గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం
521-కేదార ఖండ పురాణకర్త –వాచస్పతి ద్వివేది (1938)
5-1-1938పాట్నాలో పుట్టిన వాచస్పతి ద్వివేది సంస్కృత ,హిందీసాహిత్య రత్న ,ఎం.ఎడ్.,పిహెచ్ డి.వారణాసి సంస్కృత విశ్వ విద్యాలయ సంస్కృత హెడ్ .బ్రహ్మ దత్ ద్వివేది ,ప్రొఫెసర్ బొచ్చన్ ఝా గురువులు .ప్రొఫెసర్ సుభాష్ చంద్ర త్రిపాఠీ,ప్రొఫెసర్ మీరా దూబే లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .సంస్కృతం లో 8గ్రంథాలు రాశాడు .వాటిలో –కేదారఖండ పురాణం ,బృహదారణ్యక వృత్తి సారం ఉన్నాయి .శ్రీమద్ భగవద్గీతకు సంపాదకత్వం వహించాడు .సంస్కృత అకాడెమి నుంచి విశిష్ట పురస్కారం పొందాడు .మారిషస్ లో 2008-09కాలం లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .
522-కౌత్సస్య గురు దక్షిణ కర్త –వాసుదేవ శాస్త్రి ద్వివేది (1913)
వేద,వ్యాకరణ సాహిత్య రత్న వాసుదేవ శాస్త్రి ద్వివేది 1913లో యుపి లో భవానిచత్ర గ్రామం లో జన్మించాడు .13గ్రంథాలు రాశాడు .వాటిలో కౌత్సుక గురు దక్షిణ ,దీపమాలిక ,సంస్కృత గానమాల ,భోజరాజీయ సంస్కృత సామ్రాజ్యం ,సంస్కృత గౌరవ గానం ఉన్నాయి .సార్వ భౌమ సంస్కృత ప్రచార సంస్థ నెలకొల్పి సేవ చేశాడు .సంస్కృత భాష మాటాడే అనేక కాంపులు ఉత్తరాభారత్ లో నిర్వహించి భాషా వ్యాప్తికి అద్వితీయకృషి చేశాడు .1955లో రాష్ట్రపతి పురస్కారం పొందాడు .1958లో విశ్వభారతి అవార్డ్ అందుకొన్నాడు
523-త్రిదోష లోకః కర్త-విశ్వనాథ ద్వివేది –(1910)
1910లో బాలియా జిల్లా ఓజ్హా వాలియా లో విశ్వనాథ ద్వివేది జన్మించి ఆయుర్వేద ఆచార్య అయ్యాడు .లక్నో యూనివర్సిటి ప్రొఫెసర్ .జాం నగర్ ఆయుర్వేద శిక్షణ కేంద్ర డైరెక్టర్ .7సంస్కృత పుస్తకాలు రాశాడు .వాటిలో త్రిదోష లోకః ,తైల సంగ్రహం ,అభినవ నేత్ర రోగ విజ్ఞానం ,నాడీ విజ్ఞానం ,ప్రత్యక్ష ఔషధీ నిర్మాణం ఉన్నాయి .వారణాసీయ సంస్కృత విశ్వ విద్యాలయం లో నూ సేవలందించాడు .
524-పథిక జన పాటక చింతామణి కర్త –వ్రిజ్ వల్లభ ద్వివేది (1921)
1921లో సహపురా బిల్వాడా లో జన్మించిన దర్శనాచార్య వ్రిజ్ వల్లభ ద్వివేదిసంస్కృత ప్రొఫెసర్ .ప్రొఫెసర్ ధుంది రాజ్ శాస్త్రి ,రఘునాధశర్మల వద్ద విద్య నేర్చాడు.ప్రాచీన నిర్ణయ పత్రం , పథిక జన పాటక చింతామణి గ్రంథాలు రాశాడు .
525-గురువాయూర మహాత్మ్యం కర్త –వాసు దేవన్ ఎలయంత్ (1912)
గురువాయూర మహాత్మ్యం రాసిన వాసు దేవన్ ఎలయంత్15-6-1912న కేరళలోని త్రిస్సూర్ జిల్లా కక్కస్సేరి లో పుట్టాడు .న్యాయ భూషణ్ ,సాహిత్యశిరోమణి .మన్నీత శాస్త్రి శర్మ ,అచ్యుతపోత్వాల్ ,రాం వారియర్ లు గురువులు .కృష్ణ గీతి , గురువాయూర మహాత్మ్యం అనే రెండు గ్రంథాలు రాశాడు .
