ప్రపంచ దేశాలసారస్వతంసారస్వతం
27-దక్షిణ సూడాన్ సాహిత్యం
దక్షిణ సూడాన్ అధికారిక నామం, దక్షిణ సూడాన్ రిపబ్లిక్ ,భూఖండాలే హద్దులుగా గల దేశం. ఇది తూర్పు మద్య ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి ఉత్తర ఆఫ్రికా ఉపప్రాంతంలో ఉంది.[6] దీని ప్రస్తుత రాజధాని, పెద్ద నగరం జూబా. భవిష్యత్తులో దేశం మధ్యలో గల రామ్సియల్ అనే ప్రదేశం రాజధాని అవుతుంది. దీని ఉత్తరసరిహద్దులో సూడాన్, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రం, తూర్పుసరిహద్దులో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో కెన్యా, దక్షిణ సరిహద్దులో ఉగాండా, నైఋతి సరిహద్దులో కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు, పశ్చిమసరిహద్దులో మధ్య జబలు అంటారు. అంటే ఆఫ్రికా రిపబ్లిక్కులు ఉన్నాయి. దీనిలో సుడ్డు అనబడే చిత్తడినేల ప్రాంతం ఉంది. ఇది వైట్ నైలేచే ఏర్పడింది. దీనిని స్థానికంగా బారు అల్ (పర్వత సముద్రం) అంటారు.
సూడాన్, దక్షిణ సూడాన్ దేశాలను ఈజిప్టుని పరిపాలించిన మహమ్మద్ ఆలీ వంశం ఆక్రమించి ” ఆంగ్లో ఈజిప్షియను కండోమినియంగా పాలించబడింది. బ్రిటీషు సామ్రాజ్యంలో భాగంగా ఉన్న తరువాత 1956 లో స్వతంత్రం పొందాయి. మొదటి సూడాన్ అంతర్యుద్ధం తరువాత 1972 లో దక్షిణ సూడాన్ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఏర్పడి 1983 వరకు కొనసాగింది. రెండవ సూడాన్ అంతర్యుద్ధం 2005 శాంతి ఒప్పందంతో ముగిసింది. అదే సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటయింది.
2011 జనవరిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 98.83% ఓట్లు సాధించిన తరువాత 2011 జూలై 9న దక్షిణ సూడాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది.[8][9] తరువాత ఇది ఐక్యరాజ్యసమితిలో, ఆఫ్రికా సమాఖ్యలో సభ్యదేశం అయింది.
దక్షిణ సూడానులో 12 మిలియన్ల ప్రజలు ఉన్నారు. వీరిలో నిలోటికు ప్రజలు అధికంగా ఉన్నారు. క్రైస్తవ మతం సంఖ్యాపరంగా ఆధిఖ్యతలో ఉంది. 17 సెప్టెంబరులో ఐఖ్యరాజ్య ప్రతినిధి (చిల్డ్రెన్ అండ్ ఆర్ముడు కాంఫ్లిక్టు) మాట్లాడుతూ దక్షిణ సూడాన్ నివాసితులలో సగం మంది 18 సంవత్సరాల లోపు వారు ఉన్నారని చెప్పాడు.ఇది ఐక్యరాజ్యసమితి,ఆఫ్రికా సమాఖ్య తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీ ఇంటర్‌గవర్నమెంటల్ అథారిటీ ఆన్ డెవెలెప్మెంటులలో సభ్యదేశంగా ఉంది. 2012 జూలైలో దక్షిణ సుడాన్ జెనీవా ఒప్పందాల మీద సంతకం చేసింది. దక్షిణ సుడాన్ జాతి హింసను ఎదుర్కొంది. 2013 నుండి పౌర యుద్ధం సంభవించింది. 2018 నాటికి తాజా ఐక్యరాజ్య సమితి రిపోర్టు నివేదికలో దక్షిణ సుడాన్ దిగువస్థాయి నుండి మూడవ స్థానంలో ఉంది.అమెరికా ఫండు ఫర్ పీసు ” ఫ్రాజిలు స్టేట్సు ఇండెక్సు (గతంలో ఫెయిల్డ్ స్టేట్స్ ఇండెక్స్).
