ప్రపంచ దేశాల సారస్వతం  26-  మాలి (ఆఫ్ర్రికన్ )సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

 26-  మాలి (ఆఫ్ర్రికన్ )సాహిత్యం

మాలి అధికారికంగా ” రిపబ్లిక్ ఆఫ్ మాలి ” అని పిలువబడుతుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశం. భౌగోళికంగా పశ్చిమ ఆఫ్రికను క్రాటనులో భాగంగా ఉంది. వైశాల్యపరంగా మాలి ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా ఉంది. దేశవైశాల్యం 1,240,000 చదరపు కిలో మీటర్లు (480,000 చదరపు మైలు) ఉంది. మాలి జనాభా 18 మిలియన్లు.దేశ రాజధాని బామాకో. మాలి సార్వభౌమ దేశం. దేశంలోని ఎనిమిది ప్రాంతాలలో ఉత్తరప్రాంతం సహారా ఎడారిలో చొచ్చుకుని ఉంటుంది. అదే సమయంలో దేశంలో అధికసంఖ్యలో ప్రజలు నివసిస్తున్న దక్షిణ భాగంలో నైగరు, సెనెగలు నదులు ప్రవహిస్తున్నాయి. వ్యవసాయం, గనులు దేశం ఆర్ధిక కేంద్రాలుగా ఉన్నాయి. మాలి ముఖ్యమైన సహజ వనరులలో బంగారం ప్రాధాన్యత వహిస్తుండగా. ఉప్పు ఉత్పత్తిలో దేశం అతి పెద్ద నిర్మాతగా ఉంది.

ప్రస్తుతమున్న మాలి మూడు పశ్చిమ ఆఫ్రికా సామ్రాజ్యములలో భాగంగా ఉంటూ ట్రాన్స్-సహారన్ వర్తకాన్ని నియంత్రించింది: ఘనా సామ్రాజ్యం, మాలి సామ్రాజ్యం (దీనికి మాలి పేరు పెట్టబడింది), తూయింగ్ సామ్రాజ్యం. దేశ స్వర్ణ యుగంలో గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, కళలు అభివృద్ధి చెందాయి.1300 లో శిఖరాగ్రస్థితిలో ఉన్న సమయంలో మాలి సామ్రాజ్యం ఆధునిక ఫ్రాన్సు కంటే రెండు రెట్లు అధిక వైశాల్యంతో ఆఫ్రికా పశ్చిమ తీరం వరకూ విస్తరించింది.] 19 వ శతాబ్దం చివరలో ఆఫ్రికా ఆక్రమణ సమయంలో మాలి నియంత్రణను ఫ్రాంసు స్వంతం చేసుకుంది. ఇది ఫ్రెంచ్ సుడాన్లో భాగంగా మారింది. ఫ్రెంచ్ సుడాన్ (సుడానీస్ రిపబ్లిక్గా పిలువబడేది) 1959 లో సెనెగల్తో కలిసి, 1960 లో మాలి ఫెడరేషనుగా స్వాతంత్ర్యం పొందింది. తరువాత కొంతకాలానికి సెనెగలు సమాఖ్య నుంచి ఉపసంహరించిన తరువాత సుడానీస్ రిపబ్లిక్కు మాలిని స్వయంగా స్వతంత్ర రిపబ్లిక్కుగా ప్రకటించింది. సుదీర్ఘకాలం ఏక-పార్టీ పాలన కొనసాగిన తర్వాత 1991 లో తలెత్తిన తిరుగుబాటు తరువాత కొత్త రాజ్యాంగం రూపొందించబడి తరువాత మాలిని ఒక బహుళ-పార్టీ ప్రజాస్వామ్య దేశంగా స్థాపించడింది.

2012 జనవరిలో ఉత్తర మాలిలో సాయుధ పోరాటాలు జరిగాయి. తిరుగుబాటు మార్చిలో తీవ్రరూపం దాల్చింది. తిరుగుబాటులో ఉత్తరప్రాంతం టువరెగ్ తిరుగుబాటుదారులు వశపరచుకుని ఏప్రిలులో అజావాడు పేరుతో కొత్త దేశాన్ని ప్రకటించారు.  టువరెక్ ప్రతిస్పందనగా 2013 జనవరిలో ఫ్రెంచి సైన్యం ” ఆపరేషన్ సర్వెలును ” ప్రారంభించింది. ఒక నెల తరువాత మాలీ, ఫ్రెంచి దళాలు ఉత్తరప్రాంతం లోని చాలా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 2013 జూలై 28 న రెగ్యులర్ ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 11 న జరిగిన రెండో రౌండ్ రన్-ఆఫ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. నవంబరు 24 న, డిసెంబరు 15 న జరిగాయి.

