గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం
551-భావ శతక కర్త –చంద్ర కిషోర్ గోస్వామి (1938)
27-21938 న రాజస్థాన్ భరత్ పూర్లో జన్మించిన చంద్ర కిషోర్ గోస్వామి సంస్కృత పిహెచ్డి,ఫ్రెంచ్ డిప్లోమాహోల్డర్.వనస్థలి విద్యా పీఠం లో దర్శన వేదిక్ స్టడీస్ లో ప్రొఫెసర్ .సంపూర్ణానంద మిశ్ర ,కాడి పుండరీక ,కృష్ణచంద్ర శర్మ ,ప్రేమనిది శాస్త్రి గురుపరంపర .భావశతకం , పృధ్విరాజ జయం ,కావ్యాంజలి ,దాన వీర కర్ణ,గీతాంజలి రాశాడు .రాజస్థాన్ ప్రభుత్వ సంస్కృత పురస్కారం ,అంబికా దత్ వ్యాస్ పురస్కారం పొందాడు .
552-హఠ యోగ ప్రదీపిక కర్త –గోకులేంద్ర నారాయణ దేవ గోస్వామి (1968)
1968ఏప్రిల్ 1న అస్సాం లో ద్వీపరసాస్ట్ర నల్బరి లో పుట్టిన గోకులేంద్ర నారాయణ దేవ గోస్వామిగౌహతి ప్రభుత్వకాలేజి మీమా౦స శాస్త్ర హెడ్ .రాసిన 17పుస్తకాలలో హఠ యోగ దీపిక ,వేదమంజరి ,రాదా తంత్ర ఉన్నాయి .హేమ చంద్ర గోస్వామిఅవార్డ్ పొందాడు .
553-విరహిణీ వ్రజా౦గనా కర్త –గోర్ కిషన్ గోస్వామి (20శతాబ్ది )
20వ శతాబ్దికి చెందిన గోర్ కిషన్ గోస్వామి-కావ్య తీర్ధ .,పురాణ ,దర్శన తీర్ధ .ఆయుర్వేద శిరోమణి .బృందావన్ గురుకుల ఆయుర్వేద ఫాకల్టి హెడ్ .విరహిణీ వ్రజా౦గనా అనే ఏకైక కావ్యం రాశాడు .
554-సింహ సిద్ధాంత సి౦ధు కర్త –హరి కృష్ణ గోస్వామి( 1909-1979)
1909లో రాజస్థాన్ జైపూర్ మహాపుర లో పుట్టిన హరి కృష్ణ గోస్వామి-సాహిత్య ,న్యాయ ,శుద్ధాద్వైత వేదాంత నిష్ణాతుడు .ఉదయపూర్ సంస్కృత కాలేజి ప్రొఫెసర్ ,అజ్మీర్ సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ .రాసిన 25పుస్తకాలలో సింహసిద్ధా౦త సింధు ,ఆదర్శ సౌందర్యం ,లలితాకథ కల్పలత ,దివ్యాలోకః ఉన్నాయి .1979లో 70ఏళ్ళ వయసులో చనిపోయాడు .గద్యపద్య స్మార్ట్ అవార్డ్ ,మాఘ అవార్డ్ లుపొందాడు .
555-వర్షావలి కర్త –హరిరాయ్ గోస్వామి (1950)
1950మే 22 జోద్ పూర్ లోపుట్టిన హరిరాయ్ గోస్వామి సాహిత్య ఆచార్య .మాఘ పురస్కార గ్రహీత .రాసిన 7పుస్తకాలలో జరాసంధవధ మహాకావ్యం ,వర్షా వలి ,పురుస్సంభవ మహాకావ్యం ఉన్నాయి .
556-మహాత్మా విదుర కర్త –రోహిణీ వల్లభ శాస్త్రి గోస్వామి (1952)
1952అస్సాం దేరాగావ్ లో పుట్టిన రోహిణీ వల్లభ శాస్త్రి గోస్వామి జ్యోతిష శాస్త్ర ఆచార్య .మహాత్మా విదుర ,భక్తరాజ ,సంస్కారతత్వ ,సుభాషితం మొదలైన 13పుస్తకాలు రాశాడు .
557-అవయవ చింతామణి కర్త –సుబుద్ధి చరణ్ గోస్వామి (1944)
1944 మే 20న వెస్ట్ బెంగాల్ బర్ద్వాన్ లో పుట్టిన సుబుద్ధి చరణ్ గోస్వామి-కలకత్తా రవీంద్రభారతి యూనివర్సిటి ప్రొఫెసర్ .గణేశ అవయవ చింతామణి ,కణాద టిప్పణి రాశాడు .
558-స్మార్త ప్రభు కర్త –విద్యాధర్ గౌర్ (1886-1941)
1886 హర్యానా రొహ్ టక్ లో పుట్టిన విద్యాధర్ గౌర్ కాశీ హిందూ యూనివర్సిటి డీన్.పండిట్ ప్రభుదత్త గౌర్ ,పండిట్ వామచరణ గురుపరంపర .అనేకమంది ప్రసిద్ధ శిష్యులున్నారు స్మార్త ప్రభు ,ప్రతీషాప్రభు ,వివాహ ,ఉపనయన పధ్ధతి ,వాస్తు శాంతి పధ్ధతి మొదలైన 8పుస్తకాలురాశాడు .1941లో 55వ ఏటనే మరణించాడు .మహామహోపాధ్యాయ ,వైదిక, స్మార్త యాజ్ఞిక సామ్రాట్ ,వైదిక చక్రవర్తి ,విద్యా వాచస్పతి ,విద్యాభూషణ ,ధర్మాలంకార ,మహాపండిత మొదలైన సార్ధక బిరుదాంకితుడు
559-ధర్మ విజయ చంపు కర్త –కె.వి .గోవిందం (1948)
1948సెప్టెంబర్ 3పుట్టిన కె.వి .గోవిందం-శిక్షా శాస్త్రి, విద్యా వారిది .కృష్ణ యజుర్వేద తైత్తిరీయ శాఖ ,మీమాంస , విశిష్టాద్వైత ల లోతులు తరచినవాడు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ .17పుస్తకాలు రాశాడు .అందులో ధర్మ విజయచంపు ,ఆత్మత్వ జాతి విచార ఉన్నాయి .నవ్యన్యాయ ప్రవీణ్ విపశ్చిన్మణి బిరుదాంకితుడు .ఎన్నో అకాడేమీలనుంచే కాక ప్రెసిడెంట్ అవార్డీ కూడా
560-పంచనద దేశస్తవః-కర్త –పండిట్ చంద్రశేఖర శర్మ గులేరి (1883-1922)
పండిట్ చంద్ర శేఖర గులేరి 7-7-1883న రాజస్థాన్ అజ్మీర్ లో పుట్టి 12-9-1922న 39ఏళ్ళకే చనిపోయాడు .సాహిత్య దర్శన ,లింగ్విస్టిక్స్ లో నిపుణుడు .అజ్మీర్ మేయోకాలేజి ప్రొఫెసర్ .పృధ్విరాజ విజయ , పంచనద దేశస్తవః(పంజాబ్ స్తుతి ).స్మార్త సిద్ధాంతాన్ని సంస్కృతం నుంచి ఇంగ్లిష్ లోకి అనువదించాడు .సమాలోచన,నాగరీ ప్రచారిణి సంస్కృత పత్రికల సంపాదకుడు .అపూర్వమైన కథలను హిందీలో ‘’ఉస్నే కహా థా’’పేరున రాసి ప్రచురించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ 29-3-20-ఉయ్యూరు