చరిత్ర
దక్షిణ సుడాను లోని నిలొటికు ప్రజలలో ప్రపంచప్రపంచ దేశాలసారస్వతం-అకోలి, అన్యుయాకు, బారి, దిన్కా, నుయరు, షిల్లాకు, కాలిగి (అరబికు ఫెరోఘే), ఇతరులు- మధ్యయుగ నబ్బియా పతనం సంభవించిన 10 వ శతాబ్దానికి ముందు దక్షిణ సుడాన్‌లోకి ప్రవేశించారు. 15 వ నుండి 19 వ శతాబ్దాల వరకు బహరు ఎల్ ఘజలు ప్రాంతం, ఉన్నత నైలు ప్రాంతాలకు అన్యుయాకు, బారి, దిన్కా, నుయరు, షిల్లాకు ప్రజలు వలసగా వచ్చి చేరుకున్నారు. అచోలి, బారి ప్రజలు ఈక్వెటోరియాలో స్థిరపడ్డారు. 16 వ శతాబ్దంలో దక్షిణ సుడాన్‌లోకి ప్రవేశించిన అజాండే, ముండూ, అవకాయ, బకా దక్షిణ సూడానుకు చేరుకుని ఈ ప్రాంతం అతిపెద్ద దేశం అయిన గ్రేటు ఈక్వెటోరియా ప్రాంతంను స్థాపించారు.
సంఖ్యాపరంగా డింకా అతిపెద్ద జాతి, న్యూయరు రెండవ అతిపెద్దది, అజాండే మూడవ అతిపెద్దది, బారి దేశంలో నాల్గవ అతిపెద్ద జాతి సమూహంగా ఉంటాయి. ఈ ప్రజలు పశ్చిమ ఇకాటోరియా ఉష్ణమండల వర్షారణ్యపు బెల్టులోని మరీడి, యాంబియో, టోంబురు జిల్లాల్లో కనిపిస్తారు. అయోండో క్లయింటు ఎయి, మద్య ఈక్వెటోరియా, పశ్చిమ బహరు ఎల్ గజలు ప్రాంతాలలో ఉంటారు. 18 వ శతాబ్దంలో అవంగరా సిబు అధికారంలోకి వచ్చి మిగిలిన అజాండె సమాజం మీద సాధించిన ఆధిపత్యం 20 వ శతాబ్దం వరకు కొనసాగింది.వైటు నైలు, క్రైస్తవ మిషనరీలను 1922 నాటి క్లోజ్డు డిస్ట్రిక్టు ఆర్డినెంసు (చూడండి హిస్టరీ ఆఫ్ ఆంగ్లో-ఈజిప్టు సుడాన్) దక్షిణాది ప్రాంతాలకు పంపించే బ్రిటీషు ప్రాధాన్యతతో భౌగోళిక సరిహద్దులు ఏర్పడ్డాయి. దీని వలన వారి సాంఘిక, సాంస్కృతిక వారసత్వాన్ని, అలాగే వారి రాజకీయ, మత సంస్థలను నిలుపుకోవటానికి వీలు కల్పించింది. బ్రిటిషు ఉత్తర అరబు ప్రాంతాల వరకు అభివృద్ధికి ప్రాముఖ్యత కల్పించి దక్షిణ ప్రాంతాలలో ఉన్న నల్లజాతీయులను విస్మరించింది. 1958 లో సూడాను మొట్టమొదటి స్వతంత్ర ఎన్నికల తర్వాత ఖార్టూం (పాఠశాలలు, రోడ్లు, వంతెనలు లేకపోవటం) దక్షిణప్రాంతాలను నిరంతరాయంగా విస్మరించడం తిరుగుబాటులు జరగడానికి, ఖండంలోని అతి పెద్ద పౌర యుద్ధం జరగడానికి దారి తీసింది.2012 నాటికి ఈ ప్రాంతంలో ప్రజలు ఆచోలి, అనియుకు, అజాండే, బకా, బాలండా బ్వివిరి, బారి, బోయా, దితిదా, డిన్కా, జియీ, కాలిగి, కుకు, లోతుకా, ముందరి, మురీ, నిలోటికు, నుయరు, షిల్లోకు, టోపోసా, జండే ఉన్నారు.
బానిసత్వం చరిత్రవ్యాప్తంగా సుడానీసు జీవితంలో ఒక సంస్థగా ఉంది. 19 వ శతాబ్దంలో దక్షిణాన బానిస వాణిజ్యం తీవ్రమైంది. ఉప-సహారా ఆఫ్రికాలో బ్రిటిషు అధికంగా బానిసత్వాన్ని అణిచివేసిన తరువాత కూడా ఇది కొనసాగింది. ముస్లిమేతర ప్రాంతాలలో జరిగిన వార్షిక బానిస దాడులు ఫలితంగా దక్షిణ సుడానులో అనేక వేలమందిని బానిసలుగా పట్టుకోవడం ఈ ప్రాంతం స్థిరత్వం, ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయడం జరిగింది.
