ప్రపంచ దేశాల సారస్వతం
25-లాటిన్ సాహిత్యం -2(చివరి భాగం )
క్రీ.శ.14-117వరకున్నకాలం లాటిన్ సాహిత్యానికి ‘’రజత యుగం ‘’. ఉత్తమ శ్రేణి వచన రచనలొచ్చాయి..తాసి తుస్ -35-118,సుయెతోనియుస్-75-160లు చరిత్రను వైజ్ఞానిక దృష్టితో పరిశీలించి రాశారు సంప్రదాయం పాటిస్తూ చరిత్రరాశాడు ప్లిని. ఈ యుగం లో వ్యాజస్తుతి ,నిందాత్మక రచనలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి .సమాజాన్ని ఎడా పెడా వాయిస్తూ వెర్సియుస్ ప్లాకుస్ -34-62 రాశాడు .ఇంతకంటే తీవ్రంగా విజ్రుమ్భించి ,ఐరోపాఖండ సాహిత్యాన్ని పూర్తిగా మారుస్తూ కవిత్వం లో రాసినవాడు జువనెల్-55-130.అవినీతికి’’ చండా మార్కుడు ‘’అనిపించాడు .
శైలికి ప్రాముఖ్యమిచ్చి కొత్త దృక్పధం తో సాహిత్య మీమాంసా శాస్త్రం రాసినవాడు-క్వింతిలియస్ 35-100.ఇతనిది ప్రామాణిక సమీక్షగా అందరూ అంగీకరించారు .రోమ్ నగరం లో కామకేళీ విన్యాసాలను ,ప్రమాదాలను వ్యంగ్య౦ అనుపానంగా రాసాడు ‘’పెట్రోనియుస్.సాంస్కృతిక హైన్యాన్ని వచనం లో ‘’బంగారు గాడిద ‘’అనే కథ లో అద్భుతంగా చిత్రించాడు .ఇందులోని సైకి ,క్యుపిడ్ అంటే ‘’రతీ మన్మధుల కథ’’ తర్వాత కాలం లో కవులను విపరీతంగా ఆకర్షించింది .
క్రీ.శ. 2వ శతాబ్ది నుంచి లాటిన్ వాజ్మయం క్రైస్తవుల చేతిలోకి పోయింది .ఈకాలం లో బెర్తులియస్-160-220 రాసిన ‘’అప్లో బేతికస్ క్రైస్తవ ధర్మ ప్రాతిపదికంగా రాశాడు .ఓజో వంతమైన శైలి లో వ్యంగ్యాత్మకం గా రాశాడు .3వ శతాబ్దిలో మిమసియుస్ ఫెలిక్స్ డైలాగ్ రూపంగా ‘’అక్తావియుస్ ‘’రాసి క్రైస్తవాన్ని సమర్ధించాడు .ఆర్నోబియుస్-303,లక్తాన్తియుస్-250-310 లు అదే ధోరణి లో రాశారు .సెయింట్ జెరోం -345-420,సెయింట్ ఆగస్టిన్-354-420 లు ఈకాలపు ప్రసిద్ధ రచయితలు .4వ శతాబ్ది నుంచి లాటిన్ సాహిత్యం లో’’ ఆగస్టీన్ యుగం ‘’ఆరంభమైంది .జెరోం ,ఆంబ్రోస్ -340-378,పౌలినుస్ -353-431 హృదయ౦గమైన కవిత్వం రాశారు .దోనాతుస్,మర్తియానుస్ ,,కపెల్ల మొదలైనవారు మిస్టిక్ కవిత్వం రాశారు .ఆధ్యాత్మిక దార్శనిక గ్రంధాలన్నీ ఆగస్తిన్ యుగం లోనే వచ్చాయి .జెరోం బైబుల్ ను లాటిన్ లోకి అనువాదం చేసిన మొదటి కవి .’’డివైన్ సిటి’’అనే అత్యుత్తమ ఆధాత్మిక గ్రంథం ఆత్మాను భూతితో రాశాడు సెయింట్ ఆగస్టిన్.
ఆధ్యాత్మిక ,దార్శనిక విషయాలను క్రైస్తవం తో సమన్వయ పరచి కొత్త పోకడలలో రాసిన వారు –బోయే ధియుస్-480-525,కసియొ దూరస్ -480-570,సెయింట్ బెనెడిక్ట్-480-547,గ్రెగరీ-540-604.ఇందులో మొదటి ఇద్దరు ప్రాచీన గ్రీకు ,రోమన్ సంప్రదాయాలను కాపాడారు .రెండవ ఆయన అరిస్టాటిల్ రచనలను ప్రచారం లోకి తెచ్చాడు .సెయింట్ బెనెడిక్ట్ కృషి వలన చర్చిలు విద్యా ,కేంద్రాలుగా మారాయి . సేయేంట్ ఇసిడోర్-570-636’’ ఎతిమలోగే ‘’అనే ‘’విశ్వ కోశం ‘’రాశాడు .సేదూలియున్ క్రైస్తవ ధర్మ కవిత్వం రాశాడు .కావ్యకళా నిష్ణాతుడు- ఫోర్త్ నాతాన్ -535-600 మధురగేయకవిత్వం రాశాడు .కొలుమ్బనుస్-543-615,బీడ్-673-735 లు గొప్పకవ్య నిర్మాతలు .మత కవిత్వ కవి ఆల్కుయిన్ -735-804,థియో డుల్ఫ్,పాల్,అన్గిల్బర్త్ ,ఐన్హార్డ్ లుపాస్ నేర్వుతస్ మౌరుస్ మొదలైనవారు .ప్రకృతి సౌందర ప్రేమిక కవి స్ట్రాబో.హోన్బిథా కవయిత్రి ఆకాలపు ‘’సాహిత్య అనురాగిణి’’గా ప్రసిద్ధి చెందింది .
