గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం
541-రుక్ సూక్త మంజూష కర్త –గౌతమ్ (1936)
4-8-1936న గుజరాత్ అహ్మదాబాద్ లో పుట్టిన గౌతమ్ 120 గ్రందాల రచయిత.అందులో ఆది శంకరాచార్య ,ఛాందోగ్య దీపిక ,కుమార సంభవం ఆఫ్ కాళిదాస ,వైదిక సాహిత్య ఔర్ సాంస్క్రిట్ ఉన్నాయి .
542-నీలమత పురాణ కర్త –వేదకుమారి ఘాయ్(1931
1931డిసెంబర్ 14న జమ్మూ –తావి లో పుట్టిన వేదకుమారి ఘాయ్,జమ్మూ యూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్ హెడ్ కూడా .10 పుస్తకాలు రాసింది .వాటిలో నీలమత పురాణం ,పురంధ్రపంచకం ,కాశ్మీర్ కా సంస్కృత సాహిత్య కా యోగదాన ఉన్నాయి
543-యాజ్ఞ్యవల్క్య సహస్ర నామావళి కర్త –పరశురామ ఘనాపాఠి(1914)
1914 ఆగస్ట్ 15 తమిళనాడు కుంభకోణం దగ్గర ఎంగికొల్లై లో పుట్టిన పరశురామ ఘనాపాఠి సలక్షణ ఘనతంత్ర విద్వాన్ శతపథబ్రాహ్మణ .చెన్నై అమ్బత్తూర్ లోని యాజ్ఞవల్క్య గురుకుల అధ్యాపక్ ,ప్రెసిడెంట్ .యాజ్ఞవల్క్య సహస్రనామావళి అనే ఏకైక గ్రంధరచయిత
544-అభావ విమర్శ కర్త –దీపక్ ఘోష్ (1941)
1941జనవరి 24 కలకత్తాలో పుట్టిన దీపక్ ఘోష్ రాసిన 6పుస్తకాలలో –అభావ విమర్శ ,విలాప పంచిక ,సంస్కృత రబీంద్ర సంగీతం ,మేఘ విలాప ,సురవాగ్ విలాస ,అమరవిలాప ,ఉజ్జయిని విలాస ఉన్నాయి
545-కొల్లాల అమృతా చే కర్త -. ,వాసుదేవ పురుషోత్తం గిండే(1937)
19-1-1937పుట్టిన వాసుదేవ పురుషోత్త౦ గిండే సంస్కృత మరాఠీ ఏం ఏ .కల్లోల అమృతాచే ,జానేశ్వారి టిల్ రస తీర్ధే,ఏక్ రసవాదే రాశాడు .
546-భైరవీ మహా విద్య కర్త – గోస్వామి ప్రహ్లాద్ గిరి (1959)
1959జూన్ 22ఒరిస్సా బలాన్ గిరి లో పుట్టిన గోస్వామి ప్రహ్లాద్ గిరి సాహిత్య ,శంకర వేదాంత ,దర్శన ఆచార్య .డిపార్ట్ మెంట్ ఆఫ్ ధర్మాగారం టీచర్ .బెనారస్ హిందూ యూనివర్సిటి ఫాకల్టి మెంబర్ .ఆయనది శంకరాచార్య గురుపరంపర .29గ్రంథాలు రాశాడు .భైరవి మహా విద్య ,భువనేశ్వరి మహావిద్య ,షోడశి మహావిద్య ,శ్రీ చక్ర నిరూపణం,సావిత్రీరాస్ట్రాధ్యాయి అందులోకొన్ని .
547-వాది వినోద కర్త –విశ్వ౦భర్ నాద గిరి –(1953)
1-4-1953మీర్జాపూర్ లో పుట్టిన విశ్వ౦భర్ నాద గిరిపూర్వ మీమా౦స లో ఎం ఏ .వాదివినోద ,శ్రీ కృష్ణ లీలా ,దశకుమార చరిత్రం రాశాడు .
548-జైమిని సూత్ర కర్త –పి.వి.గోపకుమార్ (1971)
1971మే 20న కేరళ కొత్తమంగళంలో పుట్టిన పి.వి.గోపకుమార్ సాహిత్యాచార్య .ఎక్సిక్యూటివ్ ప్రెసిడెంట్ .జైమిని సూత్రాలు మాత్రమె రాశాడు .
549-వ్యవహార సూక్త కర్త –కాశీనాద్ గోపాల గోరె (1936)
3-6-1936హిందీ సాహిత్యరత్న ఎలఎల్ బి గోల్డ్ మెడలిస్ట్ ,సంగీత విశారద ,తెలుగు కోవిద .యుపి ప్రభుత్వ జాయంట్ సెక్రెటరి .7పుస్తకాలు రాశాడు .వ్యవహార సూక్త ,కాళీ గీత ,యోగ అండ్ స్వాస్త్య అందులో ఉన్నాయి .ఎన్నో సంస్థలకు గౌరవ హోదాలలో ఉన్నాడు
550-సంస్కృత పాఠ సంగ్రహ కర్త –భారతి గోస్వామి (1962)
1962 జనవరి 29అస్సాం లోని దూలాజిల్లా మాజ్ గావ్ లో పుట్టిన భారతి గోస్వామి గౌహతిలో ప్రొఫెసర్ .3పుస్తకాలురాసింది . సంస్కృత పాఠ సంగ్రహ 3భాగాలు,సంస్కృత వ్యాకరణ జ్యోతి రచనలు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-3-20-ఉయ్యూరు