 మాలి ప్రజలలో అనేక సహ-సహారా జాతి సమూహాలు ఉన్నారు. బంబారా ప్రజలు అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. వీరు జనాభాలో 36.5% మంది ఉన్నారు.

మాలీలో సమిష్టిగా బంబారా, సోనింకే, ఖస్సోన్కే, మాలిన్కే (మండిన్కా అని కూడా పిలుస్తారు), మండే సమూహంలోని అన్ని భాగాలు కలిసి మాలి జనాభాలో 50% ఉన్నారు.ఇతర ముఖ్యమైన సమూహాలు (ఫులా 17%), వోల్టాయికు (12%), జుంగు (6%) , టువరెగు, మూరు (10%) ఉన్నారు.మాలి, నైగర్లలో మూర్లను అజవాఘు అరబ్బులు (సహారాలోని అజావాగు ప్రాంతం పేరుతో) అంటారు. వారు ప్రధానంగా హస్సనియను అరబిక్కు మాట్లాడతారు. ఇది అరబిక్కు ప్రాంతీయ మాండలికాలలో ఒకటి. వ్యక్తిగత పేర్లు మాలి ప్రాంతీయ గుర్తింపుల సమగ్రరూపాన్ని ప్రతిబింబిస్తాయి.ఈ ప్రాంతంలోని బానిసత్వం చారిత్రక వ్యాప్తి కారణంగా ఉత్తరప్రాంతంలో బెర్బెరు-సంతతికి చెందిన టువరెగు సంచార ప్రజలు, ముదురు రంగు చర్మంగల బెల్లా (తామషెకు ప్రజలు) ఒక విభాగంగా ఉన్నారు.

మాలిలో బానిసల సంతతికి చెందిన 8,00,000 మంది ప్రజలు ఉన్నారు.[35] మాలిలో శతాబ్దాలుగా బానిసత్వం కొనసాగింది.

20 వ శతాబ్దం మధ్యలో ఫ్రెంచి అధికారులు బానిసత్వం అణిచివేసే వరకు అరబ్బు ప్రజలు 20 వ శతాబ్దం వరకు బానిసలను ఉపయోగించారు. కొన్ని వంశావళి సంబంధాలు ఇంకా సాగుతున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం సుమారుగా 2,00,000 మంది మాలియన్లు ఇప్పటికీ బానిసలుగా ఉన్నారు. ఐరోపా, ఆఫ్రికా సంతతికి చెందిన స్పెయిను ముస్లింల మిశ్రమ ప్రజలు, అలాగే కొంతమంది ఫ్రెంచి, ఐరిషు, ఇటాలీ, పోర్చుగీసు మూలాలు కలిగిన ప్రజలు మాలిలో నివసిస్తున్నారు. అర్మా అని పిలువబడుతున్న ఈ ప్రజలు దేశం జనాభాలో 1% ఉన్నారు.

భాషలు

మాలి అధికార భాష ఫ్రెంచి. అదనంగా వివిధ జాతుల సమూహాలలో 40 కంటే అధికమైన భాషలు వాడుకలో ఉన్నాయి. మాలి జనాభాలో సుమారు 80% మంది బంబారాలో సంభాషించగలరు. ఇది ఒక ముఖ్యమైన ఫ్రాంకా భాషగా పనిచేస్తుంది.

మాలీలో ఫ్రెంచి, బంబారాతో సామీపసంబంధం ఉన్న 12 జాతీయ భాషలు ఉన్నాయి. అవి వరుసగా బోము, టైయాక్సో బోజో, టోరో సో డోనో, మాసినో ఫుల్ఫుల్డే, హస్సనియన్ అరబిక్, మమరా సేనౌఫో, కిటా మనిన్కాకాన్, సోనిన్కే, చెయినా సినోఫో, తమాషెఖ్, క్సాసంగక్సాంగో . ప్రతీభాషా ప్రాథమికంగా జాతి సమూహాలను అనుసంధానించిన మొదటి భాషగా చెప్పబడుతుంది.