11వ శతాబ్దిలో వ్యావహారిక ,ప్రాకృత భాషలు కూడా సాహిత్యభాషలుగా పరిణామం చెందాయి .18వ శతాబ్ది లో కూడా ఐరోపాలో లాటిన్ భాష సాంస్కృతిక భాషగా ఉన్నది .11వ శతాబ్దిలో యూని వర్సిటీలు వచ్చి గ్రీకు ,లాటిన్ లకు ప్రాధాన్యత పెరిగింది .అన్సేలం ,అనెలార్డ్-1079-1142,సాలిస్బరి కి చెందిన జాన్ -1115-1180 లో లాటిన్ లోనే రచనలు చేశారు సెయింట్ థామస్ ఆక్వినస్ ఛాయా వాదానికి దగ్గరగా ‘’దియోలోజికా ‘’గ్రంథం రాశాడు .డాంటే-1265-1321లాటిన్ లో ఖండకావ్యాలు రాశాడు .ధామస్ అకేన్సిస్ -1380-1471’’ఇమితాతియో క్రిస్తీ’’ ను కవితా ధోరణిలో తాత్విక వివేచనతో దార్శనిక౦గా రాశాడు .14వ శతాబ్దం లో పెట్రార్కా ఖండకావ్యాలురాస్తే ,వచనరచనలు సిసిరో శైలిలో లాటిన్ లో రాశాడు .
తర్వాత శాతాబ్దాలలోకూడా లాటిన్ భాషలోనే రచనలు వచ్చాయి .17వ శతాబ్ది ప్రముఖ శాస్త్రవేత్త న్యూటన్ లాటిన్ భాషలోనే ఫిజిక్స్ రాశాడు .19వ శాతాబ్దినుంచి లాటిన్ లో గొప్ప రచనలు రాలేదు కాని లాటిన్ గౌరవం తగ్గలేదు .యూరప్ వారు గ్రీకు,లాటిన్ లు వదిలేస్తే వారి సంస్కృతి నిర్జీవమే అవుతుంది . Latin moves with impressive dignity in the writings of Ovid, Cicero, or Virgil. It reflects the seriousness and sense of responsibility that characterized the ruling class of Rome during the great years of the republic. But the Romans could also relax and allow what Horace called the “Italian vinegar” in their systems to pour forth in wit and satire.
ఇంగ్లీష్ కవులు కూడా లాటిన్ లో కవిత్వం రాశారు .మిల్టన్ ఇంగ్లిష్ లో, లాటిన్ లో కవితలు రాశాడు ధామస్ కామ్పియాన్ ,జార్జి హెర్బర్ట్ ,ఆండ్రూ మార్వేల్ లు కూడా ..కొందరు లాటిన్ లోనే రాసి ఆభాష ఔన్నత్యాన్ని డిగ్నిటిని నిలబెట్టారు .దీనికి ఉదాహరణ ఆన్దోని ఆల్సోప్ ,విన్సెంట్ బోర్న్ వగైరా . 19వశతాబ్ది కవి వాల్టర్ సావేజ్ లాండర్ లాటిన్ లో రాసిన చివరికవి .
లాటిన్ లో 10 ప్రసిద్ధ రచనలు -1-సేలేక్టెడ్ వర్క్స్ బై సిసిరో 2-వర్జిల్ రాసిన ఎనిఎడ్ 3-ఓవిడ్ రాసిన మెటామార్ఫసిస్4-టాసిటస్ –హిస్టరీస్ 5-జూలియస్ సీజర్ రచన-ది కాంక్వెస్ట్ ఆఫ్ గాల్6-మార్కస్ ఆరిల్లస్ రచన –మెడిటేషన్స్ 7-ప్లిని రచన నేచురల్ హిస్టరీ 8-డేసేడిరస్ ఎరాస్మస్ రచన –ది ప్రైజ్ ఆఫ్ ఫాల్లిస్ 9-హోరేస్ రాసిన –ఓడ్స్10-ఆగస్టిన్ ఆఫ్ హిప్పో రచన-కన్ఫెషన్స్.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు