభాష ఆర్య భాషా కుటుంబానికి చెందిన లాటిన్ .విభక్తులు ,వికరణలు ఈ భాషలో సంస్కృతం లో లాగానే చాలా ఉన్నాయి .ప్రస్తుతం మృత భాషగా ఉన్న లాటిన్ నుండి ఉత్పన్నమైన భాషలే ఇటలి ,ఫ్రాన్స్ ,స్పెయిన్ ,పోర్చుగల్ ,దక్షిణ అమెరికా భాషలు .లాటిన్ భాషా వాదులు గ్రీకుల సంపర్కం తో వాడిన లిపినే పశ్చిమ ఐరోపా వారు తీసుకొని ‘, ’రోమన్ లిపి ‘’అన్నారు .ఇంగ్లిష్ లోని జె,యుఅక్షరాలు లాటిన్ లో లేవు .
సాహిత్యం –అతిప్రాచీనకాల సాహిత్యం లో ప్రకృతి,దేవతలు,గీతాలు సూక్తాలు ,ప్రార్ధనలు ఉన్నాయి .’’ట్వెల్వ్ కమాండ్ మెంట్స్’’ ప్రాచీన రచన .క్రీ.పూ మొదటి శతాబ్దం లో సిసిరో తత్వ వేత్త రచనలు,ఉపన్యాసాలు మాత్రం సాహిత్య పరమైనవి .వీటిలో ప్రాచీన సాహిత్య సంప్రదాయం చెప్ప బడింది .సిసిరో కి పూర్వం లివియాస్ ఆండ్రో నికస్-క్రీ.పూ.284-202 గ్రీకు భాషలో ఉన్న హోమర్ కావ్యాన్ని అనువదించాడు .ఇతడు ,జెవియస్ -క్రీ.పూ.270-199 కొన్ని గ్రీకునాటకాలు కూడా తర్జుమా చేశారు .క్విన్తున్ ఎన్నియస్ ను క్రీ.పూ.239-169’’లాటిన్ సాహిత్య పిత ‘’అంటారు .19సర్గలు ,600పద్యాలతో వీరకావ్యాన్ని రాశాడు .ఇతని బంధువు వసూలియస్ –క్రీ.పూ.220-130 కొన్ని నాటకాలు రాశాడు .రిపబ్లిక్ గా ఉన్న ఇటలి దేశస్థులు ఆఫ్రికాలో చాలా చోట్ల స్థావరాలు ఏర్పాటు చేసికొన్నారు .అక్కడనుండి ఖైదీగా తీసుకు రాబడిన తెరింతియస్-క్రీ.పూ 195-156లాటిన్ నాటకాలు కళాఖండాలుగా రాసి ,ఐరోపాలో నాటక వాజ్మయానికి పునాదులు వేశాడు .అతడు రాసిన వాటిలో ఆరు సుఖాంత నాటకాలు లభిస్తున్నాయి .ఇతని తర్వాత ప్లాతస్-క్రీ.పూ.220-184 గొప్ప నాటకాలు రాసి నాటక సాహిత్యానికి ఉద్దీపన కలిగించాడు.
గ్రీకుల ఖండ కావ్య విధానం లో లాటిన్ లో రాసినవారు కాతులస్-క్రీ.పూ.84-54,వలెరియస్ యేది తువస్,లిస్ నుస్ మొదలైనవారు .చతురింద్రియ గ్రాహ్యాలైన చిత్రాలతో ఖండకావ్యాలురాసిన వాడు –లేవియుస్ .హృదయాన్ని స్పందింపజేసి ,గొప్ప అనుభూతితో గేయాలు రాసినవాడు మాత్రం -కాతులస్ .భౌతిక వాదాన్ని ఇతి వృత్తంగా ‘’రేరుం నాతురా ‘’అనేమహాకావ్య౦ రాసిన దార్శనిక కవి- లుక్రేషియుస్-క్రీ.పూ.94-54.దార్శనిక భావాలను కవితాత్మకంగా రాసి రస సౌందర్యాన్ని సృష్టించాడు .వచనం లో విశిష్ట శైలి తో మార్గ దర్శనం చేసిన వారు-కాథో-క్రీ.పూ.234-149,వారో –క్రీ.పూ. 116-27,సిసెరో- క్రీ.పూ.106-43,జూలియస్ సీజర్ –క్రీ.పూ.100-44 మొదలైన వారు .క్రీ.పూర్వం లో విచ్చిన్న శక్తులు అంతర్యుద్దాన్న్ని తెచ్చాయి .విజేత అగస్టస్ సీజర్ కాలపు మహాకవి వర్జిల్ –క్రీ.పూ.70-19.గ్రీకు కవిపితామహ హోమర్ తో సరి తూగ గల ఐతిహాసిక మహాకావ్యం ‘’ఈనియద్’’ను వర్జిల్ మహా కవి రాశాడు ఈనియస్ ఇటలి చేరిన ఇతి వృత్తం .భావం భావ చిత్రాలు రూప నిష్పాదన మహా శైలి,పాత్రపోషణ ,గుణాలు అలంకారాలతో ఈ వీరకావ్యానికి మించిన కావ్యం రాలేదని అభిప్రాయం .
ఆగస్టస్ రాజు కాలం లాటిన్ భాషకు స్వర్ణయుగం వర్జిల్ ,హోరేస్ , ప్రొవెర్తియస్ ,ఓవిద్ మొదలైన మాహాకవులున్నకాలం అది. వ్యంగ్యాత్మక అవహేళన కావ్యాలను హోరేస్ –క్రీ.పూ.65-8 రచించి ప్రసన్న గంభీర శైలిలో ‘’ఓడ్’’అనే ఖండకావ్యం ,గేయాలు ,సమీక్ష సిద్ధాంతాలు ,లేఖలు రాశాడు .ఎలిజీ కి సృష్టికర్త ప్రొవెర్తియుస్-క్రీ.పూ -47-15ఐతే, వ్యాప్తి చేసినవారు ,తిఖుల్లాస్ క్రీ.పూ.-55-16,ఐవిద్-క్రీ.పూ.43-18.మనోహర కావ్యదార తో ప్రోవెర్తియుస్ అసమానంగా రాశాడు .పౌరాణికం సంప్రదాయం కలిపి ‘’మెటామార్ఫోసిస్ ‘’అనే కావ్యాన్ని రాసినావాడు ,ఓవిద్ కవి. కవిత్వం లో లాలిత్యం, పాత్రపోషణ హృదయగ్రాహ్యమైన ప్రణయ కళ ఉన్నాయి .ఇతిహాసాన్ని గద్య౦ గా రాసినవాడు లీవీ –క్రీ.పూ.59-క్రీ.శ 17చరిత్రను కవిత దృష్టితో మలిచి గొప్ప ప్రయోగం చేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-3-20-ఉయ్యూరు
—