మతం – 11 వ శతాబ్దంలో పశ్చిమాఫ్రికాలో ఇస్లాం పరిచయం అయ్యింది. ఇస్లాం ఈ ప్రాంతంలో చాలా వరకు ప్రధాన మతంగా ఉంది. సుమారుగా 90% మంది మాలియన్లు (ఎక్కువగా సున్నీ) ముస్లుములు ఉన్నారు. సుమారుగా 5% క్రైస్తవులు (సుమారుగా మూడింట రెండు వంతులు రోమన్ కాథలిక్కులు, ఒక వంతు ప్రొటెస్టంట్లు), మిగిలిన 5% స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా ఉంటారు. మాలియన్లలో నాస్తికత్వం, అజ్ఞేయవాదానికి చెందిన ప్రజలు చాలా అరుదుగా ఉన్నారు. వీరిలో ఎక్కువమంది వారి మతాన్ని దినసరి జీవితంలో ఆచరిస్తారు.

మాలి రాజ్యాంగం దేశాన్ని ఒక లౌకిక దేశంగా ఏర్పరుస్తుంది. మతం స్వేచ్ఛను కల్పిస్తుంది. ప్రభుత్వం ఈ హక్కును ఎక్కువగా గౌరవిస్తుంది.

మాలిలో చారిత్రాత్మకంగా పాటిస్తున్న ఇస్లాం స్థానిక పరిస్థితులకు అనుగుణమైనదిగా స్వీకరించబడింది; ముస్లింలు, అల్పసంఖ్యాక మత విశ్వాసాల అభ్యాసకులు సాధారణంగా స్నేహంగా ఉంటారు.2012 లో దేశం ఉత్తర భూభాగాలలో షరియా పాలన ప్రవేశపెట్టిన తరువాత ఉత్తర ప్రాంతంలో సంభవించిన తీవ్రమైన హింసను వివరించే ఓపెన్ డోర్స్ ప్రచురించిన క్రిస్టియన్ పీడన సూచికలో అధిక సంఖ్యలో (7 వ స్థానం) జాబితా చేయబడింది

విద్య -మాలి లోని ప్రజలకు విద్య ఉచితంగా ఇవ్వబడుతుంది. ఏడు నుండి పదహారు సంవత్సరాల వయస్సు మధ్య తొమ్మిది సంవత్సరాలకాలం నిర్బంధవిద్య తప్పనిసరి.  విధావ్యవస్థ 7 సంవత్సరాల వయస్సులో ప్రారంభించి ఆరు సంవత్సరాల ప్రాధమిక విద్య తరువాత ఆరు సంవత్సరాల ఉన్నత విద్యావిధానం కలిగి ఉంది.[81] కుటుంబాలకు యూనిఫాంలు, పుస్తకాలు, సరఫరా, హాజరుకు అవసరమైన ఇతర ఫీజులకు వ్యయంచేసే ఆర్ధికస్థోమత లేనందున మాలి ప్రాధమిక పాఠశాల నమోదుశాతం చాలా తక్కువగా ఉంటుంది.

2000-01 పాఠశాల సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల నమోదు రేటు 61% (71% పురుషులు, 51% స్త్రీలు) ఉంది. 1990 ల చివరిలో ఉన్నత పాఠశాల నమోదు రేటు 15% (పురుషులు 20%, ఆడవారి 10%).[81] గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు లేకపోవడం, ఉపాధ్యాయుల, వస్తువుల కొరత విద్యా వ్యవస్థను ప్రభావితమవుతుంది.[8

ఆరోగ్యం

పేదరికం, పోషకాహార లోపం, అపరిశుభ్రత, పారిశుద్ధ్యసౌకర్యాల లోపం కారణంగా మాలి అనేక ఆరోగ్య సవాళ్లను మాలి ఎదుర్కొంటుంది.

లింగ వివక్ష

2017 లో యునైటెడు నేషన్సు డెవలప్మెంటు ప్రోగ్రాం నివేదించిన ప్రకారం లింగ అసమానత సూచికలో 160 దేశాలలో మాలి 157 వ స్థానాన్ని పొందింది. మాలియన్ రాజ్యాంగం మహిళల హక్కులను కాపాడుతున్నప్పటికీ పలు చట్టాలు మహిళలపై వివక్షత కలిగి ఉన్నాయి.చట్టాలలోని నిబంధనలు వివాహం తర్వాత మహిళల నిర్ణయాధికారాన్ని పరిమితం చేస్తాయి. అందులో భర్త తన భార్యకంటే ఉన్నతుడౌతాడు.[91] స్త్రీలు వారి భర్తలను కనిపించకుండా దూరంగా ఉంటే నిందకుగురౌతారు. తమ పిల్లల చర్యల కొరకు కూడా మహిళలు నిందలను ఎదుర్కొంటారు. ఇది మహిళల స్థితి తక్కువగా పరిగణించే సాంస్కృతిక వైఖరిని ప్రోత్సహిస్తుంది.రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం లేకపోవడం రాజకీయాలు పురుషులతో సంబంధం కలిగి ఉండటం, మహిళలను ఈ రంగం నుండి తప్పించడానికి కారణంగా ఉంది.బాలికల విద్యాభ్యాసంలో బాలుర ఆధిపత్యం అధికంగా ఉంది. ఎందుకంటే బాలురకు విద్యను అందించడం తల్లిదండ్రులకు మంచి పెట్టుబడిగా భావించబడుతుంది.[91