526-అద్వైత ధర్మ౦ కర్త –కె.ఎన్.నీలకంఠన్ ఎలయంత్(1943)
కె.ఎన్.నీలకంఠన్ ఎలయంత్ 5-3-1943న కేరళలో వజ్హూర్ లో పుట్టాడు .సంస్కృత యూనివర్సిటి ప్రొఫెసర్ ,అడయార్ లైబ్రరి రిసేర్చ్ సెంటర్ డైరెక్టర్ .శృంగేరి మఠం కృష్ణ శాస్త్రి దగ్గర విద్య నేర్చాడు .సంస్కృతం లో 10పుస్తకాలు రాశాడు .అందులో అద్వైత ధర్మ౦ఒకటి .దిఎదిక్స్ ఆఫ్ సాంస్క్రిట్ ,డి కాన్సెప్ట్ ఆఫ్ జీవన్ముక్తి కూడా రాశాడు కేరళ సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత
527-కేరళో దయః కర్త –కె.యెన్ .ఎలుతచ్చన్ (1911)
1911జూన్ 19 కేరళ చెర్పల్ చేరిలో పుట్టిన కె.యెన్ .ఎలుతచ్చన్ సాహిత్య శిరోమణి .కుసుమోపహారం ,ప్రతిజ్ఞ,ప్రతీక్ష ,కేరలోదయః అనే నాలుగు పుస్తకాలు రాశాడు .కాలికట్ యూని వర్సిటి మలయాళం డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ .1976లో కేరలసాహిత్య అకాడెమి అవార్డ్ ,1979లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ పొందాడు .
528-ఆధునిక భారతీయతత్వజ్ఞాన కర్త –హేమంత విష్ణు ఈనాం దార్(1925-2006)
హేమంత విష్ణు ఈనాం దార్ 1925 నవంబర్ 3 న మహారాష్ట్రలో పుట్టాడు .సంస్కృత మరాఠీ లలో ఎం .ఎ. ఎల్ఎల్ బి ,పిహెచ్ డి .12పుస్తకాలు రాశాడు .అందులో సంత్ నామ దేవ ,భక్తీ పంధా-నవ చింతన ,శ్రీ ఏకనాధ దర్శన ,ఆధునిక భారతీయ తత్వ జ్ఞాన ఉన్నాయి .81 ఏళ్ళు జీవించి 23-6-2006 చనిపోయాడు
529- సారస్వత్య శాఖ కర్త –రామన్ నారాయణన్ ఎప్పురత్ (1970)
సారస్వత్య శాఖ కర్త –రామన్ నారాయణన్ ఎప్పురత్ 1970మే 20 న కేరళ త్రిస్సూర్ జిల్లా ఎలవల్లి లో జన్మించి సాహిత్య౦లొ పిహెచ్ డి పొందాడు .హైదరాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .వాసుదేవన్ ఎలాయత్ ,ప్రొఫెసర్ కే గోవిందన్ నంబియార్ ,భారత్ పిశోడీ లు ఇతని గురుపరంపర .12పుస్తకాలు రాశాడు .సారస్వత్య శాఖ ,భ్రుగు వంశ మహాకావ్య ఆఫ్ ప్రతాప రాజ ,దిముక్తావళి ,.ఇండియన్ అనలిట్రిక్ ట్రడిషన్స్ లో కంప్యూటరేషనల్ అప్ప్రోచ్ ప్రాజెక్ట్ హెడ్ .
530-ఖాది గీత కర్త –ఆత్మారాం కమల్ ఫోందారి(1944-2000.)
15-6-1944న తిహారి గద్వాల్ లో పుట్టిన ఆత్మారాం కమల్ ఫోందారి వైద్య విశారద ,.ఖాదీ గీత ,శ్రీ కమలా గురువంశ మహిమ్న స్తోత్రం రాశాడు .56ఏళ్ళు మాత్రమె జీవించి 2000 సంవత్సరం లో మరణించాడు .సంస్కృత హిందీ గద్వాల్ భాషలలో మహాకవిగా కీర్తి గడించాడు .సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-20-ఉయ్యూరు