భాషలు
దక్షిణ సుడాను అధికార భాష ఆంగ్లం.
60 కి పైగా దేశీయ భాషలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిలో-సహారన్ భాషా కుటుంబంగా వర్గీకరించబడ్డాయి; సమిష్టిగా ఇవి నైలు సూడాను, మద్య సుడాను విభాగాలుగా విభజించబడ్డాయి.
మతం
దక్షిణ సుడాను మతాలలో సాంప్రదాయ స్థానిక మతాలు, క్రైస్తవ మతం, ఇస్లాం ఉన్నాయి.
సంస్కృతి
అనేక సంవత్సరాల పౌర యుద్ధం కారణంగా దక్షిణ సుడాను సంస్కృతి దాని పొరుగువారిచే భారీగా ప్రభావితమవుతూ ఉంది. చాలామంది దక్షిణ సుడానీయులు ఇథియోపియా, కెన్యా, ఉగాండాలకు పారిపోయారు. అక్కడ వారు జాతీయులతో పరస్పరం మిశ్రితమై వారి భాషలు, సంస్కృతిని నేర్చుకున్నారు. దేశంలో మిగిలిపోయిన ప్రజలల్ఫ్ సుడాను, ఈజిప్టుకు ఉత్తరంగా వెళ్లి అరబు సంస్కృతిలో మిశ్రితమై ఉన్నారు.
సంగీతం
దక్షిణ సుడాను నుండి అనేక మంది సంగీత కళాకారులు ఇంగ్లీషు, స్వాహిలీ, అరబీ జుబా, వారి మాండలికం లేదా అన్ని మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. బార్బజు, యాబా ఏంజెలోసి వంటి పాపులర్ కళాకారులు ఆఫ్రో-బీటు, ఆర్ & బి, జుకు పాడతారు; డైనంకు రెగె విడుదలలకు ప్రసిద్ది చెందాడు; జానపద, రెగె, ఆఫ్రో-బీటు పాడుతున్న ఇమ్మాన్యూలు కెంబు. దక్షిణ సుడానీస్ సంగీత కళాకారుడు ఇమ్మాన్యూలు జలు తన ప్రత్యేకమైన హిప్ హాప్, సాహిత్యంలో సానుకూల సందేశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్ళాడు. మాజీ బాల సైనికుడు జెలు సంగీతకారుడిగా మారి యు.కె.లో మంచి ప్రసారం, ఆల్బం సమీక్షలను అందుకున్నాడు. టి.ఇ.డి. వంటి ప్రసిద్ధ చర్చా వేదికలలో ప్రధాన చర్చలలో ఉపన్యాసం చేయడానికి కూడా అవకాశం లభించింది.
సాహిత్యం –
ఇవాళ సూడాన్ లో ఆరబిక్ భాషలో రచనలు చేస్తున్నారు .కవిత్వం మాత్రం ఫర్ భాషలో వస్తోంది .జానపదం కూడా ఉంది.20వ శతాబ్దిలో మౌఖిక సాహిత్యానికి అక్షరారూపమిస్తున్నారు .అజాహి ,మదిహ్ కదా సాహిత్యం బాగా వ్యాప్తిలో ఉన్నాయి .ఇవి పౌరాణిక గాదలు.వీటితోపాటు మహమ్మద్ ప్రవక్త గురించిన కధలు గాధలూ కూడా వచ్చాయి .20వ శతాబ్దిలో పయోనీర్ వంటి పత్రికలు వచ్చాయి .ఇతర దేశాలను చూస్తూ ప్రస్తుతం వాస్తవ సాంఘిక నవలలు రాస్తున్నారు .’’ది వాస్ట్ ఎంప్టి నెస్’’నవలను మల్కార్ ఎడ్డార్ మహమ్మద్ రాస్తే 1960లో మరణానంతరం ప్రచురితమైంది .సుడానీస్ రచయితలలో ప్రసిద్ధుడు –అల్ తయ్యాబి సాలిహా .యితడు కధలు కూడా రాశాడు .ఇతని ప్రసిద్ధ నవల ‘’సీజన్ ఆఫ్ మైగ్రేషన్ టు ది నార్త్ ‘’1967లో ప్రచురితమైనది .ఇది ఇంగ్లాండ్ నుంచి సూడాన్ వచ్చే విద్యార్ధుల విషయం పై రాసింది .మొదట అరబిక్ లో తర్వాత ఇంగ్లిష్ ఫ్రెంచ్ భాషల్లో వచ్చింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు
—