సంగీతం

మాలీ సంగీత సంప్రదాయాలు గ్రియోట్సు నుండి తీసుకోబడ్డాయి. వీరు “మెమోరీస్ కీపర్స్” గా పిలవబడుతున్నారు.మాలీ సంగీతం విభిన్నంగా ఉంటూ అనేక విభిన్న కళా ప్రక్రియలను కలిగి ఉంది. సంగీతంలో కొంతమంది ప్రసిద్ధ మాలీ సంగీతకళాకారులలో కోరా (ప్రసిద్ధ సంగీతకారుడు), టౌమాని డయాబెటే, బెస్సెకో కౌయుయేట్, జాలీ నోగోని, బ్లూస్ గిటారిస్టు అలీ ఫర్కా టూరే, టువరెగు బ్యాండు టినారివేను, సాలిఫు వంటి అనేక గాయకులు ప్రాధాన్యత వహిస్తున్నారు. కెయిటా, ద్వయ అమాడౌ ఎట్ మరీయం, ఊమా సంగరే, రికో ట్రోరే, హబీబ్ కోయిటే ఆఫ్రో-పాప్ కళాకారులుగా ప్రాబల్యత సంతరించికున్నారు. మాలియన్ సంస్కృతిలో నృత్యం కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. స్నేహితుల మధ్య డ్యాన్స్ పార్టీలు సాధారణం. వేడుకల కార్యక్రమాలలో సాంప్రదాయ ముసుగు నృత్యాలు ప్రదర్శించబడతాయి.

సాహిత్యం

మాలీలో సాహిత్యం సంగీతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ  అన్ని సమయాలలో మాలి ఆఫ్రికా అతి ప్రాముఖ్యమైన మేధో కేంద్రాలలో ఒకటిగా ఉంది. మాలి సాహిత్య సాంప్రదాయం ప్రధానంగా మౌఖికంగా ప్రాచుర్యం పొందింది. జలిస్ (పఠించడం, హృదయానికి తెలిసిన కథలు, చరిత్రలను పాటలరూపంలో కథనం చెప్పడం వంటి ప్రక్రియలలో ప్రదర్శించబడుతుంటాయి.అమడౌ హంపటే బా మాలి అత్యంత ప్రసిద్ధ చరిత్రకారుడుగా ఈ మౌఖిక సంప్రదాయాలను ప్రపంచాన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా లిఖితరూపం ఇవ్వడానికి జీవితం అకింతం చేసాడు.

మాలియన్ రచయిత ” యమబో ఓయులోగ్యుయం ” వ్రాసిన ప్రసిద్ధి చెందిన నవల ” లే డెవోయిర్ డే వయోలెంసు ” ఇది 1968 ప్రిక్సు రెనాడోట్ను గెలుచుకుంది. కానీ ఇది ప్లాగియారిజం అన్న ఆరోపణల ద్వారా దెబ్బతింది.బాబా ట్రోరే, మోడిబో సౌంకలో కేయిటా, మాసా మకాన్ డయాబాటే, మౌసా కొనాటే, మరియు ఫాలీ డాబో సిసోకోలు ఇతరులు మలియన్ రచయితలుగా ప్రసిద్ధిచెందారు.ఊస్మేన్ సెంబి -ఉల్ఫ్ సేనేగేలెస్ నవల రాశాడు .ది ఎపిక్ ఆఫ్ సన్ డియాట రాశాడు మాసా మకాన్ డైబెట్.బంబారా ప్రజల గురించి వారిలో నుంచి వచ్చిన కెరీర్ రచయిత్రి మేర్సో కొండాటే.వోలోఫ్ సేనేగాలిస్ట్ నావలిస్ట్ ‘’గాడ్ బిట్స్ ఆఫ్ వుడ్ ’రాశాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.